Skip to main content

Posts

Showing posts with the label Apr-2017

3 April 2017

What is CROSS?(Luke 9:23) The one who goes for CROSS, it's sure that he has to bear torture and will DIE (won't return back&no more). The nature of man is, want to PLEASE himself. When we are crucified with CHRIST by faith in Him, we are to COMPLETELY surrender selfish desires​ and ambitions​ to the PERFECT will of GOD. We have to consider ourselves DEAD to self life (daily) & made CHRIST as a ki ng to our lives(daily). PAUL says.. “I have been crucified with Christ; and it is no longer I who live..but Christ lives in me." Gal 2:20 "God bought you with a high price(with His blood),You are not your own." 1Co 6:19,20 "For to me, living means living for Christ, and dying is even better." Php1:21 Be a PRACTICAL CHRIST follower.

4 April 2017

మోషే -- "నరహత్య చెయ్యకూడదు" Ex 20:30 Once upon a time, Moses was a MURDERER. గిద్యోను --"ఎవరైతే భయం తో వణకుతున్నారో వారు..వెళ్ళిపోవచ్చు" Jud 7: 3 Once upon a time Gideon, himself a FEARFUL man. పేతురు -- "నీవు అబద్ధమాడినది మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి" Acts 5:4 Once upon a time,Peter (DENIED) LIED about son of GOD. పౌలు -- "వీటన్నిటికీ పైగా ప్రేమను ధరించుకొనుడి. పరిపూర్ణ ఐక్యత కలిగించే బంధం ప్రేమే" Col 3:14 Once upon a time, Paul TORTURED and KILLED people. When GOD entered​ into a WEAK man, He will become a NEW man(2Cho 5: 17). Because GOD is ALL MIGHTY (POWERFUL). This is TRUE with your life too..

5 April 2017

బైబిల్ --"ఆయన(యేసు క్రీస్తు) ఆకారమందు మనుష్యుడుగా కనబడి.." ఫిలిప్పీ 2:8. ఆయన(యేసు క్రీస్తు) అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్టికి కారణభూతుడైయున్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.

9 April 2017

కొలస్స 1: 24 పౌలు -- " ఇప్పుడు మీకోసమైన నేను అనుభవించుచున్న శ్రమల యందు ఆనందిస్తూ ఉన్నాను. సంఘము అను ఆయన శరీరము కోసం క్రీస్తు కష్టాలలో, తక్కువైన వాటిని నా వంతు నా శరీరంలో సంపూర్ణము చేస్తూ ఉన్నాను" శ్రమ పౌలు కోసం మాత్రమే కాదు కానీ, నీ(నా) కోసం కూడా కొదువ ఉంచబడినదని నీకు తెలుసా? అది మన శరీరంలో సంపూర్ణం చెయ్యబడాలి. Col 1:24 Paul-"I am happy to suffer for you now. In my body I am completing whatever remains of Christ's sufferings. I am doing this on behalf of His body, the church" Do remember, it's not only for Paul, but for yours & mine suffering remained. It has to be fullfill in our bodies.

12 April 2017

A) హనోకు 65 సంవత్స్తరాలు దేవుడు లేకుండా(దేవుని తో నడవకుండా) తన జీవితాన్ని వ్యర్థ పర్చుకున్నాడు(ఆది 5:21, 22). Enoch's wasted 65 years of his life, without (walk) know God.(Gen 5:21, 22) B) తరువాత దేవుణ్ణి నమ్మి , ఆయన మార్గాల్లో ఇష్టపూర్వకంగా నడిచాడు.(ఆది 5:24) When he knew(put faith in) God, he desired to be in the ways of God.(Gen 5:24). C) భక్తిహీన ప్రజల నుండి తనను తాను వేరుపరచుకొని, దేవుని తీర్పుని బట్టి వారిని హెచ్చరించాడు.(యూదా 1:14) He himself separated from the wicked generation. He warned them about judgment of God(Jud 1:14). D) దేవుని మీద తన విశ్వాసాన్ని(క్రియల వలన రుజువుచేసుకున్నాడు)కాబట్టి దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. (హెబ్రీ 11:5,6) Because of his faith in actions God loved him very much(Heb 11:5,6) ఆవిధంగా హనోకు తన తరంతో తన పరుగు ముగించాడు...ఇక ఇది మన సమయం!!!! Enoch completed his race in his generation...Now this is our turn!!!!

