Skip to main content

Posts

Showing posts from April 4, 2018

04Apr2018

✴️సొలొమోను ముసలివాడయిన తరువాత అతడి భార్యలు అతడి హృదయాన్ని ఇతర దేవుళ్ళవైపు మళ్ళించారు. అతడి తండ్రియైన దావీదు వలె తన దేవుడైన యెహోవాను మనస్పూర్తిగా అనుసరించలేదు... సొలొమోను మోయాబీయుల ఘోరమైన కెమోషు ‌దేవుడికీ, అమ్మోనువాళ్ళ భయానక విగ్రహమైన మొలెకు దేవునికీ యెరూషలేముకు ఎదురుగా ఉన్న కొండమీద ఎత్తయిన పూజాస్థలాలను కట్టించాడు. ఇతర దేశాలకు చెందిన తన భార్యల కోసం సొలొమోను ఎత్తయిన ఆ పూజా స్థలాలను కట్టించాడు. సొలొమోనుకు దేవుడు రెండు సార్లు ప్రత్యక్షమై హెచ్చరించాడు. అయినా ఆయన ఆజ్ఞాపించినట్టు సొలొమోను ప్రవర్తించలేదు, దేవున్నుండి దూరమయ్యాడు. కాబట్టి దేవుడు సొలొమోను మీద కోపగించి౼"నీవు నా నిబంధనను నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడాలను అనుసరించుటకు ఇష్టపడలేదు గనుక నీ రాజ్యాన్ని నీ నుండి వేరు చేస్తానని నిశ్చయంగా చెప్తున్నాను.దానిని నీ సేవకునికి ఇస్తాను.." అన్నాడు (1రాజు 11:4-11) ✴️ ■ సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు. అతని జ్ఞానం చొప్పున సమస్త వైభవాన్ని, విలాసవంతమైన జీవితం కోసం కావాల్సిన ప్రతి ఏర్పాటును సిద్ధపర్చుకున్నాడు. ఇతర రాజులు సైతం ఆశ్చర్యపోయే విధంగా రాజ్యాన్ని, ఆలయాన్ని కట్టించాడు. చివరికి డాలులు, క...

03Apr2018

✴️ఆయన(యేసు) తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది, కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు. (మత్తయి 1:18,19) ✴️ ■ దేవుని గొప్ప రక్షణ ప్రణాళిక నెరవేరాలంటే ఒక స్త్రీ ఖచ్చితంగా అవమానం పొందావల్సిందే! ఎందుకంటే రక్షకుడు కన్యక గర్భాన పుడతాడని లేఖనం చెప్తుంది. కన్యకయైన ఒక స్త్రీ నేను గర్భవతినై రక్షకుణ్ణి మోస్తున్నానంటే ఎవరు నమ్ముతారు? సహజంగా జరత్వం వల్ల గర్భం ధరించిన స్త్రీల జాబితాలోనే వారిని చూస్తారు, అవమానిస్తారు.లేఖనాలు చదవొచ్చు గాని ఆ లేఖనాల్లో వ్రాయబడినది తన గూర్చే అంటే ఎవరు నమ్మగలరు? యెషయా౼"మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?" (యెషయా 53:1) ■ దేవుడు తనకు ఇచ్చిన స్థానాన్ని 'మరియ' తీసుకోవాలంటే కేవలం దేవుని పైనే దృష్టి నిలిపి, ఆయన ఆలోచనలనే ఘనంగా ఎంచాలి. అంతేకాదు మనుష్యుల అభిప్రాయాలను, మాటలను భరించడానికి సంపూర్తిగా ఇష్టపడాలి. దేవుని ఆలోచనల్లో నిలవాలంటే, లోక ఆలోచనల్లో నుండి సంపూర్ణంగా వేరవ్వాలి. యోసేపుకు ప్రధాన...

01Apr2018

✴️యేసు పేతురుతో౼"తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా" అనెను (యోహాను 18: 11) యేసు పిలాతుతో౼"పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు" (యోహాను 19:11) ✴️ ■ యేసు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయనకు తెల్సు. ఆదిలో తండ్రియైన దేవుని రక్షణ ప్రణాళికల ఏర్పాటును, లేఖనాల్లో వ్రాయబడిన క్రీస్తు మరణంను, అందులో నెరవేరబోతున్న దేవుని ఉద్దేశ్యాలను ఆయన సంపూర్ణంగా యెరిగివున్నాడు. నమ్మక ద్రోహం చేసిన యూదాపై ఆయన కోప్పడలేదు, మత పెద్దలతో వాదనకు దిగలేదు, ఇది అన్యాయపు తీర్పు అని పిలాతు ముందు గొంతెత్తి చెప్పలేదు. ఎందుకంటే సిలువ దేవుని ప్రణాళిక! దేవునిచే అనుగ్రహింప బడిన పాత్ర!  కనుకనే ఆయన దృష్టి మొత్తం సిలువలో దేవుని ప్రణాళికలపైనే (లేఖనాల నెరవేర్పు పైనే) ఉన్నది, కాని యూదా ద్రోహంపై గాని, భ్రష్ట హృదయాలతో మతనాయకులు చేస్తున్న పనులపై గాని లేదు. అలాగని మనుష్యులు నిర్దోషులని కాదు గాని, అటువంటి వారి విడుదల కోసమే రక్షకునిగా వచ్చాడని ఆయనకు తెలుసు. ఒకవేళ మనుష్యులు ఏమైనా హాని తలపెట్టాలని చూసినా, అది తండ్రి సమయం కాకపోతే ఆయనను వారేమి చేయ లేకపోయారు. దేవుడు అనుమత...