Skip to main content

Posts

Showing posts from July 21, 2017

21 July 2017

 ఎలీషా ప్రవక్త మరణించగా, ప్రజలు అతనిని సమాధిలో ఉంచారు. ఒక సంవత్సరమైన తరువాత మోయాబీయుల సైన్యము ఇశ్రాయేలు దేశము మీదికి వచ్చినప్పుడు..కొంతమంది ఒక శవాన్ని పాతిపెడుతూ సైన్యమునికి భయపడి, ఆ శవాన్ని ఎలీషా యొక్క సమాధిలో ఉంచారు. ఎలీషా ఎముకలను ఆ చనిపోయిన వ్యక్తి తాకగానే, ఆ వ్యక్తి సజీవుడయ్యాడు(2రాజులు 13: 20,21)   ❇ దేవుడు ఎలీషా ద్వారా చాలా అద్భుతాలు జరిగించాడు.కాని ఎలీషా రోగగ్రస్తుడై చనిపోయ్యాడు. ఎలీషా రోగం వల్ల చనిపోయ్యేట్లు దేవుడే అనుమతించాడు. దేవుడు ఆయనకు నమ్మకమైన వారి జీవితంలో పంపే  భాధలన్ని "శిక్షలు" కావు. చాలా సార్లు నమ్మకత్వానికి పరీక్షలుగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎలీషా గ్రహించాడు, కనుకనే దేవుని పట్ల విముఖత చూపలేదు. పైగా ఆయన చిత్తాన్ని గౌరవించాడు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం కోసం దేవుడు ఎలీషా ఎముకల్ని సైతం వాడుకోనడం ద్వారా, ఎలీషా తనకు నమ్మకమైన సేవకుడని దేవుడు ఆమోదించాడు. ౼ సంతానంలేని అబ్రాహాము, రాజైన అబీమెలేకు ఇంటివారి కొరకు ప్రార్ధించగా, దేవుడు తిరిగి గర్భ ఫలాన్ని ఇచ్చాడు.(ఆది 20:17,18) ౼ అనేక శ్రమల పాలైన యోబు ప్రార్ధించగా, దేవుడు అతని స్నేహితులను శిక్షిం...