Skip to main content

Posts

Showing posts with the label May-2017

1 May 2017

సమ్సోను-"ప్రభూ! దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో!దయవుంచి ఈ ఒక్కసారి నన్ను బలపరచు". దేవుడు అతని ప్రార్థన విన్నాడు.(న్యాయా16: 28) "నా శత్రువా(సాతానా)! నామీద అతిశయించకు. నేను క్రింద పడ్డా తిరిగి లేస్తాను. నేను చీకటిలో ఉన్నా, దేవుడు నాకు వెలుగై ఉంటాడు"(మీకా 7: 8) యెహోవా పడిపోయినవారందరికీ సహాయం చేస్తాడు. క్రుంగిపోయిన వారినందరిని పైకి లేవనెత్తుతాడు.(కీర్తనలు145:14) తప్పు దారికీ వెళ్లిన కొడుకుకి(దేవునినుంచి దూరమైన వ్యక్తికి) బుద్ధి వచ్చినప్పుడు..లేచి తండ్రి(దేవుని) దగ్గరకు వచ్చాడు. అయితే అతడింకా చాలా దూరంగా ఉండగానే అతని తండ్రి అతణ్ణి చూశాడు. జాలిపడి పరుగెత్తుకొంటూ వెళ్ళి అతని మెడను కౌగలించుకొన్నాడు, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు.(లూకా 15:17,20) నిజంగా తమ తప్పుడు మార్గాలనుండి వెనుదిరిగే వారి కోసం దేవుడు ఎదురు చూస్తుంటాడు. అలాంటి వారికి ఆయన సహాయకుడు. “అయినా నీ మీద తప్పు ఒకటి మోపుతూన్నాను.మొదట నీకున్న ప్రేమ విడిచిపెట్టావు.ఏ స్థితినుంచి క్రిందికి పడిపోయావో జ్ఞాపకం చేసుకో.పశ్చాత్తాపపడి(REPENT) మొదటి పనులు చేయి."(ప్రకటన 2: 4,5)

2 May 2017

ఐగుప్తు బానిసత్వం నుండి దేవుని చేత విమోచించబడిన ఇశ్రాయేలీయులు గొప్ప అద్భుత కార్యలను చూశారు(అలాంటి కార్యాలు వారికీ ముందు కాని, తరువాత తరాలు కాని చూడలేదు). కాని వారిలో చాలా మంది నశించిపోయారు. (హెబ్రీ 3:7-19) వేశ్యయైన రాహాబు దేవుని కార్యాల గురించి మాత్రమే విన్నది కానీ , విశ్వాసముంచి తన ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్దపడింది. క్రీస్తు శిష్యుడు, దేవుని కార్యాలు దగ్గర నుండి చూసినవాడు, అనేక క్రీస్తు సందేశాలు విన్న ఇస్కరియుతు యూదా, తన ఆత్మను కోల్పోయాడు . క్రీస్తును కలుసుకోని, ఆయన  సందేశం ఒక్కటి కూడా వినని అపొస్తలుడైన పౌలు, తన జీవితాంతం క్రీస్తును నమ్మకముగా సేవించాడు.(గలతీ 1:18,19) ఇలాంటి ఉదాహరణాలు ఎన్నో..(లోతు భార్య, ఆకాను, బిలాము, గేహజీ, శాస్రులు పరిసయ్యులు, అననీయ సప్పీరాలు, దేమా). దేవునికి అత్యంత సన్నిహితులైన వారి మధ్య శ్రేష్టమైన దేవుని వాక్యం విని(సరైన సిద్ధాంతాలను కలిగి, దాని లోబడక) నశించిపోయ్యారు . శ్రేష్టమైన సిద్ధాంతాలు కలిగి ఉంటే దేవుడు సంతోషించడు. కాని ఆయనకు హత్తుకొని జీవించినవారే ఆశీర్వదించబడినవారు.అలాంటివారికి సంపూర్ణ వాక్య గ్రహింపు లేకున్నా సరే(ఒక ఉదాహరణ శిలువపైన దొంగ)...

