Skip to main content

Posts

Showing posts from January 4, 2018

04Jan2018

❇ బాప్తిస్మమిచ్చే యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చాడు.యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలోనుంచి బయటికి వచ్చాడు.వెంటనే ఆకాశం తెరచుకొంది.దేవుని ఆత్మ ఒక పావురంలాగా దిగివచ్చి తనమీద వాలడం ఆయన చూశాడు.అప్పుడే ఆకాశంనుంచి ఒక స్వరం ఇలా వినిపించింది౼ “ఈయనే నా ప్రియమైన కుమారుడు. ఈయనంటే నాకెంతో ఆనందం.” ❇ ■ దేవుడు యేసును బట్టి ఆనందించాడు. అప్పటికి ఆయన ఏ అద్భుతాలు-సూచక కార్యాలను గాని, సేవను గాని ప్రారంభించలేదు. మరి తండ్రి సంతోషం దీనిలో (ఎందుకు)? యేసు జీవితాన్ని బట్టి. వడ్రంగి వృత్తిలో ఉంటూ, తన కుటుంబ బాధ్యతలను కలిగి ఉంటూ, దేవునికి ప్రధమ స్థానం ఇస్తూ నీతిమంతుడై జీవించాడు.అంతే కాని ఆయన త్రియేక దైవత్వంలోని ఒకడని మాత్రం కాదు (హెబ్రీ 5:8, 2:18). క్రీస్తు వలె దేవుణ్ని సంతోష పెట్టిన సంపూర్ణుడు మరొరు లేరు. అంటే స్వచిత్తానికి సిలువ వేసి(ప్రక్కన పెట్టి) దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్న నరుడు లేడు.అనగా క్రీస్తు పరమ తండ్రి తన కోసం నిర్దేశించిన ప్రతి ప్రణాళికల నుండి తొలగిపోక తనను తాను అప్పగించుకొన్నాడు(మొదటి మానవుడు దేవుని మాటను వినక-బుద్ధి పూర్వకంగా తప్పిపోయినది,స్వచిత్తాన్ని కొనసాగించడమే అని గ...