నోవహు రోజులు ఎలా ఉన్నాయో క్రీస్తు రాకడ సమయంలో కూడా అలాగే ఉంటాయి.
నోవహు రోజుల్లో జల ప్రళయం రాకముందు, ప్రజలు తింటూ త్రాగుతూ పెళ్ళిళ్ళకు ఇచ్చి పుచ్చుకొంటూ వచ్చారు.నోవహు ఓడలోకి వెళ్ళేరోజు వరకూ అలా జరుగుతూ ఉంది.
నోవహు ఓడ తయారు చేస్తూవున్నపుడు...దేవుడు, ఆయన మాట వినకుండా జీవిస్తున్న (అవిధేయులైన)వారి విషయంలో ఓపికతో కనిపెట్టి ఆత్మరూపిగానే వారి మధ్యకి వెళ్లి ప్రకటించాడు. కానీ వారు దేవుని మాట లెక్కచెయ్యలేదు.
నోవహు ఓడ తయారు చేస్తూవున్నపుడు...దేవుడు, ఆయన మాట వినకుండా జీవిస్తున్న (అవిధేయులైన)వారి విషయంలో ఓపికతో కనిపెట్టి ఆత్మరూపిగానే వారి మధ్యకి వెళ్లి ప్రకటించాడు. కానీ వారు దేవుని మాట లెక్కచెయ్యలేదు.
దేవుడు-"నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు" అన్నాడు.
అప్పుడు జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసింది. ఆ ఓడలో దేవుణ్ణి నమ్మి ప్రవేశించిన ఎనిమిది మంది మాత్రమే రక్షణ పొందారు.
అప్పుడు జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసింది. ఆ ఓడలో దేవుణ్ణి నమ్మి ప్రవేశించిన ఎనిమిది మంది మాత్రమే రక్షణ పొందారు.
ఈ చివరి దినాలు కూడా అలానే ఉంటాయని యేసు చెప్పాడు. దేవుని సువార్తను విశ్వాసముంచక, క్రీస్తు రక్తంలో పాపాలను కడుగుకొనక, నిన్ను రక్షించగల ఏకైక మార్గమైన క్రీస్తు అనే ఓడలో ప్రవేశించకపోతే(విశ్వసించకపోతే), దేవుని ప్రేమను కనికరాన్ని నిర్లక్యం చేస్తే, ఆ తరం వారిలాగే నశించిపోతాము.
దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు..మారుమనస్సు పొందు..ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు...
Comments
Post a Comment