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

4 May 2017

యేసు ఒక రొట్టెను తీసుకొని, "ఆశీర్వదించి", దానిని "విరిచి" శిష్యులకు ఇచ్చాడు. “దీనిని తీసుకొని తినండి. ఇది(మీ కొరకు విరువబడిన) నా శరీరం” అన్నాడు.(మత్తయి 26:26) లూకా 9:16, 24:30, యోహాను 21:13. ఆశీర్వాదకరమైన వ్యక్తులు దేవునిచే తప్పకుండా విరవబడతారు (శ్రమలపాలవుతారు). నోవహు, అబ్రాహాము, మోషే , యోసేపు, దావీదు, యోబు, పేతురు, పౌలు.. ఇలా దైవజనులందరూ దేవునిచే విరగ్గొట్టబడినవారే. దేవుడు వాడుకున్న ప్రతి ఒక్క నాయకుడూ, అనేక శ్రమల ద్వారా, పరీక్షల గుండా వెళ్లిన తర్వాతనే ఆశీర్వాదకరమైనవారయ్యార ు . దేవుడు విరువబోయ్యే(మలిచే) ఆ వ్యక్తిని ముందు ఒంటరిని చేస్తాడు. ఆ ఒంటరితనంలో (దేవునిపై ఆధారపడటం & దైవశక్తిని తెలుసుకోవటంలాంటి) శ్రేష్ఠమైన పాఠాలు నేర్పిస్తాడు(దేవుడు సిద్ధం చేస్తాడు). ఆ తరువాత అతను గొప్ప బలమైన నాయకుడుగా ఆవిర్భవిస్తాడు. దైవికమైన నాయకుడు చాలాసార్లు ఒంటరితనంలొనే ఉంటాడు..ఎందుకంటే లోకం అతనిని ద్వేషిస్తుంది,(లోకంలో కలిసిపోయిన) నామకార్థ క్రైస్తవులు మరి ఎక్కువగా ద్వేషిస్తారు. కాని ఆ ఒంటరితనంలో దేవుని శక్తిని, ఆయన సన్నిధిని అత్యంత దగ్గరగా అనుభవిస్తాము.చీకటిలో వెలుగు జ్యోతు...

6 May 2017

స్వంత నీతి vs దేవుని నీతి స్వంత నీతి(శరీర సంబంధమైన మనస్సు): 1.పాపపు పనులను నిర్లక్యం చేసి మంచి పనులను బట్టి ఉప్పోగుతుంది.(లోపలి స్థితిని నిర్లక్యం చేసి, బయటికి కనిపించే సాక్షం మీదే దృష్టి ఉంచుతుంది) 2.ప్రక్కన వారితో పోల్చుకొని, నేను వారికంటే బాగున్నానని గర్విస్తూ(లోలోపలే) చిన్న చూపు చూస్తుంది. భూసంబంధమైన వనరులను(డబ్బు, హోదా, ఆస్తిపాస్తులు,లోకఙ్ఞానం మరియు లేఖనఙ్ఞానం) దైవ ఆశీర్వాదాలుగా భావిస్తుంది. 3.మనుషుల దగ్గర మెప్పు కోరుకుంటుంది.దేవుని స్నేహాన్ని(మనస్సుని) నిర్లక్యం చేస్తుంది. 4.దైవజ్ఞానాన్ని బట్టి గర్విస్తుంది. నేర్చుకొనే మనస్సుపోతుంది. ఈలాంటి స్థితి నాది కాదు మరొకరిది అనుకుంటుంది. 5.ఈ విధంగా దేవుని కృప(నుండి తొలగి) నిర్లక్యం చేసి, దైవోగ్రతలోకి ప్రవేశిస్తుంది. దేవుని నీతి(ఆత్మ సంబంధమైన మనస్సు): 1.నా మంచిపనులు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు వంటిదని గుర్తించి (దేవుని వాక్యాన్ని నమ్మి) తప్పుడు జీవితాన్ని బట్టి దుఃఖించి, దేవుని ముందు నిల్చొని ఆయన కరుణను వేడుకుంటుంది. 2.తనలాంటి వారిని అర్థం చేసుకొని కృప చూపిస్తుంది మరియు వారికి సహాయం చేస్తుంది . 3.మనుషుల దగ్గర మె...

