Skip to main content

Posts

Showing posts from July 14, 2017

23 May 2017

మన జీవితములో కొన్ని మలుపులు దేవునిచేత త్రిప్పబడతాయి. ఎవ్వరైతే దేవున్ని ప్రేమిస్తారో అన్ని (ప్రతికూల) పరిస్థితులు కూడా మేలుగా మారతాయి.(రోమా 8:28) యోసేపు పొలాల్లో తిరుగుతోంటే ఒక మనిషి చూశాడు. ఆ మనిషి-“ఏమిటి వెదుకుతున్నావు” అన్నాడు. యోసేపు-“నేను నా అన్నల కోసం వెదుకుతున్నాను. వాళ్లు గొర్రెల్ని మేపుకొంటూ ఎక్కడ ఉన్నారో నీవు చెప్పగలవా?”  ఆ మనిషి-“అప్పుడే వాళ్లు వెళ్లిపోయారు గదా. వాళ్లు దోతాను వెళ్తాం అని చెప్పుకోవటం నేను విన్నాను” కనుక యోసేపు తన అన్నలను వెతుకుంటూ దోతానుకు వెళ్లి వారిని అక్కడ చూశాడు.తర్వాత అన్నలు యోసేపును ఐగుప్తుకు బానిసగా అమ్మివేయటం, ఎన్నో కష్టాలగుండా యోసేపు వెళ్లి, దేవుని చిత్త ప్రకారం ఐగుప్తుకు గొప్ప పరిపాలకుడు అవ్వటం మనకు తెలిసిందే . అతని జీవితంలో పైన చెప్పిన ఆ మనిషిని దేవుడే వాడుకున్నాడు. యోసేపు వెను వెంటనే ఇతని గూర్చి ఆలోచిస్తే, ఆ మనిషిని కలుసుకోక పోతే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదని అనుకునే వాడేమో! కాని, సుదీర్ఘ జీవిత ప్రయాణంలో ఈ మలుపు దేవునిచేత మంచి కొరకే తిప్పబడిందని గ్రహించాడు. అలాగే మన జీవితంలో మనం కలుసుకొనే కొన్ని చేదు అనుభవాల వెనుక దేవుని హస్తం ఉన్నదని,...

24 May 2017

పౌలు-"నేను ఏ స్థితిలో ఉన్నా ఆస్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకొన్నాను." (ఫిలిప్పీ 4: 11) లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు ఉండేవి. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి.ధనవంతుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు. ఆ భిక్షగాడు చనిపొయ్యాడు. అతణ్ణి దేవదూతలు(పరదైసుకు) తీసుకువెళ్ళి అబ్రాహాము ప్రక్కన కూర్చుండబెట్టారు.  అబ్రాహాము బ్రతికి ఉన్న రోజుల్లో గొప్ప ధనవంతుడు.లాజరు దరిద్రుడు. వీరిద్దర్నీ ఒకచోట చేర్చింది వారికి దేవునిపై ఉన్న విశ్వాసం. లాజరు కడు బీదరికంలో, జబ్బులతో ఉన్నా ఎన్నడూ దేవుని తిట్టలేదు, ఎవ్వరితో తన స్థితిని పోల్చుకోలేదు. చివరికి దిక్కులేని చావును పొందినప్పటికీ, తన అంతిమ స్థితి దేవుని చెంతేనని విశ్వాసం కలిగి జీవించాడు.దేవుడు ఉంచిన ప్రతి పరిస్థితితుల్లో నమ్మకంగా దేవుణ్ణి సేవించాడు. అబ్రాహాం తన జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. దేవుని ముందు ధనాన్ని గడ్డిపరకతో సమానంగా ఎంచాడు. జరగటానికి ఎలాంటి అవకాశాలు లేని వాటిని దేవుడు వాగ్దానం చేస్తే, నిస్సందేహంగా నమ్మి, వాటికోసం ఎదురుచూశాడు. అతను ఎంతో ఇష్టపడ...

25 May 2017

దేవుడు సీనాయి పర్వతం మీదకు మోషేను పిలిచాడు.మోషే అక్కడ నలభై పగళ్ళూ నలభై రాత్రులూ ఉండిపొయ్యాడు.మోషే రావడం ఆలస్యం కావడం ప్రజలు చూచి.. అహరోనుతో- "చూడు! మా ముందర వెళ్ళడానికి ఒక దేవుణ్ణి మా కోసం చెయ్యి. మమ్మల్ని ఈజిప్ట్‌దేశంనుంచి తెచ్చిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు" అన్నారు. అప్పుడు ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు. వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు మరియు ఒక బలిపీఠం నిర్మించాడు."రేపు యెహోవాకు ప్రత్యేక పండుగ" అని చెప్పాడు. ఒక్క దైవికమైన నాయకుడు(మోషే) అక్కడ లేకపోవడాన్ని బట్టి అప్పుడు గొప్ప నాశనం జరిగింది. దేవుణ్ణి పోలిన (దేవునితో నడిచే) ఒక్క వ్యక్తి చాలు, గుంపును దైవికంగా నడిపించడానికి. ప్రజల మెప్పు కోసం కాక(వారికి భయపడక), దేవుణ్ణి సంతోషపెట్టే నాయకత్వమే శ్రేష్ఠమైన నాయకత్వం. ఇలాంటి నాయకత్వాన్ని సహజంగానే ప్రజలు కోరుకొరు. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. తమకు నచ్చినట్లు ప్రవర్తించే నాయకుడ్నే , దేవుణ్ణే (మాట్లాడలేని విగ్రహన్ని) మనుష్యులు కోరుకుంటారు. విశాల మార్గానికి పొయ్యెవారు అనేకులు. దానికి నడిపించే నాయకులంగా మనం ఉండకూడదు.(విశ్వాసుల గూర్చి చెప్తున్నాను) పౌలు ఎఫ...

