ముసలివాడైన అబ్రహాం సంతానంలేని వాడుగా ఉన్నాడు.
దేవుడు-"అనేక జనాలకు నిన్ను తండ్రిగా నియమించాను" అని వాగ్దానం చేశాడు.
అప్పటికే అతని వయసు సుమారు నూరేళ్ళు కావడంచేత అతని శరీరం క్షీణించిపోయివుంది. ముసలిదైన అతని భార్య గర్భం ఉడికిపోయింది. కాని అతడు వాటిి గురించి పట్టించుకోలేదు. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడని పూర్తిగా నమ్మాడు. "ఆ విశ్వాసము వల్లే బలం పొందాడు". కాబట్టి దేవుడు తన మాట నిల్పుకొన్నాడు.

విశ్వాసం అంటే దేవుడు మాట తప్పనివాడని, ఏదైన చేయగల సమర్థుడని సంపూర్తిగా నమ్మడం. పరిస్థితులను, మన శక్తి సామర్ధ్యలను నమ్ముకోకుండా(వైపు చూడక), దేవున్ని ఆనుకోవటం. అలా దేవునిపై ఉంచే విశ్వాసంలో గొప్పశక్తి దాగివుంది.
క్రీస్తులోని విశ్వాసం ఒక మనిషి నిత్యత్వాన్ని మార్చేస్తుంది(నరకం నుండి తప్పిస్తుంది..నమ్ముతున్నావ్ కాదా!). అలాగే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి కూడా రహస్యం ఇదే. అంటే ఏ విషయంలో పాపం నిన్ను జయిస్తుందో..దాని నుండి దేవుడి నిన్ను విడిపించగలడని,నీ బలాన్ని బట్టి కాక(ఇప్పటికే ఆ బలహీనత ఎన్ని సార్లు నిన్ను జయించినా సరే) దేవుని వైపు చూసి,ఆయన విడిపించ సమర్థుడని సంపూర్తిగా నమ్మి..నిన్ను విడిపించగల సమర్థునికి నిన్ను నీవే లోబర్చుకో(అబ్రహాం ఆ వాగ్దానం పొందటానికి 25 సం౹౹ పట్టింది)..కృంగిపోక విశ్వాసంతో ఎదురు చూడు. ఎందుకంటే అబ్రహాం దేవుడే నీ దేవుడు కనుక.
"దేవుని మూలంగా పుట్టిన వారంతా లోకాన్ని జయిస్తారు.
లోకాన్ని జయించినది మన విశ్వాసమే"(1యోహాను 5:4)
లోకాన్ని జయించినది మన విశ్వాసమే"(1యోహాను 5:4)
Comments
Post a Comment