యేసు ఒక రొట్టెను తీసుకొని, "ఆశీర్వదించి", దానిని "విరిచి" శిష్యులకు ఇచ్చాడు. “దీనిని తీసుకొని తినండి. ఇది(మీ కొరకు విరువబడిన) నా శరీరం” అన్నాడు.(మత్తయి 26:26)
లూకా 9:16, 24:30, యోహాను 21:13.
లూకా 9:16, 24:30, యోహాను 21:13.
ఆశీర్వాదకరమైన వ్యక్తులు దేవునిచే తప్పకుండా విరవబడతారు (శ్రమలపాలవుతారు). నోవహు, అబ్రాహాము, మోషే , యోసేపు, దావీదు, యోబు, పేతురు, పౌలు.. ఇలా దైవజనులందరూ దేవునిచే విరగ్గొట్టబడినవారే. దేవుడు వాడుకున్న ప్రతి ఒక్క నాయకుడూ, అనేక శ్రమల ద్వారా, పరీక్షల గుండా వెళ్లిన తర్వాతనే ఆశీర్వాదకరమైనవారయ్యారు .
దేవుడు విరువబోయ్యే(మలిచే) ఆ వ్యక్తిని ముందు ఒంటరిని చేస్తాడు. ఆ ఒంటరితనంలో (దేవునిపై ఆధారపడటం & దైవశక్తిని తెలుసుకోవటంలాంటి) శ్రేష్ఠమైన పాఠాలు నేర్పిస్తాడు(దేవుడు సిద్ధం చేస్తాడు). ఆ తరువాత అతను గొప్ప బలమైన నాయకుడుగా ఆవిర్భవిస్తాడు.
దైవికమైన నాయకుడు చాలాసార్లు ఒంటరితనంలొనే ఉంటాడు..ఎందుకంటే లోకం అతనిని ద్వేషిస్తుంది,(లోకంలో కలిసిపోయిన) నామకార్థ క్రైస్తవులు మరి ఎక్కువగా ద్వేషిస్తారు. కాని ఆ ఒంటరితనంలో దేవుని శక్తిని, ఆయన సన్నిధిని అత్యంత దగ్గరగా అనుభవిస్తాము.చీకటిలో వెలుగు జ్యోతుల్లా దేవునికోసం వెలుగుతూనే ఉంటారు.
ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమల్లో దాగి ఉన్న ఆశీర్వాదం నీకు తెలియాలంటే కొంత సమయం వేచివుండాలి.
Comments
Post a Comment