26 May 20117

హోషేయ అనే దైవజనుడు(ప్రవక్త), ఒక వేశ్యను పెండ్లి చేసుకొన్నాడు. అప్పటికే ఆమెకు ఒక ప్రియుడు ఉన్నాడు. ఇంకా రహస్యంగా తన వ్యభిచారం కొనసాగిస్తూనే ముగ్గురు పిల్లల్ని కన్నది. తన పిల్లలు కాదని తెల్సినా హోషేయ వారిని ప్రేమతో చూశాడు. తన ప్రేమను అర్థం చేసుకొని, తన భార్య మారాలని ఎంతో ఎదురు చూశాడు... హోషేయ లాంటి భక్తిపరుడు, పవిత్రుడు, ఇలాంటి స్త్రీని పెండ్లి చేసుకోవడమే గొప్ప త్యాగం! ఇంకా తనకు నమ్మకద్రొహం చేస్తున ్న ప్రేమిస్తూనే ఉన్న హోషేయ మంచితనం చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఆ స్త్రీ పై కోపం వస్తుంది. నిజానికి హోషేయ స్థానంలో దేవుడు ఉన్నాడు, ఆ స్త్రీ స్థానంలో మనం ఉన్నాము. అపవిత్రతో, అసహ్యమైన పనులతో బ్రతుకుతున్న మన పట్ల, పరిశుద్దుడైన దేవుడు కృప చూపి ప్రేమిస్తుంటే, ఆయన నుండి సకల మేలులు, వనరులు పొందుకుంటున్న మనం ఆయనను చులకనగా చూస్తూ,ఆయన ప్రేమను పట్టించుకోకుండా ఉన్నా, తన అపారమైన ప్రేమతో ఇంకా ప్రేమిస్తునే ఉన్నాడు. మనస్సు మార్చుకొని ఆయన ప్రేమను అర్ధం చేసుకోవాలని నీ సృష్టికర్త నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. మన స్వేచ్ఛలో నుండే మంచిని (దేవుణ్ణి) కోరుకోవాలి. అంటే దేవుణ్ణి విడచి తిరుగుతున్న ఈ జీవితం నుండి దే...

27 May 2017

యేసు ఒక కథ చెప్పాడు. ఒక ధనికునికి యిద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నవాడు వాళ్ళ నాన్నతో గొడవపడి, ఆస్తిలో తన వాటా తీసుకొని, దూరంగా వెళ్ళి, డబ్బంతా ఖర్చుచేశాడు. కాని పెద్ద వాడు మాత్రం నాన్నతోనే ఉన్నాడు. కొన్నిరోజుల తర్వాత చిన్నవాడు అంతా కోల్పోయి, తప్పు చేసానని తెలుసుకొని తిరిగి నాన్న దగ్గరికి వచ్చాడు. మంచివాడైన ఆ తండ్రి జాలిపడి, మరుమాట్లాడకుండా సంతోషంతో దగ్గరకి తీసుకొని పెద్ద విందు కూడా చేశాడు.ఇలా చేస్త ున్నందుకు పెద్దోడికి చాలా కోపం వచ్చింది,ఇలాంటి వాడికి ఈ విధంగా చేసావు, కాని నా విషయంలో ఎప్పుడూ ఇలా చెయ్యలేదని తండ్రితో వాగ్వివాదానికి దిగి ఇంట్లో కూడా రాలేదు. కారణం..తమ్ముడుతో తనను తాను పోల్చుకొన్నాడు. "నేను తమ్ముడులాంటోడ్ని కాదు..చాలా మంచోడ్ని! వాడు చేసిన తప్పులు ఎన్నడూ నేను చేయ్యలేదు!!" అనుకొన్నాడు. ఇది స్వంత నీతి. దీనితో ఎవ్వడూ దేవుని రాజ్యంలోకి రాడు.దేవుని కొలత మన ప్రక్కన ఉన్నవాడు కాదు..దేవుని నీతి.నిజానికి అతను పోల్చుకోవాల్సింది తండ్రితో! ఆయన ప్రేమను,జాలిని, మంచితనాన్ని, క్షమాపనని చూసి నేర్చుకువాల్సింది. దేవుడు ఈ కథ చెప్పింది ఎదుటి వారి కంటే మేము మంచివారమే అని అనుకోనేవారితో...

29 May 2017

దేవునిఆత్మ యెహేజ్కేలును తీసుకుపోయి మానవ అస్థిపంజరాలతో నిండి ఉన్న ఒక లోయలో దించాడు. అవి బాగా ఎండిపోయి ఉన్నాయి. దేవుడు-"నరపుత్రుడా,ఈ ఎముకలు బ్రతకగలవా?" యెహేజ్కేలు-"యెహోవాప్రభూ! అది నీకే తెలుసు!" అందుకు ఆయన-"ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటితో ఇలా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా! మీరు బ్రతుకుతారు.నేను మీకు నరాలూ మాంసమూ ఇస్తాను. మీమీద చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తాను'" ఆవిధంగానే ప్రవక్త పలుకుతూండగానే గడగడ అని శబ్దంతో ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొన్నాయి. నేను ఇంకా చూస్తూడగానే ఎముకల మీదికి నరాలు, మాంసం వచ్చాయి; వాటిమీద చర్మం కప్పబడింది. అయితే వాటిలో ఊపిరి లేదు. అప్పుడు ఆయన-"జీవాత్మవచ్చునట్లు దైవావేశంతో చెప్పు!" ఆవిధంగానే పలుకగా..వెంటనే శవాలలోకి ఊపిరి వచ్చింది. వారు సజీవులై గొప్ప సైన్యంగా నిలబడ్డారు.! దేవుడు శరీరాన్ని, జీవాత్మని వేరువేరుగా అనుగ్రహించాడు. ఆదిలో ఆదామును పుట్టించినప్పుడు కూడా అలాగే చేశాడు. ఎంతో విలువైన, అత్యంత ఙ్ఞానంతో రూపొందించబడిన ఈ శరీరంలో జీవాత్మలు ఉన్నప్పుడే చక్కగా పనిచేసి, విలువను కలిగివుంటుంది. ఒకవేళ లేకుంటే దాని...