8 May 2017

అబ్రాము "పశువుల కాపరులు", లోతు "పశువుల కాపరులు" గొడవపడ్డారు..లోతు సొదొమ గొమొర్రాలను(పాపంతో నిండిన) పట్టణాలను కోరుకొని, అబ్రామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.(ఆది 13:7,11) తరువాత రోజుల్లో.. అబ్రాహము దేవుణ్ణి ఇలా ప్రాధేయపడ్డాడు- “ఒకవేళ సొదొమలో పదిమంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చెయ్యవు కదా?” (ఆది18:32) అబ్రాహము దేవుణ్ణి అలా వేడుకోవడంలో అతని ఉద్దేశం ఏంటి? లోతు కుటుంబం మాత్రమే కాకుండా, అతనితో పాటు ఉన్న పనివారు కూడా దేవునిలో ఉంటారని..కానీ లోతు పనివారు సొదొమ ప్రజ లతో పాటు లోకంలో కలిసిపోయారు. లోతు ఈ లోకపు కోర్కెల వైపు పరుగెత్తాడు, కానీ సరైన ఆత్మీయ నాయకుడిగా (తన ఇంటికి, తనతో ఉన్న వారికి) ఉండలేకపోయాడు. దేవునికి అక్కడ పదిమంది నీతిమంతులు కూడా కనిపించలేదు. కనుక దేవుడు ఆ పట్టణాన్ని కాల్చివేసాడు. దేవుడు అబ్రాహము ప్రార్ధనను బట్టి లోతు కుటుంబాన్ని మాత్రమే కాపాడాడు. అబ్రాహము తనతో ఉన్నవారిని ప్రార్ధనాపరులుగా(కుటుంబం), దేవుని చేత నడిపించబడేవారిగా(ఎలియాజరు), విశ్వాస యోధులుగా(పనివారిని) తయారుచేశాడు. నీవు కోరుకునే సహవాసాన్ని బట్టి, ఇష్టపడే (వాటిని) నాయకు...

9 May 2017

నోవహు రోజులు ఎలా ఉన్నాయో క్రీస్తు రాకడ సమయంలో కూడా అలాగే ఉంటాయి. నోవహు రోజుల్లో జల ప్రళయం రాకముందు, ప్రజలు తింటూ త్రాగుతూ పెళ్ళిళ్ళకు ఇచ్చి పుచ్చుకొంటూ వచ్చారు.నోవహు ఓడలోకి వెళ్ళేరోజు వరకూ అలా జరుగుతూ ఉంది. నోవహు ఓడ తయారు చేస్తూవున్నపుడు...దేవుడు, ఆయన మాట వినకుండా జీవిస్తున్న (అవిధేయులైన)వారి విషయంలో ఓపికతో కనిపెట్టి ఆత్మరూపిగానే వారి మధ్యకి వెళ్లి ప్రకటించాడు. కానీ వారు దేవుని మాట లెక్కచెయ్యలేదు. దేవుడు-"నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు" అన్నాడు. అప్పుడు జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసింది. ఆ ఓడలో దేవుణ్ణి నమ్మి ప్రవేశించిన ఎనిమిది మంది మాత్రమే రక్షణ పొందారు. ఈ చివరి దినాలు కూడా అలానే ఉంటాయని యేసు చెప్పాడు. దేవుని సువార్తను విశ్వాసముంచక, క్రీస్తు రక్తంలో పాపాలను కడుగుకొనక, నిన్ను రక్షించగల ఏకైక మార్గమైన క్రీస్తు అనే ఓడలో ప్రవేశించకపోతే(విశ్వసించకపోతే), దేవుని ప్రేమను కనికరాన్ని నిర్లక్యం చేస్తే, ఆ తరం వారిలాగే నశించిపోతాము. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు..మారుమనస్సు పొందు..ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు...

10 May 2017

స్తెఫను(పరిశుద్దాత్మ చేత నింపబడిన శిష్యుడు) కొందరు స్తెఫను మీదికి వచ్చి అతణ్ణి పట్టుకొని మహాసభ దగ్గరకు తీసుకువెళ్ళారు.అక్కడ అబద్ధ సాక్షులను నిలబెట్టి నిందలు మోపారు.సభలో కూర్చొన్న వారంతా అతనివైపు తేరి చూస్తూ ఉంటే అతని ముఖం దేవదూత ముఖంలాగా వారికి కనిపించింది. స్తెఫను-"తలబిరుసుగా ఉన్న మనుషులారా! వంచని మెడగలవారలారా, మీ పూర్వీకులు ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా ఉన్నారు? వారిలాగా మీరు కూడా ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు." ఈ మాటలు విని సభ వారు కోపంతో మండిపడి అతణ్ణి చూచి పటపటా పండ్లు కొరికి నగరం బయటికి అతణ్ణి గెంటివేసి రాళ్ళతో కొట్టి చంపేశారు. పరిశుద్దాత్మ చేత నింపబడినవారు, దేవుని ఆత్మకు లోబడి, దేవుని మనస్సు కలిగి ఆయన వలె ప్రవర్తిస్తారు. భక్తిహీన ప్రజలు, నామకార్ద క్రైస్తవులు, దేవునికి లోబడని విశ్వాసులు వారిని(పరిశుద్దాత్ముని) ద్వేషిస్తారు,ఎదిరిస్తారు. మారుమనస్సు కోసం దేవుడిచ్చే అవకాశాలను కాలదన్నుతారు . నీవు పరిశుద్దాత్ముని చేత నింపబడుతూవున్నావా(అప్పగించుకొనటం)? ఐతే స్తెఫను పొందిన గుర్తులు నీ జీవితంలో కన్పిస్తాయి.

