Skip to main content

29 May 2017

దేవునిఆత్మ యెహేజ్కేలును తీసుకుపోయి మానవ అస్థిపంజరాలతో నిండి ఉన్న ఒక లోయలో దించాడు. అవి బాగా ఎండిపోయి ఉన్నాయి.
దేవుడు-"నరపుత్రుడా,ఈ ఎముకలు బ్రతకగలవా?"
యెహేజ్కేలు-"యెహోవాప్రభూ! అది నీకే తెలుసు!"
అందుకు ఆయన-"ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటితో ఇలా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా! మీరు బ్రతుకుతారు.నేను మీకు నరాలూ మాంసమూ ఇస్తాను. మీమీద చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తాను'"
ఆవిధంగానే ప్రవక్త పలుకుతూండగానే గడగడ అని శబ్దంతో ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొన్నాయి. నేను ఇంకా చూస్తూడగానే ఎముకల మీదికి నరాలు, మాంసం వచ్చాయి; వాటిమీద చర్మం కప్పబడింది. అయితే వాటిలో ఊపిరి లేదు.
అప్పుడు ఆయన-"జీవాత్మవచ్చునట్లు దైవావేశంతో చెప్పు!"
ఆవిధంగానే పలుకగా..వెంటనే శవాలలోకి ఊపిరి వచ్చింది. వారు సజీవులై గొప్ప సైన్యంగా నిలబడ్డారు.!

దేవుడు శరీరాన్ని, జీవాత్మని వేరువేరుగా అనుగ్రహించాడు. ఆదిలో ఆదామును పుట్టించినప్పుడు కూడా అలాగే చేశాడు. ఎంతో విలువైన, అత్యంత ఙ్ఞానంతో రూపొందించబడిన ఈ శరీరంలో జీవాత్మలు ఉన్నప్పుడే చక్కగా పనిచేసి, విలువను కలిగివుంటుంది. ఒకవేళ లేకుంటే దాని విలువ శూన్యం(పాతి పెట్టబడుతుంది కదా!). ఈ జీవాత్మ దేవుని(ఆత్మ) మూలంగానే మనకు ఇవ్వబడింది.
ఇది దేన్నీ తెలియజేస్తుందంటే..దేవుని ఆత్మలేని దేవుని వాక్యం జ్ఞానాన్ని సూచిస్తుంది. అది జీవంలేని విలువైన శరీరంతో సమానం. వాక్య జ్ఞానము మాత్రమే కలిగి జీవంలేకుండా ఉన్న(శాస్త్రులు పరిసయ్యుల భక్తివలె) ఎందరో క్రైస్తవులు ఉన్నారు. కారణం ఆ వాక్యంలో జీవం లేదు. మనలో ఈ వాక్యాన్ని జీవితంగా మార్చేది దేవునిఆత్మే(పరిశుద్ధఆత్మే)!!
మీరు ఒంటరులు కారు మీకు సహాయహకున్ని పంపుతానని ప్రభువు చెప్పలేదా? ఆయన వారిపైకి, వారిలోకి, వారితో ఉన్నప్పుడు శిష్యులు జీవం కలిగి నూతన వ్యక్తులుగా అవ్వలేదా? దేవుని ఆత్మ సహయం లేకుండానే(ఆధారపడకుండానే) క్రొత్త నిబంధన జీవితాన్ని కొనసాగించాలనుకోవటం ఎంత బుద్దిహీనత!
మృతులలో నుండి యేసును లేపినవాని "ఆత్మ" మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న "తన ఆత్మ" ద్వారా జీవింపజేయును.(రోమా 8:11)
క్రీస్తులో ఉన్న కృప ద్వారా ఎండిపోయిన క్రైస్తవ జీవితానికి ఉపిరి(జీవం) పొసేది పరిశుద్దాత్ముడే! వాక్య జ్ఞానాన్ని బట్టి అతిశయపడొద్దు..మోసపోవద్దు!జీవంలేని వాక్య జ్ఞానం వ్యర్థం.

Comments

Post a Comment

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...