31 May 2017

సంసోను-"నేను తిమ్నాతులో ఫిలిష్తీయ జాతి అమ్మాయిని ఒకదానిని చూశాను. నేనామెను పెళ్లి చేసుకుంటాను" అన్నాడు. అతని తల్లిదండ్రులు-"మన బంధువులలో గానీ, మన ప్రజలందరిలో గానీ అమ్మాయి లేదనా, 'సున్నతి పొందని(భక్తిలేని)' ఫిలిష్తీయ జాతి అమ్మాయిని పెండ్లాడతానంటున్నావు?” అని అతనితో చెప్పారు. కాని సమ్సోను-"ఆ స్త్రీని నా కోసం తీసుకురండి.ఆమె నాకు నచ్చింది".(న్యాయ 14:3) తర్వాత రోజుల్లో.. సంసోను గాడిద దవడ ఎముకను చేతపట్టుకొని దానితో వెయ్యిమందిని ఫిలిష్తీయులను హతమార్చాడు.అప్పుడు అతనికి బాగా దప్పికయ్య ింది. "నీ సేవకుడైన నా చేతితో ఈ గొప్ప విడుదల ప్రసాదించావు. ఇప్పుడు నేను దాహంతో చచ్చి, ఈ 'సున్నతి పొందని(భక్తిలేని)వాళ్ళ' చేతులకు చిక్కుపడాలా?" అని యెహోవాకు ప్రార్థన చేశాడు.(న్యాయ 15:15,18) సంసోను విలువైన నిర్ణయాల్లో, సొంత నిర్ణయాలు చేశాడు(దేవుణ్ణి అడగలేదు). తన అవసరాల్లో మాత్రం దేవునికి మొఱ్ఱపెట్టాడు. సున్నతిలేని వారితో చనిపోవడానికి ఇష్టపడలేదు, కాని ఆ జాతి స్త్రీని పెండ్లాడేటప్పుడు అతనికి సున్నతి గుర్తురాలేదు. ఇలా ప్రవర్తించినందుకు సంసోను భార...

1 June 2017

మతాధికారులు యేసు మీద నేరం మోపాలని వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన ఒక స్త్రీని ఆయన దగ్గరకి తీసుకొని వచ్చారు. వాళ్లు-"మన చట్టం ప్రకారం ఇలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. మరి నీవేమంటావ్?!" యేసు వంగి వ్రేలితో నేలమీద ఏదో వ్రాశాడు.వారు పట్టు విడవకుండా అడుగుతూనే ఉన్నారు.అప్పుడు యేసు-"మీలో ఏ పాపం లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చు!" అన్నాడు. ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరగా అక్కడి నుండి వెళ్ళటం మొదల ుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు. యేసు తలెత్తి చూస్తూ, “అమ్మా, నీ మీద నేరం మోపినవారు ఎక్కడ?నిన్నెవ్వరూ శిక్షించలేదా?” అని అడిగాడు. యేసు ఆమెను "అమ్మా!" అని పిలిచాడు.ఒకవేళ ఆమెకు పిల్లలు ఉన్నట్లయితే ఆ సమయంలో అలా ఆమెను పిలిచుండేవారు కాదేమో!.ఈ మాటతో దేవుడు పాపాత్ముల పట్ల ఆయన (ప్రేమా) వైఖరిని తెలిజేస్తున్నాడు. పాపం చేసి, ఏ మాత్రం అర్హత లేని మనకు క్రీస్తులో ఉన్న గొప్ప నిరీక్షణ చూడండి! ఇది దేవుని కృప. ఆయన మంచితనం.(విశ్వాసి ఈ కృపను ఎన్నడూ మరువకూడదు) దేవుడు ఎల్లప్పుడూ బలహీనులై, కృంగిన వారి పక్షాన నిలబడతాడు...

2 June 2017

దేవుని మాట వినకుండా పతనమైపోతున్న ఇశ్రాయేలు గూర్చి ప్రవక్తయైన యిర్మీయా చెప్పిన భవిష్యద్ వాక్కు. "నేను భూమివైపు చూశాను. అది శూన్యంగా, రూపం లేని స్థితిలో ఉంది. నేను ఆకాశంవైపు చూశాను.అక్కడ వెలుగు లేదు.."(యిర్మీ 4:23) ఆదిలో సాతాను దేవుని పై తిరుగుబాటు చేసి, పడిపోయినప్పుడు, వాడు భూమి మీద పడిన తర్వాత,వాడి మూలంగా చెడిపోయిన భూమి స్థితితో యిర్మీయా పోల్చుతున్నాడు.(యెహె 28:14-18, యెషయా 14:12-15, 45:18, ఆది   1:2) ఇది (పాపాన్ని ప్రేమిస్తూ) దేవుని మాటను తిరస్కరిస్తూ, ఆయనపై తిరుగుబాటు చేస్తున్న వారి హృదయానికి గుర్తుగా ఉంది. చెడిపోయిన దానిని దేవుడు ఎప్పుడూ కట్టే వానిగా ఉంటున్నాడు.   ఆదిలో నిరాకారంగా ఉన్న భూమికి అందమైన ఆకారాన్ని ఇచ్చాడు (ఆది 1:3). శత్రువుల చేత పాడుచేయబడిన ఇశ్రాయేలును, చెరశిక్ష నుండి విడిపించి, మళ్ళీ పునఃనిర్మిస్తానని వాగ్దానం చేశాడు (యిర్మీ 33:7).   నేడు దేవుని మాటను పెడచెవి పెట్టి తిరుగుతున్న వారు, దేవుని తట్టు తిరిగితే, నూతన స్థితిని(మొదటి స్థితిని) అనుగ్రహిస్తానని మాట ఇస్తున్నాడు(లూకా 19:10). ఇప్పుడు ఉన్న స్థితి ఎంత చెడిపోయి ఉన్నా, దేవుని పాదాల చెంత మనకు ఎల్లప్పుడూ...