15 April 2017

దేవుడు-- "మీరున్న ఇండ్లకు ఆ(గొర్రెపిల్ల) రక్తం గుర్తుగా ఉంటుంది. నేను ఆ (గొర్రెపిల్ల)రక్తాన్ని చూచి మిమ్ములను దాటిపోతాను. అప్పుడు నా ఉగ్రత మీ మీదికి రాదు" నిర్గమ 12: 13 ప్రవక్తయేన యోహాను యేసు వైపు చూచి “ఇదిగో, లోక పాపాన్ని మోసి తీసివేసే దేవుని గొర్రెపిల్ల!" యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుంచి శుద్ధి చేస్తుంది. ఆయన రక్తం ద్వారా మనకు విముక్తి, అంటే మన పాపాలకు క్షమాపణ కలుగుతుంది.

18 April 2017

దేవుడు కయీనును, అతని అర్పణను లక్ష్యపెట్టలేదు... కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. (ఆది 4: 5,8) అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, యేసును ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. (మత్తయి 12:14) పెద్ద కుమారుడు పొలమునుండి వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని.. కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను.(లూకా 15:25,28) మత సంబంధమైన భక్తిహీనులు(దేవునికి అవిధేయులు), దేవుణ్ని నమ్మని వారి కంటే అపాయకారమైనవారు. అట్టివారు తమ దుస్థితిని గుర్తించటం చాలా కష్టం. ఎందుకంటే సహజంగా వారి బాహ్యజీవితం ఎంతో శుభ్రంగా ఉంటుంది, కాబట్టి అంతరంగాన్ని లక్ష్యపెట్టరు.దేవుని తో ఉంటారు కానీ దేవుని లక్షణాలు కలిగి జీవించరు. ఇలాంటి భక్తి దేవుని ఉగ్రతకు(నరకానికి) దారితీస్తుంది. "దేవుడు నీవు ఏమి చేస్తున్నావు కంటే ఎందుకు చేస్తున్నావో(నీ హృదయాన్ని)లక్ష్యపెడతాడు. నీ ఉద్దేశాన్ని గమనిస్తాడు".

19 April 2017

యోసేపు తన సహోదరులతో --"మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించారు గాని, ఆ కీడును మేలుకే దేవుడు ఉద్దేశించాడు" (ఆది 50:20) దేవుడు యోసేపుని గొప్ప అధికారిగా చేస్తానని వాగ్దానం చెసాడు.కానీ అసూయపరులైన అన్నలు బానిసగా అమ్మేసారు. కోరిక తీర్చనందుకు యజమాని భార్య చెరసాలలో పెట్టించింది. సహాయం పొందినవారు మర్చిపోయారు. అత్యంత ఒంటరితం అనుభవించాడు కానీ దేవుడు అతనికి తోడైయున్నాడు. చివరికి దేవుడు ఇచ్చిన  మాటను నెరవేర్చాడు. ఎదుటి వారిలోని చెడుతనాన్ని సైతం దేవుడు మన మేలుకు మార్చగలడు. ఈ శ్రమలన్నీ దేవుని  ఉద్దేశాలు అతని జీవితంలో నెరవేరడానికి మెట్లుగా దేవుడు చేశాడు. దీనిని అతను నమ్మాడు కనుకనే వారందరిని క్షమించాడు. నీవు దేవుని మాట విని లోబడి నడుస్తుంటె నీకు ఎవరు హాని చెయ్యాలని చూసినా అది నీకు చివరికి మేలుగా మారుతుంది.నీ జీవితం దేవుని చేతిలో భద్రంగా ఉంది.

20 April 2017

దేవుడు -"నేను సర్వశక్తిగల దేవుడను" (ఆది 17:1) ఆదిలో దేవుడు -- "వెలుగు కలగాలి" అని పలుకగా వెలుగు కలిగెను.(ఆది 1:3) యేసు--“లాజరూ! బయటికి రా!” అని బిగ్గరగా పిలిచాడు.చనిపోయినవాడు సజీవంగా బయటికి వచ్చాడు (యోహాను 11: 43) మనం విశ్వాసం ఉంచుతుంది లేని వాటిని ఉన్నట్లుగా పిలచి , చనిపోయిన వారిని సయితం సజీవులనుగా చేయగలిగినవాణ్ణి.(రోమా 4:17) దీనికి నమ్ముతున్నావా? ఐతే అదే దేవుడు నీ పాపపు అలవాట్ల నుండి కూడా విడిపించగలడని ఎందుకు నమ్మవు? ఆయన శక్తిని వాక్యం వరకే పరిమితం చెయ్యవద్దు, కాని నమ్మి నీ జీవితానికి అన్వయించుకో. ఎందుకంటె ఆయన నిన్న నేడు ఎప్పటికి ఒకే రీతిగా ఉన్నాడు. ఇక్కడ సమస్య విశ్వాసమే. విశ్వసించిన వారు పొందుతారని దేవుడు చెప్పాడు కదా? “నేను(దేవుడు) పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండండి” అని రాసి ఉంది.(1పేతురు 1: 16) పరిశుద్దాత్మ దేవుడు ఇలాంటి జీవితం లోకి మనల్ని నడిపిస్తాడు. వాగ్దానం ఇదిగో. "మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును...