11 May 2017

"సహోదరులారా!..జీవముగల దేవుని విడిచిపెట్టే విశ్వాసములేని లేని చెడ్డ హృదయం, మీలో ఎవరిలోనైన ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోండి" (హెబ్రీ 3:12) దేవునిపై ఉన్న ప్రేమ,విశ్వాసం సన్నగిల్లటానికి గల కొన్ని కారణాలు: 1.రోజులు గడిచేకొద్దీ, దేవుడు క్షమించిన/క్షమిస్తూవున్న క్షమాపనని మర్చిపోతున్నపుడు(చులకనగా చూసినప్పుడు)..(లూకా 7:41-43) 2.లోకసంబంధమైన విషయాలు మళ్ళీ మన జీవితంలోకి ప్రవేశించి ఏలుతున్నపుడు...(లూకా 8:14) 3.ఎదుటి వారిని చూసి ఈర్ష్యపడుతున్నప్పుడు..(మత్తయి 20:16) 4.దేవుని సేవలో నిమగ్నమై, దేవున్ని స్వభావాన్ని(మనస్సుని) ధరించుకొనడం నిర్లక్యం చేసినప్పుడు ...(లూకా 15:25,29) 5.మన హృదయంలోని దేవుని స్థానాన్ని మరొకరు/మరొకటి ఆక్రమించినప్పుడు..(మార్కు 12:30)

12 May 2017

"మీలో ప్రతి ఒక్కరూ సొంత విషయాలు చూచుకోవడం మాత్రమే కాకుండా, ఇతరుల విషయాలు కూడా చూడండి.” (ఫిలిప్పీ 2:4) యేసుక్రీస్తు శరీరధారియై ఉన్న రోజుల్లో గొప్ప జనసమూహం ఆయన వెంబడి ఎప్పుడూ ఉండేది. ఆయన రోగాలు నయ్యం చేస్తూ, అద్భుతకార్యాలు చేస్తూ, దెయ్యాలను వదలగొడుతూ, దేవుని వాక్యం భోదిస్తూ..ఇలా అసాధారణనమైన శక్తితో అందరికి ఎన్నొ మేలులు చేశాడు. కొన్ని సార్లు జనం గుమ్మికూడడం చేత ఆయన భోజనం చేయడానికి కూడా వీలులేకపోయ్యేది. కాని, ఆయన చనిపోయి, సమాధి చేసే సమయానికి అతి కొద్దీ మంది మాత్రమే అక్కడ ఉన్నారు . ఆయన నుండి మేలులు పొందుకున్న చాలా మంది, మేలులు మరచి వదిలేశారు.ఈ సంగతులు ముందుగానే ఆయనకు తెల్సినా కూడా, కృతజ్ఞత లేని వారికి కూడా అలిసిపోక మేలుచేశాడు. ఇది దైవ స్వభావం. పరలోకలోక తండ్రి పిల్లలంగా మనం కూడా ఈ విధంగానే చెయ్యాలి. ఆయన మంచివారికి, చెడ్డవారికి కూడా, సూర్యోదయం కలిగిస్తాడు కదా! న్యాయవంతులకు, అన్యాయస్థులకు కూడా వాన కురిపిస్తాడు కదా! మనకు చెడు చేసిన వారికి, మన పట్ల కృతజ్ఞతలేని వారికి, కూడా మేలు చేసే విషయంలో అలసిపోక క్రీస్తు వలె దేవునికి ఇష్టమైన పిల్లలంగా నడుచుకుందాం!

13 May 2017

ముసలివాడైన అబ్రహాం సంతానంలేని వాడుగా ఉన్నాడు. దేవుడు-"అనేక జనాలకు నిన్ను తండ్రిగా నియమించాను" అని వాగ్దానం చేశాడు. అప్పటికే అతని వయసు సుమారు నూరేళ్ళు కావడంచేత అతని శరీరం క్షీణించిపోయివుంది. ముసలిదైన అతని భార్య గర్భం ఉడికిపోయింది. కాని అతడు వాటిి గురించి పట్టించుకోలేదు. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడని పూర్తిగా నమ్మాడు. "ఆ విశ్వాసము వల్లే బలం పొందాడు". కాబట్టి దేవుడు తన మాట నిల్పుకొన్నాడు. విశ్వాసం అంటే దేవుడు మాట తప్పనివాడని, ఏదైన చేయగల సమర్థుడని సంపూర్తి గా నమ్మడం. పరిస్థితులను, మన శక్తి సామర్ధ్యలను నమ్ముకోకుండా(వైపు చూడక), దేవున్ని ఆనుకోవటం. అలా దేవునిపై ఉంచే విశ్వాసంలో గొప్పశక్తి దాగివుంది. క్రీస్తులోని విశ్వాసం ఒక మనిషి నిత్యత్వాన్ని మార్చేస్తుంది(నరకం నుండి తప్పిస్తుంది..నమ్ముతున్నావ్ కాదా!). అలాగే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి కూడా రహస్యం ఇదే. అంటే ఏ విషయంలో పాపం నిన్ను జయిస్తుందో..దాని నుండి దేవుడి నిన్ను విడిపించగలడని,నీ బలాన్ని బట్టి కాక(ఇప్పటికే ఆ బలహీనత ఎన్ని సార్లు నిన్ను జయించినా సరే) దేవుని వైపు చూసి,ఆయన విడిపించ సమర్థుడన...

