Skip to main content

Posts

Showing posts from April 25, 2018

25Apr2018

✴️ అబ్రాముకు అతని భార్యయైన శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఐగుప్తు దేశానికి చెందిన హాగరు అను ఒక దాసి ఉంది. శారయి అబ్రాముతో౼ "ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో" అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.(ఆది 16:1,2) ✴️ ■ రాహేలు, లేయాలు కూడా సరిగ్గా ఇలాగే యకోబుకు సలహా ఇచ్చారు(ఆది 30:3,9). కానీ దేవుడు వారిని తప్పు పట్టినట్లుగా చూడము. వారి దాసీలకు పుట్టిన పిల్లలను కూడా తక్కిన వారితో సమాన గోత్రాలుగా దేవుడు చేశాడు. ఎందుకంటే అబ్రాము విషయంలో పుట్టబోవు సంతానం గూర్చి స్పష్టమైన దేవుడు వాగ్ధానం ఉంది. అబ్రాము విశ్వాసంతో కనిపెట్టి ఆ వాగ్ధానం పొందుకోవాలి. దేవుని వాక్కు ఎవరికి స్పష్టంగా తెలియజేయబడుతుందో (ప్రత్యక్షత) వారి నుండి దేవుడు ఎక్కువ విధేయతను ఎదురుచూస్తాడు. దేవుడు అబ్రాముతో సంతానం గూర్చి వాగ్దానం(నిబంధన) చేశాడు. సుమారు 10 సం|| ల తర్వాత కూడా పిల్లలు కలుగనందుకు అబ్రాము, అతని భార్యయైన శారయిల విశ్వాసం సన్నగిల్లి పోయింది(ఆది 15:2,16,2). శారయి తనకు ఇక పిల్లలు పుట్టరని దృఢ నిర్ణయానికి వచ్చినదై, అబ్రాముకు పై...

17Apr2018

✴️ యేసు ఆ మాటలు చెప్పి ముగించిన తరువాత ప్రజలు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వారి ధర్మశాస్త్ర పండితుల్లాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన వారికి ఉపదేశించాడు. (మత్తయి 7:28,29) ✴️ ■ క్రీస్తు బోధ ఆ ప్రజలు విన్న మిగితా భోధకుల కంటే చాలా భిన్నమైనది. శాస్త్రులు పరిసయ్యులు బోధ౼వినువారి తలలను మాత్రమే నింపేవి. ఈ లోకంలో ఎలాగైతే లోకజ్ఞానం ఉందో, అలాగే ఆధ్యాత్మికంగా కూడా జ్ఞానం ఉంది. అది మనల్ని ఆకట్టుకునే (సత్యమైన) జ్ఞానమై, తప్పుడు భోధకు వెళ్ళకుండా నిన్ను అప్రమత్తం చేసేదిగా ఉండొచ్చు కానీ దేవుని జీవపు ఊటల దగ్గరకు నిన్ను నడుప లేనిదిగా ఉండొచ్చు. అంటే ఈ జ్ఞానం బయట నుండి వచ్చే తప్పుడు భోధల నుండి జాగ్రత్త చేస్తూ, అంతరంగం నుండి 'వ్యక్తిగతంగా దేవున్ని తెలుసుకోవడం' అనే విలువైన జీవపు మాటలను (విస్మరించే) నిర్లక్ష్యం చేసేదిగా ఉండొచ్చు. విత్తనం విత్తనంగా ఉన్నట్లైతే జీవం గల మొక్కను పుట్టించలేదు. అనుకూలమైన వాతావరణంలోనే (నేల, నీరు మొ||) అది జీవం పోసుకుంటుంది. సరైన వాక్యము-దాని వివరణ కూడా 'విత్తనమే' గాని జీవం కాదు. సరైన సిద్ధాంత జ్ఞానం కొన్నిసార్లు ఇతరులను తమ కంటే తక్కువైన వారిగా చిన్న...