స్వంత నీతి vs దేవుని నీతి
స్వంత నీతి(శరీర సంబంధమైన మనస్సు):
1.పాపపు పనులను నిర్లక్యం చేసి మంచి పనులను బట్టి ఉప్పోగుతుంది.(లోపలి స్థితిని నిర్లక్యం చేసి, బయటికి కనిపించే సాక్షం మీదే దృష్టి ఉంచుతుంది)
2.ప్రక్కన వారితో పోల్చుకొని, నేను వారికంటే బాగున్నానని గర్విస్తూ(లోలోపలే) చిన్న చూపు చూస్తుంది. భూసంబంధమైన వనరులను(డబ్బు, హోదా, ఆస్తిపాస్తులు,లోకఙ్ఞానం మరియు లేఖనఙ్ఞానం) దైవ ఆశీర్వాదాలుగా భావిస్తుంది.
3.మనుషుల దగ్గర మెప్పు కోరుకుంటుంది.దేవుని స్నేహాన్ని(మనస్సుని) నిర్లక్యం చేస్తుంది.
4.దైవజ్ఞానాన్ని బట్టి గర్విస్తుంది. నేర్చుకొనే మనస్సుపోతుంది. ఈలాంటి స్థితి నాది కాదు మరొకరిది అనుకుంటుంది.
5.ఈ విధంగా దేవుని కృప(నుండి తొలగి) నిర్లక్యం చేసి, దైవోగ్రతలోకి ప్రవేశిస్తుంది.
దేవుని నీతి(ఆత్మ సంబంధమైన మనస్సు):
1.నా మంచిపనులు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు వంటిదని గుర్తించి (దేవుని వాక్యాన్ని నమ్మి) తప్పుడు జీవితాన్ని బట్టి దుఃఖించి, దేవుని ముందు నిల్చొని ఆయన కరుణను వేడుకుంటుంది.
2.తనలాంటి వారిని అర్థం చేసుకొని కృప చూపిస్తుంది మరియు వారికి సహాయం చేస్తుంది .
3.మనుషుల దగ్గర మెప్పు కంటే, దేవుని మెప్పు కోరుకుంటుంది. ఈ లోకం చేత ద్వేషించబడ్తుంది.
4.దేవుని యొక్క శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకొంటుంది. దైవ స్వరాన్ని గుర్తిస్తుంది, నేర్చుకుంటుంది (వయస్సు , తెలివితేటలూ, స్థితిగతులను పట్టించుకోదు). దైవచూపు తో మనుష్యులను, పరిస్థితులను చూస్తుంది .
5.క్రీస్తు(సిలువ బలియాగం)లో విశ్వాసముంచి, విమోచకుణ్ణి ఆశ్రయించి, కృపలో ప్రవేశించి(నిలిచివుండి) దేవుని నీతిని పొందుకుంటుంది. రక్షణలో ప్రవేశిస్తుంది.
(రోమా 3:20-28)
Comments
Post a Comment