"సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు"(2కోరింథీ 11: 14)
మనం ఊహిస్తున్నట్లుగా సాతాను క్రూరమైన ఆకారంతో, స్వరంతో రాడు కాని, చాలా సార్లు, మనకు చాలా దగ్గరగా ఉండే వారి ద్వారా, తీయ్యనైనా స్వరంతో మనల్ని ప్రేరేపిస్తాడు.
ఆమె(హవ్వ) దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును(ఆదాముకు) ఇచ్చెను, అతడుకూడ తినెను(ఆది 3: 6)
శారయి అబ్రాముతో “ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు. మీరు నా దాసి దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ ఆమె మూలంగా నాకు పిల్లలు కలుగుతారు” అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.(ఆది 16: 2)
యోబు భార్య అతనితో ఇలా అంది-“నీవింకా నీ యథార్థతను విడవవు గదూ! దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో"(యోబు 2: 9)
పేతురు యేసును ఒక్కన్నే తీసుకువెళ్ళి మందలించసాగాడు: “ప్రభూ! దేవుడు దీనిని(సిలువ మరణం) తప్పించాలి! నీకిలా ఎప్పటికీ జరగకూడదు” అన్నాడు.(మత్తయి 16:22)
సాతాను చేత మోసపోతున్నామని గుర్తించనంతగా, సాతాను మోసగిస్తాడు.
ప్రభువు మరియు అపొస్తలులు సంఘము గూర్చి కూడా హెచ్చరించారు.
పౌలు-"నేను వెళ్లిపోయిన తరువాత (గొర్రె చర్మం కప్పుకున్న)క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును...శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు"(అపో 20:29,30)
యోహాను- "సోదరులారా, చాలామంది అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరారు గనుక ప్రతి ఆత్మనూ నమ్మకండి గానీ ఆ ఆత్మలు దేవునికి చెందేవో కావో పరీక్షించి చూడండి"(1యోహాను 4:1)
Comments
Post a Comment