3 June 2017

-- భక్తిపరుడైన దావీదు రాజు, ఊరియా అనే సైనికుని భార్యతో వ్యభిచారం చేసి, అతనిని చంపించి, అతని భార్యని పెండ్లి చేసుకున్నాడు. ఇలాంటి తప్పుడు పని దేవుని భయంలేని వాళ్ళు కూడా చేసివుండరు. కాని దేవుడు దావీదును గూర్చి ఇలా అన్నాడు. "దావీదు హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తను బ్రతికిన కాలమంతా దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకొంటూ, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేనికీ అవిధేయుడు కాలేదు" (1రాజులు 15:4) తర్వాత అతని సంతతి నుండి వచ్చిన అనేక మంది రాజులతో కేవలం దావీదును బట్టి వారి రాజ్యాన్ని కాపాడుతున్నానని దేవుడు చెప్పాడు.(2రాజులు 19:34) -- పేతురు మూడున్నర సంవత్సరాలు యేసుతో ఉండి, దేవుని మాటలు చాలా విన్నాడు, అద్భుత కార్యాలూ చూశాడు. కాని ప్రభువు సిలువకు అప్పగించుకొన్నప్పుడు, ఆయన ఎవరో నాకు తెలియదని మూడు సార్లు అబద్దమాడాడు. క్రీస్తు మరణం నుండి లేచిన తర్వాత, అలాంటి పేతురుకు దేవుని సంఘం బాధ్యతను అప్పగించాడు. ఒకప్పుడు అబద్దమాడిన పేతురు ద్వారా, దేవునిఆత్మతో అబద్దమాడిన వ్యక్తులకు (అననీయ,సప్పీరాలకు) దేవుడు తీర్పుతీర్చాడు. ఈ సంఘటనలు ఏమి తెలియజేస్తున్నాయి? ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని అతని బలహీనతలను బట...

4 June 2017

గొడ్రాలైన హన్నా, ఆమె సవతి సూటిపోటి మాటలవల్ల ఎంతో దుఃఖపడి దేవుని మందిరానికి వెళ్లి ఒక మ్రొక్కుబడి చేసుకుంది. "సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా! నన్ను జ్ఞాపకం చేసుకో! నాకొక కుమారుని కలుగజేస్తే, వాడ్ని జీవితాంతం నీ సేవకై విడిచి పెడ్తాను" అంది. దేవుడు హన్నా ప్రార్థనను ఆలకించి, ఒక మగబిడ్డను అనుగ్రహించాడు. ఆమె దేవుణ్ణి ఎంతో స్తుతించింది. ఈ సంఘటన వెనుక ఉన్న దేవుని ఉద్దేశ్యలను ఆలోచిద్దాం! దేవుడు ఒక దైవికమైన వ్యక్తిని భూమి పైకి పంపాలని ఉద్దేశించాడు. ఆ వ్యక్తి గూర్చి ఎన్నో ఆలోచనలు దేవునికి ఉన్నాయి. కాబట్టి ఎంతో ప్రార్ధనాపూర్వకంగా ఆ బిడ్డను పంపాలనుకున్నాడు. హన్నాను శ్రమలాగుండా తీసుకెళ్తూ, అత్యాశక్తితో ప్రార్ధించేటట్లు నడిపించాడు. "ఈ బిడ్డ నీ వాడే ప్రభూ!" అని దేవునికి ప్రతిష్టించే వరకు ఆ బిడ్డను పొందుకోలేకపోయింది. అంతేకాదు ప్రతిష్ఠితుడైన వానిలో ప్రార్ధనాపూర్వకంగా, దైవికంగా పెంచేటట్లు(దైవికమైన పునాది వేయునట్లు) దైవభయం గల ఆ స్త్రీకే అనుగ్రహించాడు (1సమూ 1:28,2:26). ఆయనదైన సమయంలో ఆ ప్రణాళికలను ఆ బిడ్డకు తెలియజేశాడు. తర్వాత రోజుల్లో ఆ వ్యక్తి రాజులను నియమించే గొప్ప ప్రవక...

6 June 2017

దావీదు తన కుమారుడైన అబ్షాలోము, తనను చంపాలని చూసినప్పుడు బహూరీముకు వచ్చాడు. సౌలు కుటుంబానికి చెందిన వాడైన "షిమీ" దావీదును శపిస్తూ, దావీదు మీద, అతని సేవకులందరి మీదా రాళ్ళు రువ్వుతూ-- "వెళ్ళిపో! హంతకుడా! దుర్మార్గుడా! వెళ్ళిపో! నీవు సౌలు ఇంటివాళ్ళను హత్య చేసి, సౌలు స్థానంలో రాజయ్యావు గాని, నీవు చేసిన రక్తపాతానికి దేవుడు నీకు ప్రతీకారం చేస్తున్నాడు. దేవుడు నీ కొడుకు అబ్షాలోము చేతికి రాజ్యాన్ని ఇచ్చివ ేశాడు. నీవు చేసిన చెడు కార్యాలన్నీ ఇప్పుడు నీకే జరుగుతున్నాయి! ఎందువల్లంటే నువ్వొక హంతకుడవు!" అని దూషించాడు. అబీషై దావీదుతో- "నా ప్రభువైన రాజును ఈ చచ్చిన కుక్క ఎందుకు తిట్టాలి? నన్ను వెళ్లి షిమీ తల నరికివేయనీయండి!" అన్నాడు. అందుకు దావీదు వారిస్తూ- "దావీదును శపించమని దేవుడు వాడికి చెప్పితే ‘నీవెందుకు ఇలా చేస్తున్నావు?’ అని ఎవడు అడగగలడు?వాడి జోలికి పోవద్దు. శపించమని దేవుడు వాడికి చెప్పాడు, గనుక వాణ్ణి శపించనియ్యండి. దేవుడు నా బాధను చూచి, ఇవ్వేళ వాడు పలికిన శాపానికి బదులు దేవుడు నాకు మంచి చేస్తాడేమో"   అని, దావీదు, అతని మనుషులంతా త్రోవలో ముందుకు సాగారు....