15 May 2017

❇ దేవుడు-"మేలు కీడు తెలిపే చెట్టు పండు మాత్రం తినకూడదు.నీవు దాన్ని తినే రోజున తప్పక చస్తావు" అదే ఫలం గురించి పాము(సాతాను) హవ్వతో-“మీరు చావనే చావరు.ఆ చెట్టు ఫలం మీరు తింటే, మంచి చెడ్డలను గూర్చి మీరు తెలుసుకొంటారని దేవునికి తెలుసు. అప్పుడు మీరు దేవునివలె ఉంటారు!’ అంది.(ఆది 2:17,3:4) ❇ కోరహు-"సమాజంలో ఉన్నవాళ్ళంతా పవిత్రులే.వారిలో ప్రతి ఒక్కరూ మంచి వారు.యెహోవా వాళ్ళందరిమధ్య ఉన్నాడు". అదే ప్రజల గురించి దేవుడు మోషే అహరోనులతో-“ఈ మనుష్యులకు దూరంగా వెళ్లిపోండి, నేను వాళ్లను ఇప్పుడే నాశనం చేసేస్తాను” అన్నాడు.(సంఖ్యా 16:3,20) ✔ సాతాను స్వరం ఎప్పుడూ తీయ్యగా, ఆ పనుల కూడా మనస్సుకి ఎంతో సంతోషాన్ని, సుఖాన్ని కలిగించేవిగా ఉంటాయి. దేవుని కంటే ప్రేమగల మాటలు ఒలికిస్తాడు. బైబిల్లో ప్రతి చోట సాతాను ఉపయోగించిన విధానం ఇదే. కాని వాడు(వాడి సంబంధులు) నీ ఆత్మకు చేటు చేసేవారని మర్చిపోవద్దు. చివరికి అది నీ దేవుని సహవాసాన్ని, ఆయన ఉద్దేశాలను దొంగిలిస్తాయి. ✔ పిల్లల్ని మోసం చెయ్యడం మోసగాళ్లకు చాలా సులభం. అది దేవుని స్వరమో, అపవాది స్వరమో గుర్తించాలి. మొదట మాటల కంటే, ఆ మాటల వెనక ఉద...

16 May 2017

జక్కయ్య పన్నులు సేకరించేవాళ్ళలో పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా. అన్యాయంగా ఎంతో డబ్బు సంపాదించాడు.కాబట్టి ఆ ఊరివాళ్లు అతన్ని పాపాత్ముని గా పిలిచేవారు. అప్పుడు అర్థమయ్యింది డబ్బులో నిజమైన సంతోషంలేదని. నిజమైన సంతోషం దేవుని దగ్గరే ఉందని నమ్మి యేసుని కలుసుకోవాలనుకొన్నాడు. జనాలు గుంపుగూడి ఉండటం వల్ల మేడిచెట్టెక్కి యేసుని చూడాలనుకున్నాడు. ఆశ్చర్యం!! యేసే అతణ్ణి వెతుకొంటూ వచ్చాడు.(వాళ్ళ దృష్టికి)మంచివాళ్లమైన తమ దగ్గరకు కాకుండా అతని దగ్గరకిి వెళ్లినందుకు ఊరివారూ ఆశ్చర్యపడ్డారు. ప్రేమ కోసం పరితపిస్తున్న జక్కయ్య, దేవుని ప్రేమకు అబ్బురపడ్డాడు. వెంటనే తన తప్పుడు జీవితాన్ని వదిలేస్తానని క్రీస్తుకు మాట ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమిచడానికి నీతిమంతుడై ఉండక్కరలేదు, కానీ "సత్యాన్ని ప్రేమిస్తే" చాలు. అదే ఆయన దగ్గరకు నిన్ను చేరుస్తుంది.ఆయన నిన్ను చేరుకోవటానికి ఆ ఒక్క లక్షణం చాలు. మన పాపపు స్థితిని యదార్ధంగా దేవుని దగ్గర ఒప్పుకొని, ఆయన సహయం కోరేవారికి దేవుడు ఎల్లపుడూ సహాయకుడు. అన్నిటి కంటే, అందరికంటే దేవుడే ఉత్తముడని మనఃపూర్వకముగా నమ్మాలి. దేవునికే ఉన్నత స్థానం ఇచ్చి, మనస్సు మార్చుకొని,...

