❇ ఫిలిష్తీయ సైనికుల గుంపు బేత్లెహేంలో ఉంది. అప్పుడు దావీదు అదుల్లాం గుహలో దాగి ఉన్నాడు. దావీదు సైన్యంలో ముఖ్యులైన ముగ్గురు యోధులు అప్పుడు అతనితో పాటే ఉన్నారు. దావీదు౼"బేత్లెహేం ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే బావుండు!" అని ఆశపడ్డాడు. ఆ ముగ్గురు యోధులు ప్రాణాలకు తెగించి, ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి వెళ్లి, బేత్లెహేం ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు చేదుకొని దావీదు దగ్గరకు తీసికొని వచ్చారు.అయితే అతడు ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించి దేవుని సన్నిధానంలో పారబోశాడు. “నేను ఈ నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక! వీరు ప్రాణానికి తెగించి వెళ్ళి ఇవి తెచ్చారు. ఇవి వీరి రక్తంతో సమానం. నేను తాగుతానా?” అని చెప్పి ఆ నీళ్ళు త్రాగలేదు (1దిన 11:16-19). ❇ "బేత్లెహేం" దావీదు స్వంత ఊరు. అందుకే ఒకవేళ ఆ నీళ్లు త్రాగాలని కోరిక పుట్టి ఉండొచ్చు! ముగ్గురు యోధులు ప్రాణాలకు తెగించి తమ రాజు కోరికను తీర్చడానికి సిద్దమయ్యారు.(వారి ప్రాణాలు కోల్పోలేదు). కానీ ఆ నీళ్ళను వారి రక్తంగా రాజు భావించాడు. అప్పటికి తన వరకే ఆలోచించాడు కానీ, తర్వాత ఉన్న ప్రాణాపాయాన్ని గుర్తి...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.