Skip to main content

Posts

Showing posts from November 1, 2018

01Oct2018

✴️ ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు. యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు-"చూడు, నువ్వు గొడ్రాలివి. బిడ్డను కనలేకపోయావు. అయితే నువ్వు గర్భం ధరిస్తావు. నీకు కొడుకు పుడతాడు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షా రసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకు. అపవిత్రమైనదేదీ తినకు. నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు" (న్యాయ 13:1-5) ✴️ ■ మనోహ దంపతులు భక్తిపరులు. దేవుడు తన ప్రణాళికల నెరవేర్పును ఈ కుటుంబం నిలబెట్టుతుందని, తాను పంపబోయే రక్షకుణ్ణి ఈ దంపతులు చక్కగా పెంచగలుగుతారని నమ్మాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడిపించే రక్షకుడు, న్యాయధిపతికి వారు తల్లిదండ్రులగా ఉండబోతారని ఉహించి కూడా ఉండరు. దైవ ప్రణాళికల్లో భాగంగానే వారు కొంతకాలంగా పిల్లలు లేని దంపతులుగా ఉన్నారు. సహజంగానే దుఃఖం, ఆవేదన, అవమానాల గ...