17 May 2017

యేసు తన శిష్యులతో-"నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు" (యోహాను 15:5) దేవునిలో నిలిచిఉండటం అంటే దేవుణ్ణి పోలి నడుచుకోవడమే. ఆయన సహవాసంలో స్వంత స్వభావాన్ని వదిలివేసి, దేవుని స్వభావాన్ని పొందటం . పాత జీవితంలో, దేవునితో సంబంధం లేకుండా కొన్ని మంచి పనుల లేదా మంచి అలవాట్లు మనం కలిగి ఉంటాం. పెరిగిన వాతావరణం, నేర్చుకున్న పద్దతులు/అలవాట్లను బట్టి అవి కొందరిలో ఎక్కువగా, కొందరిలో చాలా తక్కువగా ఉంటాయి. మోసపోవద్దు!! అవి ఉన్నపటికీ సహితం మనం దేవుని ఉగ్రత క్రిందే ఉన్నామని గుర్తించాలి. కాబట్టి  అవి పైకి మంచివిగా అందరికి కన్పించొచ్చు,కానీ దేవుడు లేని పనులు(ఉద్దేశాలు చెడ్డవి) దేవుని దృష్టిలో అసహ్యమైనవి. దేవుని వలన, దేవుని బట్టి(అంతరంగం నుండి)ఇప్పుడు అన్ని కొత్తవిగా మార్చబడాలి. అంటే పాత వ్యక్తి సిలువలో క్రీస్తుతో పాటు సిలువవేయబడాలి . దేవుని వల్ల మనం పొందిన ప్రవర్తన దేవునికి దగ్గరౌతుంటే ఆ స్వభావం కలిగి ఉంటాం. దూరమౌతూవుంటే, ఆ స్వభావం కోల్పోతూవుంటాం. పాత స్వభావంలోని మనుషులచే కొనియాడబడిన మన ప్రవర్తనే ఐతే, దేవుని నుండి దూరమైనా అది నిలిచి ఉంటుంది. కొందరు దేవుని నుండి తప్పిపోతున్న వారిలో పాత ...

18 May 2017

నిజదీనత్వం (A True Humbleness): దీనత్వం(తగ్గించుకోవటం) అంటే నేను చెడ్డవాడ్ని, దుష్టుడ్ని, పనికిమాలినవాడ్ని అని చెప్పటమా? లేదా మౌనంగా మాట్లాడకుండా ఉంటూ, అన్నిటికి తలలూపుతూ ఉండటమా? కాదు. ఇలాంటిది అబద్దదీనత్వం. "క్రీస్తు దేవునితో సమానముగా ఉన్నా, ఆయనా స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు. ఆయన అంతా వదులుకొన్నాడు. మానవరూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు. అంతేకాదు, సిలువ మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి తన్నుతాను తగ్గించుకొన్నాడు"(ఫిలిప్పి 2:5-8) యేసు సిలువకు అప్పగించుకోక ముందు పేతురుతో-"నేను అడిగిన వెంటనే నా తండ్రి పన్నెండు దళాలకంటే ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు"(మత్తయి 26:53) మనకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నా, చేయ్యగల సామర్థ్యం ఉన్నా, దేవుని వాక్యన్ని బట్టి (చిత్తాన్ని బట్టి మనుషులు పెట్టే నిందలను, అవమానాలను లెక్కచేయకుండా)బలహీనుడిగా, నిస్సహయునిగా, ఒంటరిగా క్రీస్తువలె ఉండటానికి మనల్ని మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవటం. ప్రవక్త యేసును గూర్చి-"ఇదుగో, మీ రాజు సాత్వికుడై మీ దగ్గరికి గాడిదపిల్లను ఎక్కివస్తూ ఉన్నాడు!"(మత్తయి 21:5) ఆ వె...

