"అప్పుడు యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనును నింపగా, అతని చేతులకు ఉన్న త్రాళ్ళు కాలిపోయిన నారలాగా అయి పొయ్యాయి. అతని చేతుల మీదనుంచి కట్లు ఊడిపొయ్యాయి.
అక్కడ సమ్సోనుకు పచ్చి గాడిద దవడ ఎముక ఒకటి దొరికింది. అతడు దానిని చేతపట్టుకొని దానితో వెయ్యిమంది ఫిలిష్తీయుల్ని హతమార్చాడు"(న్యాయాధి 15:14,15)
యెహోవా ఆత్మ సమ్సోను మీదికి బలముగా వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడే బంధకాలను తెంపాడు(2 కోరింధీ 3:17).
అసాధారణ రీతిలో మార్గాలను తెరుచువాడు/మూయువాడు, అసాధారణ కార్యాలు చేయువాడు ఆయనే! (అపో 16:6,7)
ఎవరినైతే ఆయన చిత్తప్రకారం ఏర్పాటు చేసుకొన్నాడో, ఆ వ్యక్తిని ఆ ప్రదేశానికి (ఆ పరిస్థితుల్లోకి) నడుపుతాడు.
(మన బుద్ధిపూర్వక అవిధేయతలను ఈ జాబితాలోకి చేర్చకూడదు, ఉదా||ఏదేను తోటలో ఆదాము, హవ్వల బుద్ధిపూర్వక అవిధేయత. బుద్ధిహీన పాపపు పనులను దేవుని చిత్తం అనకూడదు. దేవుడు చెడిపోయిన జీవితాలను సైతం బాగుచెయ్యగల సమర్ధుడు. దేవుడు కృప చూపి, బాగుచేసి కలుగజేసుకున్నాడు కాబట్టి మునుపు చూపిన అవిధేయత దేవుని చిత్తమా?కాదు! అలా చెప్పకూడదు! ఆదాము అవిధేయత శాపం నేటికి అనుభవిస్తున్నాము).
ఇక్కడ ఫిలిష్తీయులను హతం చేయడం గూర్చి చెప్తున్నాను. దేవుని ఆత్మ మనల్ని నడిపినట్లేతే ఆయన పని మన ముందున్నదని అర్ధం. సమ్సోను కోసం అక్కడ దేవుడు సిద్ధం చేసిన ఆయుధం చచ్చిన గాడిద దవడ ఎముక! ఖడ్గం/ఈటెల వంటివి ఏమి దొరకలేదు కాని అతి స్వల్పమైన ఎముక మాత్రమే దేవుడు ఉంచాడు. సమ్సోనుకు బాగా తెలుసు, దేవుడు వాడుకోవడానికి ఇది చాలని విశ్వాసముంచాడు. దేవుని గొప్ప రక్షణను ఆ దినం చూశాడు. కనుకనే విశ్వాస వీరుల జాబితాలో సమ్సోనును ఒకడిగా దేవుడు వ్రాయించాడు.
మన దేవుడు స్వల్పమైన వాటితో గొప్ప కార్యాలు చేసే దేవుడు. బలహీనుడ్ని అని నీవనుకుంటున్నావా? నీ దగ్గర/నీలో దేవుడు ఏమి ఉంచాడు?అది చాలు దేవుడి అనాధికాల సంకల్పం నీలో నెరవేరడానికి. అది ఇప్పటికే నీలో ఉంది.
- తబితా(దొర్కా) వద్దనున్న చిన్న సూది (అకా 9:39),
- దావీదు దగ్గర ఉన్న చిన్న రాయి (1సమూయేలు 17:49).
- మోషే దగ్గర ఉన్న గొఱ్ఱెలను కాచే కర్ర (నిర్గమ 14:21)
దేవుడు అధికమైన వాటిగా అతిశయించే వాటిని(వారిని) త్రోసివేసి, అల్పమైన వాటిని వాడుకొని తన మహిమను చాటుతాడు. ఒకవేళ ఎవరైనా గొప్పవారిగా ఎంచుకున్నట్లైతే అంతా ఖాళీ చేసి, వట్టి వారిగా వారు ఎంచుకున్న తర్వాతే వారిని వాడుకున్నాడు. బైబిల్ అంతా ఇలాంటి ఉదాహరణలతో నిండి ఉంది.
ఆయన నీలో, నాలో కోరుకునేది..విశ్వాసంతో దేవుణ్ని నమ్మి, సాత్వికంతో ఆయనపై సంపూర్ణంగా ఆధారపడటాన్నే!

Comments
Post a Comment