Skip to main content

Posts

Showing posts with the label May-2020

22May2020

✴   ఫిలిష్తీయుల సైన్యంలోనుండి గొల్యాతు అనే బలశాలి బయలుదేరాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జానెడు. అతడు తన తలపై కంచు శిరస్త్రాణం ధరించాడు. అతడు యుద్ధ కవచం పెట్టుకున్నాడు. కవచం బరువు 57 కిలోలు. అతని కాళ్లకు కంచు కవచం, అతని భుజాల మధ్య ఒక కంచు బల్లెం ఉన్నాయి. అతని చేతిలోని ఈటె, చేనేత పనివాడి అడ్డకర్ర అంతపెద్దది. ఈటె కొన బరువు 7 కిలోల ఇనుమంత బరువు. ఒక సైనికుడు బల్లెం మోస్తూ గొల్యాతు ముందు నడుస్తున్నాడు.. దావీదు-"యెహోవా కత్తిచేత, ఈటెచేత రక్షించేవాడు కాదని ఇక్కడ ఉన్నవారంతా తెలుసుకుంటారు. య ుద్ధం యెహోవాయే చేస్తాడు"(1సమూ 17:4-7,47)   ✴ ■ గొల్యాతు యొక్క రూపు, బలం వర్ణన ఎంతో గొప్పగా వివరించబడింది. గొల్యాతుతో పోల్చితే దావీదు అత్యంత స్వల్పమైన,బలహీనమైన వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ కధ ముగింపుకు దావీదు చేతిలో గొల్యాతు ఎవరూ ఊహించని రీతిలో చంపబడతాడు. ఇది దావీదు శక్తితో లేక బలంతో జరిగిందా? కాదు.. రాజైన సౌలు, ఇశ్రాయేలీయులు దేవుని వైపు చూడకయే గొల్యాతు దేహదారుఢ్యాన్ని చూసి భయపడ్డారు. కానీ దావీదు బలశాలియైన దేవుని బలం వైపు తీక్షణంగా చూస్తూ, ఆయన బలాన్ని సరిగ్గా అంచనా వేశాడు. విర్రవీగిన శత్రువు బలాన్ని అణచి...