"మీలో ప్రతి ఒక్కరూ సొంత విషయాలు చూచుకోవడం మాత్రమే కాకుండా, ఇతరుల విషయాలు కూడా చూడండి.” (ఫిలిప్పీ 2:4)
యేసుక్రీస్తు శరీరధారియై ఉన్న రోజుల్లో గొప్ప జనసమూహం ఆయన వెంబడి ఎప్పుడూ ఉండేది. ఆయన రోగాలు నయ్యం చేస్తూ, అద్భుతకార్యాలు చేస్తూ, దెయ్యాలను వదలగొడుతూ, దేవుని వాక్యం భోదిస్తూ..ఇలా అసాధారణనమైన శక్తితో అందరికి ఎన్నొ మేలులు చేశాడు. కొన్ని సార్లు జనం గుమ్మికూడడం చేత ఆయన భోజనం చేయడానికి కూడా వీలులేకపోయ్యేది.
కాని, ఆయన చనిపోయి, సమాధి చేసే సమయానికి అతి కొద్దీ మంది మాత్రమే అక్కడ ఉన్నారు.
కాని, ఆయన చనిపోయి, సమాధి చేసే సమయానికి అతి కొద్దీ మంది మాత్రమే అక్కడ ఉన్నారు.
ఆయన నుండి మేలులు పొందుకున్న చాలా మంది, మేలులు మరచి వదిలేశారు.ఈ సంగతులు ముందుగానే ఆయనకు తెల్సినా కూడా, కృతజ్ఞత లేని వారికి కూడా అలిసిపోక మేలుచేశాడు. ఇది దైవ స్వభావం.
పరలోకలోక తండ్రి పిల్లలంగా మనం కూడా ఈ విధంగానే చెయ్యాలి. ఆయన మంచివారికి, చెడ్డవారికి కూడా, సూర్యోదయం కలిగిస్తాడు కదా! న్యాయవంతులకు, అన్యాయస్థులకు కూడా వాన కురిపిస్తాడు కదా!
మనకు చెడు చేసిన వారికి, మన పట్ల కృతజ్ఞతలేని వారికి, కూడా మేలు చేసే విషయంలో అలసిపోక క్రీస్తు వలె దేవునికి ఇష్టమైన పిల్లలంగా నడుచుకుందాం!
Comments
Post a Comment