నిజదీనత్వం (A True Humbleness):
దీనత్వం(తగ్గించుకోవటం) అంటే నేను చెడ్డవాడ్ని, దుష్టుడ్ని, పనికిమాలినవాడ్ని అని చెప్పటమా? లేదా మౌనంగా మాట్లాడకుండా ఉంటూ, అన్నిటికి తలలూపుతూ ఉండటమా? కాదు. ఇలాంటిది అబద్దదీనత్వం.
"క్రీస్తు దేవునితో సమానముగా ఉన్నా, ఆయనా స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు. ఆయన అంతా వదులుకొన్నాడు. మానవరూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు. అంతేకాదు, సిలువ మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి తన్నుతాను తగ్గించుకొన్నాడు"(ఫిలిప్పి 2:5-8)
యేసు సిలువకు అప్పగించుకోక ముందు పేతురుతో-"నేను అడిగిన వెంటనే నా తండ్రి పన్నెండు దళాలకంటే ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు"(మత్తయి 26:53)
మనకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నా, చేయ్యగల సామర్థ్యం ఉన్నా, దేవుని వాక్యన్ని బట్టి (చిత్తాన్ని బట్టి మనుషులు పెట్టే నిందలను, అవమానాలను లెక్కచేయకుండా)బలహీనుడిగా, నిస్సహయునిగా, ఒంటరిగా క్రీస్తువలె ఉండటానికి మనల్ని మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవటం.
ప్రవక్త యేసును గూర్చి-"ఇదుగో, మీ రాజు సాత్వికుడై మీ దగ్గరికి గాడిదపిల్లను ఎక్కివస్తూ ఉన్నాడు!"(మత్తయి 21:5)
ఆ వెంటనే దీనపరుడైన క్రీస్తు, ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బులు మారకం వ్యాపారుల బల్లలూ, గువ్వల వర్తకుల పీటలూ పడద్రోశాడు.
వేషదారులను తీవ్రంగా గద్దిస్తూనే బాప్తిస్మ|| యోహను దీనుడుగా ఉన్నాడు.

దీనత్వం మనసుకి (దేవునికి, మన హృదయానికి) సంబందించిన విషయం. హృదయంలో దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని ఘనపరచే విషయం.
ఇలా ఉన్నపుడు కొన్నిసార్లు మనుషుల అంచనాలను అందుకోలేకపోవొచ్చు. ఏం పర్వాలేదు!
ఇలా ఉన్నపుడు కొన్నిసార్లు మనుషుల అంచనాలను అందుకోలేకపోవొచ్చు. ఏం పర్వాలేదు!
Comments
Post a Comment