7 June 2017

"నినెవె అనే పట్టణస్థుల గురించిన, హెచ్చరిక వాక్కును దేవుడు యోనాకు చెప్పి, వారిని హెచ్చరించమన్నాడు" -- నినెవె మహా పట్టణస్తుల రక్షణ వాక్యం ఇప్పుడు యోనాతో ఉంది. "కాని నినెవె వారు యోనా స్వంత దేశస్థులకు శత్రువులు. కాబట్టి వారు శిక్ష నుండి తప్పించుకోవడం యోనాకు ఇష్టం లేదు. కనుక అతను వేరే పట్టణానికి ఓడలో ప్రయణమయ్యాడు. అప్పుడు దేవుడు సముద్రంపైకి గొప్ప తుఫాను పంపాడు" -- (తన జీవితంలో)ఇతరుల జీవితంలో రక్షణార్ద మైన దేవుని వాక్కును, యోనా వ్యర్ధ పరుస్తున్నప్పుడు దేవుడు కోపగించుకొన్నాడు. "అతని వల్లే ఆ తుఫాను వచ్చిందని ఓడలో ఉన్నవారికి అర్ధమయ్యేట్లు దేవుడు చేశాడు కనుక అతన్ని సముద్రంలో పడేశారు.పెద్ద చేప ఒకటి అతన్ని మింగాల్సిందిగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నాడు" -- దేవుడు యోనాను, చేప కడుపులో భద్రంచేస్తున్నప్పుడు, ఆయన వాక్కును కూడా కాపాడుతూ, ప్రయాణం చేయించాడు. చేప దేవుని ఆజ్ఞను బట్టి, యోనాను ఒడ్డున కక్కివేసింది. అతను వెళ్లి ప్రకటన చెయ్యగా అందరూ మారుమనస్సు పొందారు. -- ఆయన వాక్కు అవిధేయులైన ప్రజలను దేవుని ఉగ్రత నుండి కాపాడింది.అప్పుడు దేవునికి ఎంతో సంతో...

9 June 2017

ఇస్కరియోతు యూదా: ★ యేసు ఎంతో ప్రార్దనా పూర్వకంగా ఇస్కరియోతు యూదాను శిష్యునిగా ఎంపిక చేశాడు.ఇది పరలోక తండ్రి చిత్తం. ఖచ్చితంగా యూదా మొదట్లో భక్తిపరునిగా కనిపిస్తున్నాడు. (లూకా 6:12,13,16) ★ యూదా దయ్యాలను వదలగొట్టాడు,స్వస్థతలు చేశాడు, సువార్తనూ ప్రకటించాడు.(మత్తయి 10:1,4) ★ యేసు శిష్యులందరి విశ్వాసం తొలగిపోకుండా కాపాడాడు. యూదాను తప్ప(యోహాను 17:12). యూదా దేవునిలో నిలిచి ఉండక తన ఇష్టపూర్వకంగా తొలగినట్లు కనిపిస్తుంది. దేవుడు పక్షపాతికాడు.యూదా మెల్లిమెల్లిగా లోకంలోకి దిగజారి అపవాదికి తనను తాను అప్పగించుకొన్నాడు. ★తండ్రియైన దేవుని ఆత్మ ద్వారా మాట్లాడిన వ్యక్తిలోకి సాతాను ప్రవేశించగలిగాడు.(మత్తయి 10:20, యోహాను 13:27).శుభ్రపరచబడిన హృదయం మళ్ళీ ఖాళీ ఐతే, మరి ఎక్కువ కీడు సంభవిస్తుంది(మత్తయి 12:43-45) ★ ఒకప్పుడు దేవుని పరిశుద్ధ స్థలంలో నిలిచిన దేవదూత, పాపం చేసినప్పుడు కృపను కోల్పోయి పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. దేవుని చేత ఏదేనులో నిల్పబడిన ఆదాము పాపం చేసినప్పుడు, గెంటివెయ్యబడ్డాడు. యూదా పరిస్థితి అంతే! వారే కాదు, ఆయనలో నిలిచి ఉండని వారు, ఆయనతో పాలినవారుకారని వాక్యం చెప్తుంది.(హెబ్రీ ...

10 June 2017

● ఫిలిప్పు నతనయేలును చూసి, "ధర్మశాస్త్రంలో మోషే, ఇంకా ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేం చూశాం..ఆయన నజరేతువాడైన యేసు" అని చెప్పాడు. ● అందుకు నతనయేలు-- "నజరేతులో నుండి మంచిదేమైన్నా రాగలదా?" అన్నాడు. ● ఫిలిప్పు-- "నువ్వే వచ్చి చూడు" అన్నాడు. నతనయేలు తన దగ్గరకు రావడం యేసు చూశాడు. "చూడండి.. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు" అన్నాడు. ● నతనయేలు-- "నేను నీకెలా తెలుసు?" అన్నాడు. ● యేసు-- "ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను" అన్నాడు. ● నతనయేలు-- "బోధకుడా, నువ్వు దేవుని కుమారుడివి!.." అని నతనయేలు బదులిచ్చాడు. నతనయేలు సత్యాన్వేషి, అంటే మనస్సులోని భావాలను యధార్ధంగా వ్యక్తపరుస్తూ, తనకు తెల్సిదే సరైనది అని మొండిగా వాదించక, సత్యం తన దగ్గరకు వచ్చినప్పుడు (తెలిసినప్పుడు) మంచి మనస్సుతో అంగీకరించువాడు. దేవుడే అలాంటి వారిని వెతుక్కుంటూ వస్తాడు. సత్యాన్వేషి, సత్యమై ఉన్న దేవుణ్ణి దాటిపోలేడు. ఎందుకంటే దేవుడు వారికి స్పష్టంగా కనపర్చుకొంటాడు. సత్యమును అంగీకరించినప్పుడు, అబద్ధపు సంకెళ్ళు తెగ...

12 June 2017

యూదా దేశానికి రాజు హిజ్కియా. అతడు దేవుడంటే ఎంతో భయభక్తులుగల వాడు.  సన్హెరీబు(అష్షూరు రాజు) గొప్ప సైనిక బలము గలిగి, అనేక యుద్దాలు చేసి, రాజ్యాలను జయించిన రాజు. అతడు యూదా రాజ్యం మీదికి దండెత్తి, చుట్టుముట్టాడు. అప్పుడు హిజ్కియా-"నిబ్బరంగా ధైర్యంగా ఉండండి.అష్షూరు రాజును అతడితో ఉన్న పెద్దసైన్యాన్ని చూచి భయపడకండి. మనతో ఉన్న బలం అతడితో ఉన్న బలం కంటే గొప్పది. అతని దగ్గర కేవలం మనుష్యల బలమే వుంది. కాని మన దగ్గర యెహోవా దైవబలం వుంది. దేవుడు మనకు సహాయపడతాడు. ఆయనే మన యుద్ధాలలో పోరాడుతాడు". అని తన ప్రజలను ధైర్యపరచాడు. అతను చెప్పిన మాటలను ప్రజలు కూడా నమ్మారు. ఆ విషయం తెలుసుకొన్న సన్హెరీబు యూదా ప్రజలకు ఒక లేఖ పంపాడు. దానిలో- "హిజ్కియా చేత మీరు మోసపోకండి, మీరు అక్కడే ఉండి ఆకలి దప్పులతో మాడి చనిపోయే విధంగా మీరు మోసగింపబడుతున్నారు. అతణ్ణి నమ్మకండి. ఎందుకంటే, నేను అనేక ఇతర దేశాల ప్రజలను నాశనం చేసేటప్పుడు వారి దేవుళ్లు నన్నాపలేకపోయారు. అలాగే హిజ్కియా దేవుడు కూడ ఆయన ప్రజలను నాశనం చేయకుండ నన్ను ఆపలేడు!". హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ లేఖ అందుకొని దానిని చదివాడు. అప్పుడతడు యెహోవా ఆల...

