దావీదు తన కుమారుడైన అబ్షాలోము, తనను చంపాలని చూసినప్పుడు బహూరీముకు వచ్చాడు. సౌలు కుటుంబానికి చెందిన వాడైన "షిమీ" దావీదును శపిస్తూ, దావీదు మీద, అతని సేవకులందరి మీదా రాళ్ళు రువ్వుతూ--
"వెళ్ళిపో! హంతకుడా! దుర్మార్గుడా! వెళ్ళిపో! నీవు సౌలు ఇంటివాళ్ళను హత్య చేసి, సౌలు స్థానంలో రాజయ్యావు గాని, నీవు చేసిన రక్తపాతానికి దేవుడు నీకు ప్రతీకారం చేస్తున్నాడు. దేవుడు నీ కొడుకు అబ్షాలోము చేతికి రాజ్యాన్ని ఇచ్చివేశాడు. నీవు చేసిన చెడు కార్యాలన్నీ ఇప్పుడు నీకే జరుగుతున్నాయి! ఎందువల్లంటే నువ్వొక హంతకుడవు!" అని దూషించాడు.
అబీషై దావీదుతో- "నా ప్రభువైన రాజును ఈ చచ్చిన కుక్క ఎందుకు తిట్టాలి? నన్ను వెళ్లి షిమీ తల నరికివేయనీయండి!" అన్నాడు.
అందుకు దావీదు వారిస్తూ- "దావీదును శపించమని దేవుడు వాడికి చెప్పితే ‘నీవెందుకు ఇలా చేస్తున్నావు?’ అని ఎవడు అడగగలడు?వాడి జోలికి పోవద్దు. శపించమని దేవుడు వాడికి చెప్పాడు, గనుక వాణ్ణి శపించనియ్యండి. దేవుడు నా బాధను చూచి, ఇవ్వేళ వాడు పలికిన శాపానికి బదులు దేవుడు నాకు మంచి చేస్తాడేమో"
అని, దావీదు, అతని మనుషులంతా త్రోవలో ముందుకు సాగారు. వారు వెళ్ళిపోతూ ఉంటే షిమీ అతనికి ఎదురుగా కొండప్రక్కన వెళ్తూ, దావీదు మీదికి రాళ్ళు రువ్వుతూ, మట్టి విసరివేస్తూ, దూషిస్తూ వచ్చాడు.
ఇది సాత్వికమైన మనస్సు. అంటే బదులు చెయ్యగల(మాట్లాడగల) సామర్థ్యం ఉన్నా,"మౌనమై", పరిస్థితులంతటిపై అధికారం గల దేవుని నమ్మి, ఆయనపై ఆధారపడి, ఆయనకు మనల్ని మనం అప్పగించుకొనడం. కుక్కల గుంపు తనను చూసి మొరుగుతూ ఉంటే, సింహం మౌనంగా ఉండటం వంటిది.దేవుని అనుమతి లేకుండానే ఇలాంటి అవమానాలు మన జీవితంలోకి వస్తాయా?
మనం కలుగజేసుకుంటే దేవుడు మౌనమౌతాడు.మనం మౌనమై, దేవునికి అప్పగించుకుంటే, ఆయన కలుగజేసుకుంటాడు. నూతన నిబంధన మరింత శ్రేష్టమైనది. అలాంటి వారిని అంతరంగం నుండి క్షమించాలి. ఇది ఆత్మ దేవుని శక్తి ద్వారా మాత్రమే సాధ్యం.
-- ఆయన(యేసు) దూషింపబడినా కూడా, బదులు దూషింపలేదు.ఆయన శ్రమపెట్టబడినా కూడా బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.(1పేతురు 2:23)
"శత్రువులను కాదు, తన్నుతానే దేవుని ఉద్దేశ్యాలకు అప్పగించుకొన్నాడు"

Comments
Post a Comment