21 April 2017

పిలాతు(రోమాన్ గవర్నర్)-"యూదుల రాజైన నజరేయుడగు యేసు" అను వ్రాత వ్రాయించి సిలువ మీద పెట్టించాడు.(యోహాను 19:19) పిలాతు యేసును రాజు గా విశ్వసించే ఆ పలక వ్రాయించాడా? ఆ మాట నిజంగా అతను నమ్మినట్లైతే రాజు ఎక్కడ ఉండాలి? ఆయనకు గౌరవం ఎక్కడ? క్రీస్తు గవిని (నగరం ద్వారం) వెలుపట శ్రమపొందెను.(హెబ్రీ 13:12). సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు.ఆయనను చేతులతో కొట్టారు.(యోహాను 19:2,3) పిలాతు మనుష్యులను సంతోషపరచిగోరి ఇదంతా చేశాడు.అతని మాటలకు క్రియలు పూర్తి విరుధ్ధంగా ఉన్నాయి. క్రియలు లేని విశ్వాసం మృతము. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తన విశ్వాసాన్ని క్రియలతో రుజువుచేశాడు. యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు తెగించి, పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగాడు.(మార్కు 15:43) ఒకవేళ ఆయనే దేవుడని నీవు చెప్పొచ్చు కానీ, నీ విశ్వాసం క్రియరూపంగా రుజువు చేయబడుతుందా? లేదంటే పిలాతు నమ్మకమే నీ నమ్మకం అవుతుంది. దేవుడు ఆయనను అభిమానించమని చెప్పలేదు కానీ అనుసరించమని చెప్పాడు. యేసు--"ఎవడైనను నన్ను వెంబడింప కోరినయెడల తన్నుతాను నిరాకరించుకొని, ప్రతిదినము తన సిలువ...

24 April 2017

"సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు"(2కోరింథీ 11: 14) మనం ఊహిస్తున్నట్లుగా సాతాను క్రూరమైన ఆకారంతో, స్వరంతో రాడు కాని, చాలా సార్లు, మనకు చాలా దగ్గరగా ఉండే వారి ద్వారా, తీయ్యనైనా స్వరంతో మనల్ని ప్రేరేపిస్తాడు. ఆమె(హవ్వ) దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును(ఆదాముకు) ఇచ్చెను, అతడుకూడ తినెను(ఆది 3: 6) శారయి అబ్రాముతో “ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు. మీరు నా దాసి దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ ఆమె మూలంగా నాకు పిల్లలు కలుగుతారు” అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.(ఆది 16: 2) యోబు భార్య అతనితో ఇలా అంది-“నీవింకా నీ యథార్థతను విడవవు గదూ! దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో"(యోబు 2: 9) పేతురు యేసును ఒక్కన్నే తీసుకువెళ్ళి మందలించసాగాడు: “ప్రభూ! దేవుడు దీనిని(సిలువ మరణం) తప్పించాలి! నీకిలా ఎప్పటికీ జరగకూడదు” అన్నాడు.(మత్తయి 16:22) సాతాను చేత మోసపోతున్నామని గుర్తించనంతగా, సాతాను మోసగిస్తాడు. ప్రభువు మరియు అపొస్తలులు సంఘము గూర్చి కూడా హెచ్చరించారు. పౌలు-"నేను వెళ్లిపోయిన తరువాత (గొర్రె చర్మం కప్పుకున్న)క్రూరమైన తోడేళ్లు మీలో ప్ర...