13 June 2017

"యోహానుచేత బాప్తిస్మం పొందడానికి యేసు గలలీ ప్రదేశంనుంచి అతని దగ్గరికి యొర్దానుకు వచ్చాడు. యేసు బాప్తిస్మము పొంది, ప్రార్థిస్తుండగా పరలోకం తెరువబడింది. పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగివచ్చి ఆయనపై వ్రాలాడు. ఆయన పరిశుద్ధాత్మపూర్ణుడై(నింపబ డిన వాడై), ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు"  ■ అప్పట్నుండి ఆయన సేవా జీవితం ఆరంభమైంది. క్రీస్తు మనకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. దేవుని ఆత్మ చేత నింపబ డకుండా ఆయన కోరుకున్న సేవను కొనసాగించలేము. శిష్యులు దేవుని ఆత్మచే నింపబడినప్పుడే (దేవుని సంఘాన్ని) శ్రేష్టమైన సేవను చేశారు.ఆత్మ దేవుడు వచ్చి వారిని నింపే వరకు వేచి ఉండమని ప్రభువు చేత ఆజ్ఞను పొందారు. ■ దీనిని బట్టి పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర అర్ధం చేసుకోగలము. క్రీస్తు..పరలోక తండ్రిని ఆయన శరీరం ద్వారా బయలుపర్చాడు. పునరుద్దానుడయ్యాక పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన ఆశీనుడయ్యాడు. ఇప్పుడు క్రీస్తును బయలుపర్చడానికి 'పరిశుద్ధాత్ముడు' దిగి వచ్చాడు. క్రీస్తును ఎదుటి వారికి కనపర్చాలంటే ఆయన ఆత్మ ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. ■ అపొస్తలులు ఆత్మ నడుపగా వెళ్ళి సువార్తను ...

14 June 2017

గేత్సేమనే వనంలో యేసు మోకరించి ఇలా ప్రార్థన చేసాడు- "తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి"(లూకా 22:43) ■ ఆయన తొలగించుమన్న పాత్ర ఏమిటి? శిలువ శ్రమా?లేక శరీర మరణమా? ● ఆయన కష్టాలను, శ్రమల గూర్చి భయపడుతూ,ఈ మాటను అనుంటే గనుక, "లోకంలో మీకు శ్రమ కలుగుతుంది..మీరు సిలువను మోస్తూ నన్ను వెంబడించండి" అని ఆయనకు చెప్పే అర్హత ఉండదు. ● లేదు శరీర మరణం గూర్చి ఈ మాటలు చెప్పిఉంటే, నేడు ఆయన కోసం అంతకంటే ఘోరంగా చంపివేయబడ్డ అనేక మంది హతసాక్షుల కంటే తక్కువ వానిగా కనిపిస్తాడు. చివరికి పాత నిబంధనలోని షడ్రక్, మేషాక్, అబేడ్నోగులు సంతోషంగా దేవుని కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన వారికంటే లోక రక్షకుడు తక్కువైనవాడవుతాడు. ●నిజానికి ఆయన ఎన్నడూ దూషణలను,శ్రమలను,నిందలను, చివరికి ప్రాణాన్ని కూడా లెక్కచెయ్యలేదు. ఆయన మరణించడానికే వచ్చాడని, ఆ సమయం ఎప్పుడో, ఏలాంటి మరణం పొందుతాడో, ఆయన్ను అప్పగించువాడేవాడో ఆయనకు బాగా తెల్సు. పేతురు ద్వారా సాతాను మరణాన్ని దూరం చెయ్యాలని చూస్తే ఆయనే సాతాన్ని గద్దించాడు. ఆయన్ను పట్టుకునే వారికి ఆయనే ఎదురూ వెళ్ళి...

15 June 2017

■ "దేవుని మందసం" ఒక పవిత్రమైన పెట్టె.దేవుని సన్నిధికి సూచనగా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది(అందులో దేవుని ఆజ్ఞలు గల పలకలు, మన్నా, అహరోను కర్ర ఉంటాయి). ● మందసం అబీనాదాబు ఇంటినుంచి యెరూషలేములోని రాజనగరికి తీసుకురావాలని దావీదు కోరుకున్నాడు. కనుక వారు దానిని ఒక కొత్త ఎడ్లబండి మీద ఊరేగింపుగా తీసుకొని రావలనుకొన్నారు. ● ఉజ్జా, అహ్యో అనేవారు బండిని తోలారు. దావీదు, ఇస్రాయేల్ వారంతా తమ శక్తి అంతటితో పాటలు పాడ ుతూ, తంతివాద్యాలనూ కంజరీలనూ తాళాలనూ వాయిస్తూ, బూరలు ఊదుతూ, దేవుని సన్నిధానంలో సంబరపడుతూ ఉన్నారు. ● నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎద్దులకు కాలు జారింది. వెంటనే ఉజ్జా ఆ మందసాన్ని పట్టుకోవడానికి చెయ్యి చాపాడు. దేవుడు ఉజ్జామీద తీవ్రంగా కోపగించి అతన్ని మొత్తాడు. అతడు ఆ మందసం ముందే పడి చనిపోయాడు.ఒక్కసారిగా ఆ సంబరం కాస్తా విషాదంగా మారిపోయింది.   ● అప్పుడు దావీదు దేవునికి భయపడి, దారి ప్రక్కన ఉన్న ఓబేదెదోం ఇంటికి దానిని తీసుకుపోయాడు.దేవుని మందసం అతని ఇంటిలో అతడి కుటుంబం దగ్గర 3 నెలలు ఉంది. దేవుడు ఓబేదెదోం కుటుంబం వారిని, అతను కలిగివున్న అంతటినీ దీవించాడు. ■ ఒకనికి శాపంగా మారింది, ఒకని...

