సమ్సోను-"ప్రభూ! దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో!దయవుంచి ఈ ఒక్కసారి నన్ను బలపరచు". దేవుడు అతని ప్రార్థన విన్నాడు.(న్యాయా16: 28)
"నా శత్రువా(సాతానా)! నామీద అతిశయించకు. నేను క్రింద పడ్డా తిరిగి లేస్తాను. నేను చీకటిలో ఉన్నా, దేవుడు నాకు వెలుగై ఉంటాడు"(మీకా 7: 8)
యెహోవా పడిపోయినవారందరికీ సహాయం చేస్తాడు. క్రుంగిపోయిన వారినందరిని పైకి లేవనెత్తుతాడు.(కీర్తనలు145:14)
తప్పు దారికీ వెళ్లిన కొడుకుకి(దేవునినుంచి దూరమైన వ్యక్తికి) బుద్ధి వచ్చినప్పుడు..లేచి తండ్రి(దేవుని) దగ్గరకు వచ్చాడు. అయితే అతడింకా చాలా దూరంగా ఉండగానే అతని తండ్రి అతణ్ణి చూశాడు. జాలిపడి పరుగెత్తుకొంటూ వెళ్ళి అతని మెడను కౌగలించుకొన్నాడు, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు.(లూకా 15:17,20)
నిజంగా తమ తప్పుడు మార్గాలనుండి వెనుదిరిగే వారి కోసం దేవుడు ఎదురు చూస్తుంటాడు. అలాంటి వారికి ఆయన సహాయకుడు.
“అయినా నీ మీద తప్పు ఒకటి మోపుతూన్నాను.మొదట నీకున్న ప్రేమ విడిచిపెట్టావు.ఏ స్థితినుంచి క్రిందికి పడిపోయావో జ్ఞాపకం చేసుకో.పశ్చాత్తాపపడి(REPENT) మొదటి పనులు చేయి."(ప్రకటన 2: 4,5)
Comments
Post a Comment