దేవదూత మానోహ భార్యతో -"ఇదుగో నీవు గొడ్రాలివి. నీవు గర్భవతివవుతావు. కొడుకును కంటావు. నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షమద్యం గానీ, మరే మద్యం గానీ త్రాగకు, అపవిత్రమైనది ఏదీ తినకు.ఎందుకంటే ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచీ దేవునికి ప్రతిష్ఠితుడుగా ఉంటాడు. శత్రువుల నుండి విడిపించే రక్షకుడవుతాడు" (న్యాయా13:3-6)
దేవుని సువార్తను నమ్మి, పాపముల విషయమై పశ్చాత్తాపం(మరుమనస్సు) పొందిన ప్రతివారిలో మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు యెక్క ఆత్మ నివసిస్తాడు.
రక్షకుడున్ని(ప్రతిష్ఠితుణ్ణి) మోస్తున్న మానోహ భార్య పవిత్రంగా ఉండాలని దేవుని ఆజ్ఞ పొందితే, అత్యంత పరిశుద్దుడైన క్రీస్తుఆత్మను హృదయంలో పొందినవారు మరి ఎంతో శ్రేష్ఠమైన జీవితాన్ని జీవించ వలసి ఉంటుంది కదా?
-- పరిశుద్ధగ్రంధం ఇలా చెప్తుంది.
"మీ శరీరం దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీకు తెలియదా? మీరు మీ సొత్తు కారు. విలువపెట్టి (క్రీస్తు రక్తంతో) కొనబడినవారు గనుక మీ శరీరంతో దేవుని ఘనపరచండి" (1కోరింథీ 6: 19,20)
"ఎవరైనా దేవుని ఆలయమును పాడుచేస్తే దేవుడు వానిని పాడుచేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు(మీరును పరిశుద్ధులైయున్నారు)" (1కోరింథీ 3: 17)
పౌలు-"కాబట్టి, సోదరులారా, మీ శరీరాలను పరిశుద్ధముగా దేవునికి సమర్పించండని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను. ఈ అర్పణ సజీవమైనది, పవిత్రమైనది, దేవున్ని సంతోషపరచేది. ఇలా చేయడమే నిజమైన దేవుని సేవ."(రోమా 12:1)
Comments
Post a Comment