16 June 2017

యేసు-" 'వ్యభిచారం చేయకూడదు', అని చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే, పరస్త్రీ(పరపురుషుని) వైపు కామంతో చూసినవారు, హృదయంలో ఆమెతో(అతనితో) వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతారు" (మత్తయి 5:28) ౼ నేను దేవునికి అవిధేయుడ్ని అవ్వాలని, ఆయనకు విరోధినై ఉగ్రతలోనికి వెళ్ళాలని, "పాపం" దేవుని ఆజ్ఞను ఆధారంగా చేసుకొని, నాలో అన్ని రకాల దురాశల్ని కలిగిస్తుంది(రోమా7:8) ౼ మీరు పాపం విషయంలో చనిపోయి, దేవునిలో బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని, మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి..చావుకు లోనయ్యే మీ శరీరాలలో పాపాన్ని ఏలనివ్వకండి! శరీరం యొక్క చెడ్డ కోరికలకు లోబడకండి!మీ శరీర భాగాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి..(రోమా 6:12,13) యోబు-"ఒక యువతిని కామవాంఛతో చూడ కూడదని నా కళ్లతో నేను ఒప్పందం చేసుకొన్నాను."(యోబు31:1) ౼ కాని నేను బలహీనమైన మనిషిని, (పుట్టుక తోనే)పాపానికి బానిసగా అమ్ముడుపోయిన(శరీరంగల) వాణ్ణి. నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను. దానికి మారుగా చెయ...

20 June 2017

దేవుడు ఏలీయాతో-"నీవు ఈ ప్రదేశాన్ని వదిలి తూర్పుదిశగా వెళ్లి, కెరీతు వాగువద్ద దాగి వుండు. నీవు ఆ వాగు నీటిని తాగవచ్చు. నీకు ఆహారాన్ని అక్కడికి చేరవేయమని, నేను కాకులకు ఆజ్ఞ ఇచ్చాను" అన్నాడు. దేవుడు చెప్పినట్టే ఏలీయా చేశాడు. ప్రతిరోజూ ఉదయాన సాయంకాలాన కాకులు అతనికి మాంసం, రొట్టెలు తెచ్చేవి. అతడు ఆ వాగు నీళ్ళు త్రాగేవాడు. కొంతకాలానికి దేశంలో వర్షం లేక ఆ వాగు ఎండిపోయింది. మళ్ళీ దేవుడు ఏలీయాతో-"సీదోనుల ోని సారెపతు అను పట్టణానికి వెళ్లి, అక్కడ నివసించు. ఆ ప్రదేశంలో ఒక విధవరాలు నివసిస్తూవుంది. నీకు ఆహారం ఇవ్వమని ఆమెను ఆదేశించాను" ● కాకులు మాంసాన్ని పీక్కు తింటాయి, కాని తెచ్చిపెట్టవు. కరువులో బీద విధవరాలు ఆహారం కోరుకుంటుంది, కాని ఇవ్వలేదు. కాని ఏలీయా దేవుణ్ని నమ్మాడు. అసాధారణ కార్యాలను ఆయన చేయ సమర్ధుడు. విశ్వాసం ద్వారానే ఆ జీవితం జీవించవల్సి ఉంటుంది. ● దేవుని మాటను విలువగా యెంచి, విధేయత చూపే వారికి, ఆయన తన చిత్తాలను(ఆయన ఆలోచనలను) తెలియజేస్తాడు. దేవుని చిత్తాలు మన జీవితంలో నెరవేరాలంటే, మొదట లోకం(మనుష్యుల) అభిప్రాయంతో సంబంధం లేకుండా జీవించడం నేర్చుకోవల్సివుంటుంది(యోహా ను 7:6...

21 June 2017

సిలువ తీర్పు కోసం యేసు సిద్ధంగా ఉన్న సమయంలో.. పిలాతు యేసుతో--"నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి, లేదా సిలువ వేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?" అన్నాడు. అందుకు యేసు--"ఆ అధికారం పైనుంచి(దేవుని నుంచి) నీకు ఇవ్వబడితేనే తప్ప నామీద నీకు అధికారమేమీ ఉండదు" అని జవాబిచ్చాడు.(యోహాను 19:10,11) ✔  విశ్వాసి జీవితంలో దేవుని అనుమతి లేకుండా ఏమీ జరుగదు. ప్రాముఖ్యంగా దేవుణ్ని హత్తుకొని జీవించే వి శ్వాసి జీవితంలో, ఏమైన (చేదైన)సంఘటన జరిగిందంటే ఖశ్చితంగా దేవుడే అనుమతించాడని నమ్మాలి.(లూకా 11:49-51) ✔  నీతిమంతుడు అనేకుల చేత ద్వేషించబడతాడు(రుజువు క్రీస్తే). ఆయన్ను పోలి నడిచేవారికి శ్రమలు వస్తాయని ప్రభువు చెప్పాడు. పాపంతో రాజీపడిన క్రైస్తవునికి..లోకం, సాతాను స్నేహితులే!(యాకోబు 4:4).అలాంటి వారితో అపవాదికి ఎలాంటి సమస్య ఉండదు. కాని బలమైన విశ్వాసి సాతానుని సామ్రాజ్యానికి గొడ్డలి పెట్టుగా ఉంటాడు. కాబట్టి శోధనల ద్వారా విశ్వాసిని జల్లించాలని అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడి సంబంధులను(మత సంబంధులను, లోకస్థులను) ప్రేరేపిస్తూ శ్రమలకు, హింసలకు గురిచేయలని చూస్తాడు. ✔  విశ్వాసి ని...