19 May 2017

"సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు. ఆయన కంటికి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం లెక్కఅప్పచెప్పవల్సివుంటుంది"(హెబ్రీ 4:13) ఇశ్రాయేలు ప్రజలు అపజయం అంటూ ఎరుగక, ప్రతిసారి యుద్ధంలో విజయం పొందేవారు.అలాంటిది హాయి అనే చిన్న పట్టణం పై ఘోరంగా ఓడిపోయారు. కారణం..శపితమైన ఆ పట్టణం నుంచి ఎమీ తీసుకురాకూడదని,దాన్ని నాశనం చెయ్యమని దేవుడు ముందుగానే చెప్పాడు.(ఇది అవిధేయులపై దేవుని తీర్పు). కానీ, ఆకాను అనే వాడోకడు శపితమైన వస్తువుల్లో కొన్నింటిని దాచిపెట్టుకున్నాడు. వాడు మన ుషులు చూడకుండా జాగ్రత్త పడ్డాడు. కాని దేవుని కంటికి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయని గుర్తించలేకపోయాడు. ఎందుకు ఓడిపొయ్యారో కారణాన్ని దేవుడు నాయకునికి చెప్పాడు.లక్షలమంది ప్రజల్లో కూడా దేవుడు అతణ్ణి రహస్య పాపాన్ని బయటపెట్టి, శిక్షించాడు. సరిగ్గా ఇలాగే మనుషులందరికి దేవుడు తీర్పుతీర్చే రోజున జరుగుతుంది . క్రీస్తు శిష్యుడైన యోహాను-"నాకు ఒక పెద్ద సింహాసనము కనిపించింది. అది తెల్లగా ఉంది. దానిపై కూర్చొన్నవాణ్ణి (దేవుణ్ణి) చూసాను. నేను చనిపోయిన వాళ్ళను చూసాను. అందులో గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు ఉన్నారు....

22 May 2016

“వెంటనే ఆ కన్యకలందరూ నిద్రలేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు.తెలివిలేని కన్యలు ‘మా నూనె అంతా అయిపోయింది! మా దీపాలు ఆరిపోతూ ఉన్నాయి!’.....అంతట తలుపు మూయబడింది.ఈ మాటలతో యేసు తన శిష్యులను హెచ్చరించాడు.(మత్తయి 25:8,11) సాతాను ఆది నుండి దొంగ,(దేవునిపై ఉన్న విశ్వాసాన్ని,దేవునిలో నిలిచివుండటాన్ని) దోచుకొనువాడై ఉన్నాడు. విశ్వాసిని తిరిగి లోకంలోకి తీసుకు వెళ్ళాలనే వాడి ప్రయత్నాలు. వాడు తిన్నని మార్గాలను చెరుపువాడు.విశ్వాసే వాడి ప్రథమ గురి. లోకంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని  మీకు తెలియదా? లోకంతో స్నేహం చెయ్యాలనుకొన్నవాడు దేవునికి శత్రువు అవుతాడు(యాకోబు 4:4). విశ్వాసి మరళా లోకస్నేహనికి తిరిగినప్పుడు, దేవుని ఆత్మ దుఃఖపడతాడు. విశ్వాసం సన్నగిల్లుతుంది. దేవుని క్రియలు పోతాయి. లోకం ఏలుతుంది. క్రియలులేని విశ్వాసం వ్యర్థం కాదా! "దేవుని ఆత్మను ఆర్పకండి"(1థెస్స 5:19). అలా కఠిన పర్చుకొన్నప్పుడు విశ్వాసి విశ్వసభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు . ఒకసారి వెలిగింపబడిన వాళ్ళు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసిన వాళ్ళు, ప్రవిత్రాత్మలో భాగం పంచుకున్న వాళ్ళు, దైవ సందేశం యొక్క మంచ...

23 May 2017

మన జీవితములో కొన్ని మలుపులు దేవునిచేత త్రిప్పబడతాయి. ఎవ్వరైతే దేవున్ని ప్రేమిస్తారో అన్ని (ప్రతికూల) పరిస్థితులు కూడా మేలుగా మారతాయి.(రోమా 8:28) యోసేపు పొలాల్లో తిరుగుతోంటే ఒక మనిషి చూశాడు. ఆ మనిషి-“ఏమిటి వెదుకుతున్నావు” అన్నాడు. యోసేపు-“నేను నా అన్నల కోసం వెదుకుతున్నాను. వాళ్లు గొర్రెల్ని మేపుకొంటూ ఎక్కడ ఉన్నారో నీవు చెప్పగలవా?”  ఆ మనిషి-“అప్పుడే వాళ్లు వెళ్లిపోయారు గదా. వాళ్లు దోతాను వెళ్తాం అని చెప్పుకోవటం నేను విన్నాను” కనుక యోసేపు తన అన్నలను వెతుకుంటూ దోతానుకు వెళ్లి వారిని అక్కడ చూశాడు.తర్వాత అన్నలు యోసేపును ఐగుప్తుకు బానిసగా అమ్మివేయటం, ఎన్నో కష్టాలగుండా యోసేపు వెళ్లి, దేవుని చిత్త ప్రకారం ఐగుప్తుకు గొప్ప పరిపాలకుడు అవ్వటం మనకు తెలిసిందే . అతని జీవితంలో పైన చెప్పిన ఆ మనిషిని దేవుడే వాడుకున్నాడు. యోసేపు వెను వెంటనే ఇతని గూర్చి ఆలోచిస్తే, ఆ మనిషిని కలుసుకోక పోతే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదని అనుకునే వాడేమో! కాని, సుదీర్ఘ జీవిత ప్రయాణంలో ఈ మలుపు దేవునిచేత మంచి కొరకే తిప్పబడిందని గ్రహించాడు. అలాగే మన జీవితంలో మనం కలుసుకొనే కొన్ని చేదు అనుభవాల వెనుక దేవుని హస్తం ఉన్నదని,...

