జక్కయ్య పన్నులు సేకరించేవాళ్ళలో పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా. అన్యాయంగా ఎంతో డబ్బు సంపాదించాడు.కాబట్టి ఆ ఊరివాళ్లు అతన్ని పాపాత్ముని గా పిలిచేవారు. అప్పుడు అర్థమయ్యింది డబ్బులో నిజమైన సంతోషంలేదని. నిజమైన సంతోషం దేవుని దగ్గరే ఉందని నమ్మి యేసుని కలుసుకోవాలనుకొన్నాడు.
జనాలు గుంపుగూడి ఉండటం వల్ల మేడిచెట్టెక్కి యేసుని చూడాలనుకున్నాడు. ఆశ్చర్యం!! యేసే అతణ్ణి వెతుకొంటూ వచ్చాడు.(వాళ్ళ దృష్టికి)మంచివాళ్లమైన తమ దగ్గరకు కాకుండా అతని దగ్గరకిి వెళ్లినందుకు ఊరివారూ ఆశ్చర్యపడ్డారు.
ప్రేమ కోసం పరితపిస్తున్న జక్కయ్య, దేవుని ప్రేమకు అబ్బురపడ్డాడు. వెంటనే తన తప్పుడు జీవితాన్ని వదిలేస్తానని క్రీస్తుకు మాట ఇచ్చాడు.
దేవుణ్ణి ప్రేమిచడానికి నీతిమంతుడై ఉండక్కరలేదు, కానీ "సత్యాన్ని ప్రేమిస్తే" చాలు. అదే ఆయన దగ్గరకు నిన్ను చేరుస్తుంది.ఆయన నిన్ను చేరుకోవటానికి ఆ ఒక్క లక్షణం చాలు.
మన పాపపు స్థితిని యదార్ధంగా దేవుని దగ్గర ఒప్పుకొని, ఆయన సహయం కోరేవారికి దేవుడు ఎల్లపుడూ సహాయకుడు. అన్నిటి కంటే, అందరికంటే దేవుడే ఉత్తముడని మనఃపూర్వకముగా నమ్మాలి. దేవునికే ఉన్నత స్థానం ఇచ్చి, మనస్సు మార్చుకొని, ఆయన వైపు తిరగాలి(నీ హృదయంలో క్రీస్తును దేవునిగా, రక్షకునిగా చేర్చుకో).అప్పుడు నీవు దేవునిలో క్రొత్త వ్యక్తిగా అవుతావు.
Comments
Post a Comment