యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే సాగిలపడ్డాడు.
కుష్టు రోగి- "ప్రభూ! నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు" అని ఆయనను వేడుకున్నాడు.
అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని ముట్టుకున్నాడు.
యేసు-"నిన్ను బాగు చేయడం నాకిష్టమే! బాగవ్వు" అన్నాడు.
వెంటనే అతని కుష్టు పోయింది.
● ఆ రోజుల్లో కుష్ఠు రోగానికి మందు లేదు. అలాంటివారు ఊరి వెలుపలే ఉండాలి.యేసును కలుసుకోవడానికి ఈ కుష్టురోగి దాగుతూ వచ్చాడేమో!
★ అప్పటి వరకు కుటుంబికులు, ఎంతో ఆత్మీయులుగా ఉన్న వారు అతన్ని ముట్టుకోవడానికి, దగ్గరకు రావడానికి వెనకాడివుంటారు. ఎందుకు నాకే ఈ వ్యాధి వచ్చిందన్న వ్యధ. దినదినం క్షిణించిపోతున్న శరీరం, ఒంటరితనం, అవమానం అతని మానసికంగా, శరీరంగా కృంగిపోయిన వానిగా చేశాయి. నిరీక్షణ లేని జీవితంలోకి తీసుకువెళ్ళాయి. ఎలా విన్నాడో కాని యేసు ఈ రోగాన్ని బాగుచేయగలడని తెల్సుకొన్నాడు, ఖచ్చితంగా తనను బాగుచేయగలడని విశ్వాసముంచాడు.
★ అతను ప్రభువు దగ్గరకు వచ్చి వేెడుకున్నప్పుడు, శరీర స్వస్థత కంటే ముందు, మనస్సుకు కలిగిన ఆ గాయాన్ని మాన్పాడు. అతణ్ణి చేతితో ముట్టాడు. దేవుని ఆత్మీయ స్పర్శ అతనికి ఆదరణ, నిరీక్షణ కలిగించాయి. ఎవ్వరూ చూపని ప్రేమను ఆయన చూపాడు. దీనిని బట్టి అతని ప్రధమ అవసరం ఆత్మీయ స్పర్శ అని అర్ధం చేసుకోవచ్చు. మనుష్యులెవ్వరూ నిన్ను అర్ధం చేసుకోవట్లేదు, ప్రేమించట్లేదు అని భాధ పడ్తున్నావా! యేసయ్య ప్రేమ నిన్ను వెతుకుతుంది.
● అతని శరీరం(జీవితం) ఎప్పుడు బాగయిందంటే, విశ్వాసంతో దేవుణ్ని సమీపించి, బాగుచేయమని అతను వేడుకున్నప్పుడే!అతనితో పాటు ఇంకా కుష్టురోగులు ఉండే ఉంటారు, కాని విశ్వాసంతో వచ్చిన వాడే బాగయ్యాడు.
★ ప్రియ స్నేహితుడా! నీవు ఆయన దగ్గరకు విశ్వాసంతో రాకపోతే నీవెన్నాడూ ఆయన ప్రేమను, శక్తిని నీ జీవితంలో తెలుసుకోలేవు. రోగం..బ్రతికి ఉన్నంత వరకు శరీరాన్ని భాదించగలదు, కాని పాపం..మనిషి ఆత్మను అంతంలేని దేవుని ఉగ్రతకు తీసుకువెళ్తుంది.పాపక్షమాపణ , దేవునితో సఖ్యత మనిషికి అత్యవసరమైన విషయాలు. కనుకనే రక్షకుడైన క్రీస్తు సిలువపై మన పాపానికి బలిగా, విమోచనగా మారాడు.
క్రీస్తులో విశ్వాసం ద్వారా, దేవుని కనికరం వల్ల పాపం నుండి విడుదల పొంది, దేవునితో క్రొత్త జీవితాన్ని పొందుతాము.
కుష్టు రోగి- "ప్రభూ! నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు" అని ఆయనను వేడుకున్నాడు.
అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని ముట్టుకున్నాడు.
యేసు-"నిన్ను బాగు చేయడం నాకిష్టమే! బాగవ్వు" అన్నాడు.
వెంటనే అతని కుష్టు పోయింది.
● ఆ రోజుల్లో కుష్ఠు రోగానికి మందు లేదు. అలాంటివారు ఊరి వెలుపలే ఉండాలి.యేసును కలుసుకోవడానికి ఈ కుష్టురోగి దాగుతూ వచ్చాడేమో!
★ అప్పటి వరకు కుటుంబికులు, ఎంతో ఆత్మీయులుగా ఉన్న వారు అతన్ని ముట్టుకోవడానికి, దగ్గరకు రావడానికి వెనకాడివుంటారు. ఎందుకు నాకే ఈ వ్యాధి వచ్చిందన్న వ్యధ. దినదినం క్షిణించిపోతున్న శరీరం, ఒంటరితనం, అవమానం అతని మానసికంగా, శరీరంగా కృంగిపోయిన వానిగా చేశాయి. నిరీక్షణ లేని జీవితంలోకి తీసుకువెళ్ళాయి. ఎలా విన్నాడో కాని యేసు ఈ రోగాన్ని బాగుచేయగలడని తెల్సుకొన్నాడు, ఖచ్చితంగా తనను బాగుచేయగలడని విశ్వాసముంచాడు.
★ అతను ప్రభువు దగ్గరకు వచ్చి వేెడుకున్నప్పుడు, శరీర స్వస్థత కంటే ముందు, మనస్సుకు కలిగిన ఆ గాయాన్ని మాన్పాడు. అతణ్ణి చేతితో ముట్టాడు. దేవుని ఆత్మీయ స్పర్శ అతనికి ఆదరణ, నిరీక్షణ కలిగించాయి. ఎవ్వరూ చూపని ప్రేమను ఆయన చూపాడు. దీనిని బట్టి అతని ప్రధమ అవసరం ఆత్మీయ స్పర్శ అని అర్ధం చేసుకోవచ్చు. మనుష్యులెవ్వరూ నిన్ను అర్ధం చేసుకోవట్లేదు, ప్రేమించట్లేదు అని భాధ పడ్తున్నావా! యేసయ్య ప్రేమ నిన్ను వెతుకుతుంది.
● అతని శరీరం(జీవితం) ఎప్పుడు బాగయిందంటే, విశ్వాసంతో దేవుణ్ని సమీపించి, బాగుచేయమని అతను వేడుకున్నప్పుడే!అతనితో పాటు ఇంకా కుష్టురోగులు ఉండే ఉంటారు, కాని విశ్వాసంతో వచ్చిన వాడే బాగయ్యాడు.
★ ప్రియ స్నేహితుడా! నీవు ఆయన దగ్గరకు విశ్వాసంతో రాకపోతే నీవెన్నాడూ ఆయన ప్రేమను, శక్తిని నీ జీవితంలో తెలుసుకోలేవు. రోగం..బ్రతికి ఉన్నంత వరకు శరీరాన్ని భాదించగలదు, కాని పాపం..మనిషి ఆత్మను అంతంలేని దేవుని ఉగ్రతకు తీసుకువెళ్తుంది.పాపక్షమాపణ
క్రీస్తులో విశ్వాసం ద్వారా, దేవుని కనికరం వల్ల పాపం నుండి విడుదల పొంది, దేవునితో క్రొత్త జీవితాన్ని పొందుతాము.
Comments
Post a Comment