24 May 2017

పౌలు-"నేను ఏ స్థితిలో ఉన్నా ఆస్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకొన్నాను." (ఫిలిప్పీ 4: 11) లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు ఉండేవి. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి.ధనవంతుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు. ఆ భిక్షగాడు చనిపొయ్యాడు. అతణ్ణి దేవదూతలు(పరదైసుకు) తీసుకువెళ్ళి అబ్రాహాము ప్రక్కన కూర్చుండబెట్టారు.  అబ్రాహాము బ్రతికి ఉన్న రోజుల్లో గొప్ప ధనవంతుడు.లాజరు దరిద్రుడు. వీరిద్దర్నీ ఒకచోట చేర్చింది వారికి దేవునిపై ఉన్న విశ్వాసం. లాజరు కడు బీదరికంలో, జబ్బులతో ఉన్నా ఎన్నడూ దేవుని తిట్టలేదు, ఎవ్వరితో తన స్థితిని పోల్చుకోలేదు. చివరికి దిక్కులేని చావును పొందినప్పటికీ, తన అంతిమ స్థితి దేవుని చెంతేనని విశ్వాసం కలిగి జీవించాడు.దేవుడు ఉంచిన ప్రతి పరిస్థితితుల్లో నమ్మకంగా దేవుణ్ణి సేవించాడు. అబ్రాహాం తన జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. దేవుని ముందు ధనాన్ని గడ్డిపరకతో సమానంగా ఎంచాడు. జరగటానికి ఎలాంటి అవకాశాలు లేని వాటిని దేవుడు వాగ్దానం చేస్తే, నిస్సందేహంగా నమ్మి, వాటికోసం ఎదురుచూశాడు. అతను ఎంతో ఇష్టపడ...

25 May 2017

దేవుడు సీనాయి పర్వతం మీదకు మోషేను పిలిచాడు.మోషే అక్కడ నలభై పగళ్ళూ నలభై రాత్రులూ ఉండిపొయ్యాడు.మోషే రావడం ఆలస్యం కావడం ప్రజలు చూచి.. అహరోనుతో- "చూడు! మా ముందర వెళ్ళడానికి ఒక దేవుణ్ణి మా కోసం చెయ్యి. మమ్మల్ని ఈజిప్ట్‌దేశంనుంచి తెచ్చిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు" అన్నారు. అప్పుడు ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు. వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు మరియు ఒక బలిపీఠం నిర్మించాడు."రేపు యెహోవాకు ప్రత్యేక పండుగ" అని చెప్పాడు. ఒక్క దైవికమైన నాయకుడు(మోషే) అక్కడ లేకపోవడాన్ని బట్టి అప్పుడు గొప్ప నాశనం జరిగింది. దేవుణ్ణి పోలిన (దేవునితో నడిచే) ఒక్క వ్యక్తి చాలు, గుంపును దైవికంగా నడిపించడానికి. ప్రజల మెప్పు కోసం కాక(వారికి భయపడక), దేవుణ్ణి సంతోషపెట్టే నాయకత్వమే శ్రేష్ఠమైన నాయకత్వం. ఇలాంటి నాయకత్వాన్ని సహజంగానే ప్రజలు కోరుకొరు. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. తమకు నచ్చినట్లు ప్రవర్తించే నాయకుడ్నే , దేవుణ్ణే (మాట్లాడలేని విగ్రహన్ని) మనుష్యులు కోరుకుంటారు. విశాల మార్గానికి పొయ్యెవారు అనేకులు. దానికి నడిపించే నాయకులంగా మనం ఉండకూడదు.(విశ్వాసుల గూర్చి చెప్తున్నాను) పౌలు ఎఫ...