Skip to main content

Posts

Showing posts from January 3, 2018

03Jan2018

❇  ప్రవక్తయైన ఎలీషా మళ్ళీ గిల్గాలుకు వెళ్లాడు. అప్పుడు దేశంలో కరవు ఉంది. ప్రవక్తల గుంపు ఎలీషా ముందు కూర్చుని ఉన్నప్పుడు అతడు తన పరిచారకుడితో౼“పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ఈ ప్రవక్తల గుంపుకు వంటకం చెయ్యి” అన్నాడు. వారిలో ఒకడు కూరాకులను ఏరుకోవడానికి పొలాలకు వెళ్ళాడు. పిచ్చి(చేదు) ద్రాక్ష తీగె కనిపించగా ఆ ఆకులు ఎలాంటివో తెలియక, దాని ఆకులను అతడి ఒడినిండా సేకరించి, వచ్చి వంటకం వండుతున్న కుండలో తరిగి పోశాడు. ఆ వంటకం తినడానికి అక్కడివారికి వడ్డించారు. వారు తింటూ ఉంటే “దైవజనుడా! కుండ లో విషం ఉన్నది”అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు. ఎలీషా౼“పిండి కొంచెం తెండి!” అన్నాడు. అతడా పిండి కుండలో వేసి౼“వంటకం వడ్డించు. వారు తినవచ్చు” అన్నాడు. ఆ తరువాత కుండలో హానికరమైనది ఏదీ వారికి కనబడలేదు. (2రాజులు 4:38-41)  ❇ ■ ఆ చెట్టు గుణమేంటో తెలియక, చేదు ఆకులను మంచి కూర ఆకులుగా భావించి వంట వండారు. వారు తినేంత వరకూ..దాని చేదును గుర్తించలేక పోయ్యారు. అది పొరపాటున జరిగిన పని! పొరపాట్లు అనేవి నిజం(లేక సత్యం) తెలియక, సరైనదేనని యెంచి చేసే పనులు.(మనందరి జీవితాల్లో ఇటువంటి సంఘటనలు అనుభవాలుగ...