ఐగుప్తు బానిసత్వం నుండి దేవుని చేత విమోచించబడిన ఇశ్రాయేలీయులు గొప్ప అద్భుత కార్యలను చూశారు(అలాంటి కార్యాలు వారికీ ముందు కాని, తరువాత తరాలు కాని చూడలేదు). కాని వారిలో చాలా మంది నశించిపోయారు. (హెబ్రీ 3:7-19)
వేశ్యయైన రాహాబు దేవుని కార్యాల గురించి మాత్రమే విన్నది కానీ , విశ్వాసముంచి తన ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్దపడింది.
వేశ్యయైన రాహాబు దేవుని కార్యాల గురించి మాత్రమే విన్నది కానీ , విశ్వాసముంచి తన ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్దపడింది.
క్రీస్తు శిష్యుడు, దేవుని కార్యాలు దగ్గర నుండి చూసినవాడు, అనేక క్రీస్తు సందేశాలు విన్న ఇస్కరియుతు యూదా, తన ఆత్మను కోల్పోయాడు .
క్రీస్తును కలుసుకోని, ఆయన సందేశం ఒక్కటి కూడా వినని అపొస్తలుడైన పౌలు, తన జీవితాంతం క్రీస్తును నమ్మకముగా సేవించాడు.(గలతీ 1:18,19)
క్రీస్తును కలుసుకోని, ఆయన సందేశం ఒక్కటి కూడా వినని అపొస్తలుడైన పౌలు, తన జీవితాంతం క్రీస్తును నమ్మకముగా సేవించాడు.(గలతీ 1:18,19)
ఇలాంటి ఉదాహరణాలు ఎన్నో..(లోతు భార్య, ఆకాను, బిలాము, గేహజీ, శాస్రులు పరిసయ్యులు, అననీయ సప్పీరాలు, దేమా). దేవునికి అత్యంత సన్నిహితులైన వారి మధ్య శ్రేష్టమైన దేవుని వాక్యం విని(సరైన సిద్ధాంతాలను కలిగి, దాని లోబడక) నశించిపోయ్యారు .
శ్రేష్టమైన సిద్ధాంతాలు కలిగి ఉంటే దేవుడు సంతోషించడు. కాని ఆయనకు హత్తుకొని జీవించినవారే ఆశీర్వదించబడినవారు.అలాంటివారికి సంపూర్ణ వాక్య గ్రహింపు లేకున్నా సరే(ఒక ఉదాహరణ శిలువపైన దొంగ).
సరైన సిద్ధాంతాలను చూసి ఉప్పొంగక, దాని(శక్తి)కి తగిన జీవితాలతో దేవుణ్ణి మహిమపరుద్దాం.
Comments
Post a Comment