యేసు తన శిష్యులతో-"నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు" (యోహాను 15:5)
దేవునిలో నిలిచిఉండటం అంటే దేవుణ్ణి పోలి నడుచుకోవడమే. ఆయన సహవాసంలో స్వంత స్వభావాన్ని వదిలివేసి, దేవుని స్వభావాన్ని పొందటం .
దేవునిలో నిలిచిఉండటం అంటే దేవుణ్ణి పోలి నడుచుకోవడమే. ఆయన సహవాసంలో స్వంత స్వభావాన్ని వదిలివేసి, దేవుని స్వభావాన్ని పొందటం .
పాత జీవితంలో, దేవునితో సంబంధం లేకుండా కొన్ని మంచి పనుల లేదా మంచి అలవాట్లు మనం కలిగి ఉంటాం. పెరిగిన వాతావరణం, నేర్చుకున్న పద్దతులు/అలవాట్లను బట్టి అవి కొందరిలో ఎక్కువగా, కొందరిలో చాలా తక్కువగా ఉంటాయి. మోసపోవద్దు!! అవి ఉన్నపటికీ సహితం మనం దేవుని ఉగ్రత క్రిందే ఉన్నామని గుర్తించాలి. కాబట్టి అవి పైకి మంచివిగా అందరికి కన్పించొచ్చు,కానీ దేవుడు లేని పనులు(ఉద్దేశాలు చెడ్డవి) దేవుని దృష్టిలో అసహ్యమైనవి.
దేవుని వలన, దేవుని బట్టి(అంతరంగం నుండి)ఇప్పుడు అన్ని కొత్తవిగా మార్చబడాలి. అంటే పాత వ్యక్తి సిలువలో క్రీస్తుతో పాటు సిలువవేయబడాలి .
దేవుని వల్ల మనం పొందిన ప్రవర్తన దేవునికి దగ్గరౌతుంటే ఆ స్వభావం కలిగి ఉంటాం. దూరమౌతూవుంటే, ఆ స్వభావం కోల్పోతూవుంటాం. పాత స్వభావంలోని మనుషులచే కొనియాడబడిన మన ప్రవర్తనే ఐతే, దేవుని నుండి దూరమైనా అది నిలిచి ఉంటుంది.
కొందరు దేవుని నుండి తప్పిపోతున్న వారిలో పాత స్వభావాన్ని బట్టి చక్కగా జీవించేస్తుంటారు. అది దేవుని(క్రీస్తును పోలిన) స్వభావమేనని భ్రమపడతారు. ఎందుకంటే మనుషులతో ఎలాంటి సమస్యలు ఉండవు(దేవునితో తప్ప), స్వనీతితో బ్రతికేస్తుంటారు. విశ్వాసభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. సహజంగా పాత కాలంలో అందరి చేత మంచి వారిగా పిలవబడే వారిలో ఈ ప్రమాదం పొంచి ఉంటుంది.
పాతకాలంలో బాహ్యజీవితం చెడిపోయిన వారు, దేవునిలో తప్పితే బయటికి కనబడుతుంది. కాబట్టి వారు దేవునిలో లేరని ఇట్టే గ్రహించొచ్చు.అట్టి వారు తిరిగి సరిచేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి, ఆయన ఎదుట తమను తాము పరీక్షించుకొనువారు ధన్యులు. మనుషుల ఎదుట కాకుండా దేవుని ఎదుట యదార్థవంతులు ధన్యులు.
Comments
Post a Comment