25 April 2017

Gospel(సువార్త): ఆయన(యేసు క్రీస్తు) మన పాపాల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.(రోమా 4: 25) దేవుడు మన అపరాధములను మన మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనెను.(2కోరింథీ 5: 19) క్రీస్తు సిలువ మీద చిందిన రక్తంద్వారా సంధి చేసి..మనల్ని తనతో సమాధానపరచుకోవాలనేదే దేవుని ఇష్టం.(కొలస్సీ 1: 20) ఈ విశ్వాసము ద్వారా, దేవుని కనికరం వల్లే (దేవుని శిక్ష నుండి) రక్షింపబడగలము. ఇది మన వల్ల కలిగింది కాదు. దేవుడు కేవలం ఉచితంగా ఇచ్చినదే(ఎఫెసీ 2: 8) ఈ సువార్త, i) నమ్ము ప్రతివానికి...రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి.(రోమా 1: 16) ii) నశించిపోతున్న వారికి ఇది వెఱ్ఱితనముగా అనిపిస్తుంది కానీ రక్షణ పొందుతున్న వారికి అది దేవుని శక్తి.(1కోరింథీ 1:18) iii) సువార్త లోకమంతటా వ్యాపిస్తూ, ఫలిస్తూ ఉంది.(కొలస్సీ 1: 6) iv) సువార్త మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతో కూడియున్నది(1థెస్స1:5)

27 April 2017

దేవదూత మానోహ భార్యతో -"ఇదుగో నీవు గొడ్రాలివి. నీవు గర్భవతివవుతావు. కొడుకును కంటావు. నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షమద్యం గానీ, మరే మద్యం గానీ త్రాగకు, అపవిత్రమైనది ఏదీ తినకు.ఎందుకంటే ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచీ దేవునికి ప్రతిష్ఠితుడుగా ఉంటాడు. శత్రువుల నుండి విడిపించే రక్షకుడవుతాడు" (న్యాయా13:3-6) దేవుని సువార్తను నమ్మి, పాపముల విషయమై పశ్చాత్తాపం(మరుమనస్సు) పొందిన ప్రతివారిలో మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు యెక్క ఆత్మ నివసిస్తాడు. రక్షకుడున్ని(ప్రతిష్ఠితుణ్ణి) మోస్తున్ న మానోహ భార్య పవిత్రంగా ఉండాలని దేవుని ఆజ్ఞ పొందితే, అత్యంత పరిశుద్దుడైన క్రీస్తుఆత్మను హృదయంలో పొందినవారు మరి ఎంతో శ్రేష్ఠమైన జీవితాన్ని జీవించ వలసి ఉంటుంది కదా? -- పరిశుద్ధగ్రంధం ఇలా చెప్తుంది. "మీ శరీరం దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీకు తెలియదా? మీరు మీ సొత్తు కారు. విలువపెట్టి (క్రీస్తు రక్తంతో) కొనబడినవారు గనుక మీ శరీరంతో దేవుని ఘనపరచండి" (1కోరింథీ 6: 19,20) "ఎవరైనా దేవుని ఆలయమును పాడుచేస్తే దేవుడు వానిని పాడుచేస్తాడు. దేవుని ఆలయము...

28 April 2017

ఒక పొద మధ్యలో మంటల్లో యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద మండుతూ ఉంది గానీ అది కాలిపోలేదు.(నిర్గమ 3: 2,3) అగ్ని లక్షణం దేనినైనా దహిస్తే గాని అది మండదు. దేవుడు ఈ లోక సహజ నియమాలకు అతీతుడు. దేవుడు తన పిల్లల్ని కూడా అసాధారణమైన పరిస్థితులగుండా నడిపిస్తూ ఆయన శక్తిని కనపరచుకుంటాడు. ఏ నరుడు తన(జ్ఞానం) లో నుండి దైవశక్తిని అంచనా వేయకూడదు. ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి. ఆయనను ఆయనే కనపర్చుకుంటే తప్ప ఎవ్వరు ఆయనను తెలుసుకోలేరు. ఆ ఆసక్తిని కలిగిన ప్రతి ఒక్కరూ దీనిని పొందుతారు. బైబిల ్ తెలియటం వేరు, దేవుణ్ణి (వ్యక్తిగతంగా) తెలుసుకోవడం వేరు. దీనినే దేవుని ప్రత్యక్షత అని అంటారు. అంటే దేవున్ని తమ సొంత అనుభవాలతో తెలుసుకోవటం. మోషే తరువాత రోజుల్లో దేవుడు సర్వోన్నతుడని దేవుని శక్తిని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుకున్నాడు. దేవుడు మోషేతో -“నీవెందుకు నాకు మొరపెట్టుకొంటున్నావు?ముందుకు సాగిపోండి" అన్నాడు..మోషే సముద్రంవైపు చెయ్యి చాచాడు; దేవుడు సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి దాన్ని ఆరిన నేలగా చేశాడు. నేడు మన జీవితాల్లో కూడా దేవున్ని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుకోవాలి. ఇలా లేకుండా ఉం...