దేవుడు కయీనును, అతని అర్పణను లక్ష్యపెట్టలేదు... కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. (ఆది 4: 5,8)
అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, యేసును ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. (మత్తయి 12:14)
పెద్ద కుమారుడు పొలమునుండి వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని.. కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను.(లూకా 15:25,28)
మత సంబంధమైన భక్తిహీనులు(దేవునికి అవిధేయులు), దేవుణ్ని నమ్మని వారి కంటే అపాయకారమైనవారు. అట్టివారు తమ దుస్థితిని గుర్తించటం చాలా కష్టం. ఎందుకంటే సహజంగా వారి బాహ్యజీవితం ఎంతో శుభ్రంగా ఉంటుంది, కాబట్టి అంతరంగాన్ని లక్ష్యపెట్టరు.దేవుని తో ఉంటారు కానీ దేవుని లక్షణాలు కలిగి జీవించరు. ఇలాంటి భక్తి దేవుని ఉగ్రతకు(నరకానికి) దారితీస్తుంది.
"దేవుడు నీవు ఏమి చేస్తున్నావు కంటే ఎందుకు చేస్తున్నావో(నీ హృదయాన్ని)లక్ష్యపెడతాడు. నీ ఉద్దేశాన్ని గమనిస్తాడు".
Comments
Post a Comment