22 June 2017

కరువు సమయంలో యోసేపు అన్నలు కనాను నుండి ఐగుప్తుకు బయలుదేరారు.చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు తమ తమ్ముడైన యోసేపును, గోతిలో పడేసి చంపాలను కొన్నారు. ఐతే దానినుండి బయటకు తీసి ఐగుప్తుకు బానిసగా అమ్మేశారు. ఇప్పుడు అదే ఐగుప్తుకు వెళ్తున్నప్పుడు, యోసేపు ఇప్పుడు ఎలా ఉంటాడని అనుకొనివుండొచ్చు? ✔  బానిసల్లో ఒకడిగా దయనీయమైన జీవితం జీవిస్తూ ఉంటాడని జాలిపడి, బాధపడి ఉండొచ్చు. 🔸  కాని దేవుడు యోసేపును ఐగుప్తు సామ్రాజా నికి గొప్ప అధికారికంగా చేశాడు. కరువు కాలంలో అందరిని కాపాడే రక్షకునిగా నియమించాడు. అది ఆయన అనాది కాల సంకల్పం.(ఆది 15:13,14) ➡  సమూయేలు ఏలి కి పరిచారం చేస్తున్న రోజుల్లో, ఏలి సమూయేలు భవిష్యత్తు గురించి ఏమి ఆలోచించివుండొచ్చు? ✔  తన కుమారులు, వారి సంతానం యాజకులుగా ఉంటే, వారి దగ్గర పరిచారకులుగా సమూయేలు, అతని సంతానం ఉంటారని ఊహించి ఉండొచ్చు. 🔸 కాని దేవుడు సమూయేలుని తర్వాత న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకునిగా నియమించాడు. ఇది అతను పుట్టకముందే దేవుడు చేసిన ఎంపిక. ⏺  మనుష్యులు మన గురించి ఎన్నో దయనీయమైన అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు కాని మనల్ని నిర్మించిన సృష్టికర్తకే తెలుసు, మనం ...

23 June 2017

హోషేయ--"రండి, మనం దేవుని వైపు మళ్ళీ తిరుగుదాం!ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకొందాం రండి! ఆయన్ని అనుసరిద్దాం రండి!"(హోషేయా 6:1,3) ✔ "దేవుని గూర్చిన జ్ఞానం అంటే, వాక్యం తెలియడం, దానిని చక్కగా విభజించడం కాదు. అది అందరికి తెలపడం అంతకంటే కాదు(మత్తయి 7:22,23). బైబిల్లోని దేవుని అనుభవాల ద్వారా వ్యక్తిగతంగా తెలుసుకోవడం,అవును అని మన జీవితల్లో రుజువు చేసుకోవడం. ఆయన చేత మనం గుర్తించబడటం!" ➡  ఇశ్రాయేలీయులు దే వుని గూర్చిన జ్ఞానం లేనప్పుడు బుద్ధిహీనమైన పనులు చేశారు(హోషేయా 4:1,2). సృష్టికర్తను విడచి లోకంతో స్నేహం చేశారు. ఐగుప్తు(పాపపు) బానిసత్వం నుండి విడుదల పొంది, కృతజ్ఞతరహితులై ఇష్టపూర్వకంగా ఈ లోకప్రజల విధానాలకు మరలి పోయారు. మొదట చేసిన నిబంధనను మరిచారు. ➡  గద్దించాల్సిన యాజకులు వారి బాధ్యతను మరచి(హెబ్రీ 13:17), దేవుడు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వదిలివేశారు. వారి కడుపే వారి దేవుడయ్యాడు(హోషేయా 4:6-8).కాబట్టి వారు కూడా దేవుని శిక్షకు పాత్రులుగా ఎంచబడ్డారు(4:9). ➡  ఎఫ్రాయిము తెగను దేవుడు ఎంతో ప్రేమించాడు. దానిని గూర్చి ఉన్నతమైన ఉద్దేశ్యలను కలిగి ఉన్నాడు(ఆది 48:17-19, యిర్మీయా ...

24 June 2017

ఒక గొఱ్ఱె జీవిత అనుభవం. "రోజులాగే నా కాపరి, మేత కోసం అడవికి తీసుకెళ్లాడు.బాగానే మేపుతాడు.. కాని నాకు నచ్చినట్లు కాదు. అందమైన పచ్చిక కనిపిస్తూవుంటే అక్కడకు వెళ్ళిద్దని గద్దిస్తాడు. అమాయకపు గొఱ్ఱెలు, నేను కాకుండా ఇంకో 99 వుంటాయనుకుంటా! ఆయన వెంబడే స్వేచ్ఛ లేకుండా తిరుగుతుంటాయి.   "ఈ రోజు ఎలాగైనా నా స్వేచ్ఛ కోసం పోరాడి తీరాల్సిందే!" అని ఆ అందమైన ఆ చోటికి, మనసు లేని నా కాపరి కన్నుగప్పి వెళ్ళాను. ఆహ్! ద గ్గర నుండి ఎంతో అందంగా, నా కన్నులకు ఇంపుగా, రుచిగా..చాలా చాలా బాగుంది!. ఇప్పటిదాకా ఇంత ఆనందాన్ని నా కాపరి దొంగిలించాడని, ఒక్కసారి కాపరి మీద చెప్పలేని కోపం వచ్చింది. అంతలో ఏదో శబ్దం!! నాలాగే మరొక స్నేహితుడేమో, అనుకోని స్నేహ హస్తాన్ని ఇవ్వాలని చూశాను. ఓహ్! అది తోడేలు. అయ్య బాబోయ్! దొరికితే అంతే సంగతులు. కిక్కురమనకుండా ఆ పొదల చాటున నక్కాను. కొంత సేపటికి అది వెళ్ళిపోయింది. ఊపిరి పీల్చుకున్నాను. చీకటి పడొస్తుంది. అంతలో ఇంకోసారి శబ్దం అయ్యింది. బాబోయ్!! ఈసారి పెద్ద పులి! భయమేసి మళ్ళీ నక్కాను. అంతలో చీకటిపడింది. అప్పుడు అర్ధమైంది నా కాపరి నన్నెందుకు ఇక్కడికి పంపలేదు అని.నా తోటి స...