Skip to main content

17Apr2018

✴️ యేసు ఆ మాటలు చెప్పి ముగించిన తరువాత ప్రజలు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వారి ధర్మశాస్త్ర పండితుల్లాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన వారికి ఉపదేశించాడు. (మత్తయి 7:28,29) ✴️

■ క్రీస్తు బోధ ఆ ప్రజలు విన్న మిగితా భోధకుల కంటే చాలా భిన్నమైనది. శాస్త్రులు పరిసయ్యులు బోధ౼వినువారి తలలను మాత్రమే నింపేవి. ఈ లోకంలో ఎలాగైతే లోకజ్ఞానం ఉందో, అలాగే ఆధ్యాత్మికంగా కూడా జ్ఞానం ఉంది. అది మనల్ని ఆకట్టుకునే (సత్యమైన) జ్ఞానమై, తప్పుడు భోధకు వెళ్ళకుండా నిన్ను అప్రమత్తం చేసేదిగా ఉండొచ్చు కానీ దేవుని జీవపు ఊటల దగ్గరకు నిన్ను నడుప లేనిదిగా ఉండొచ్చు. అంటే ఈ జ్ఞానం బయట నుండి వచ్చే తప్పుడు భోధల నుండి జాగ్రత్త చేస్తూ, అంతరంగం నుండి 'వ్యక్తిగతంగా దేవున్ని తెలుసుకోవడం' అనే విలువైన జీవపు మాటలను (విస్మరించే) నిర్లక్ష్యం చేసేదిగా ఉండొచ్చు. విత్తనం విత్తనంగా ఉన్నట్లైతే జీవం గల మొక్కను పుట్టించలేదు. అనుకూలమైన వాతావరణంలోనే (నేల, నీరు మొ||) అది జీవం పోసుకుంటుంది. సరైన వాక్యము-దాని వివరణ కూడా 'విత్తనమే' గాని జీవం కాదు. సరైన సిద్ధాంత జ్ఞానం కొన్నిసార్లు ఇతరులను తమ కంటే తక్కువైన వారిగా చిన్న చూపుకు నడుపుతుంది. శాస్త్రులు, పరిసయ్యులు ప్రకటించిన వాక్యం ఇటువంటిదే. అది అబద్ద భోధకాదు..సరైనదే (మత్త 23:3). కానీ అందులో ఎటువంటి జీవం లేదు. కనుకనే జీవాధిపతిని తిరస్కరించి చంపివేశారు.

■ ఐతే జీవానికి నడిపించే జ్ఞానం మరొకటి ఉంది. అది దేవుని వెలుగులో మన స్థితిని చూపించి, సత్యానికి విధేయత చూపమని చెప్పే జీవమైన జ్ఞానం. అది మన ఆత్మలను వెలిగింస్తుంది. అటువంటి బోధ విన్న తర్వాత దేవుడు నీతో మాట్లాడ్డాడని గ్రహిస్తావే గాని, భోధకుని మాటలు/జ్ఞానం చేత ఆకర్షించబడి అతణ్ని మహిమపర్చవు. అవి వాక్చాతుర్యంతో ఆకట్టుకునే మాటలుగా ఉండవు లేదా విమర్శనాత్మతో కూడిన నిరీక్షణ రహితమైన మాటలు కూడా కావు గాని మన ఆత్మలను విలిగించి, దేవునికి సమీపస్థులుగా చేస్తూ, చెయ్యి అందించి సహాయపడే మాటలుగా ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ పనిని మనలో కొనసాగించగలడు. ఆ పని ఎవరిలో కొనసాగుతుందో అట్టి వారే (దేవుని జీవం తమలో గల వ్యక్తులే) ఆ జీవాన్ని ప్రకటించగలరు. ఇదే జీవమైవున్న క్రీస్తులో నిలిచివుండటం అంటే! 'మానవ చమత్కారమైన తెలివితేటలతో కాక, దేవుని ఆత్మ ద్వారా విరిచి ఇవ్వబడిన వాక్యం' అనే దేవుని జీవం అప్పుడు నీలో ప్రవహిస్తుంది. ఆ వాక్యానికి లోబడటం ద్వారా దేవుని లక్షణాలు ఫలభరితంగా మనలో నుండి బయటకు వస్తాయి. ఐతే దేవుని ఆత్మతో నింపబడిన మాటలు కఠిన పర్చుకున్న వారికి ఆగ్రహాన్ని-తిరస్కారాన్ని కలిగించేవిగా ఉండగా, యాదార్ధవంతులకు సర్వసత్యంలోకి, జీవంలోకి నడిపిస్తాయి. క్రీస్తు తాను ఆచరించిన మాటలనే ప్రకటించాడు కనుకనే వాటిని అధికారంతో భోధించాడు.

■ మనకు వాక్యం ఎంత లోతుల్లో తెలుసో చూడక, తెలిసిన వాక్యానికి ఎంత విధేయత చూపుతున్నామో భేరీజు వేసుకోవాలి. అలా లేనప్పుడు మన కంటే వాక్య పరిజ్ఞానం తక్కువ కలిగి, దానికి సంపూర్ణంగా విధేయత చూపే వారి భక్తి మన కంటే గొప్పదిగా ఉంటుంది. తలలను మాత్రమే తాకుతూ, ఉప్పొంగ చేసే దైవజ్ఞానం విలువ దేవుని యెదుట శూన్యం అని గుర్తించుకోండి. అది దేవుని నుండి కలగలేదనటానికి అదే నిదర్శనం. దేవునిలో నుండి కలిగే జ్ఞానం దీనత్వాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే అది మన నుండి కలిగినది కాదు కాబట్టి. దైవజ్ఞానం దేవునిలో పసిపిల్లలకు(దీనులకు) దొరుకుతుంది. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు మరి ఎక్కువగా తిరస్కారానికి గురి అయినట్లుగా వాక్యం సెలవిస్తుంది.(ప్రముఖులుగా కనిపించే) ప్రతి భోధకుణ్ణి నమ్మొద్దు, వారి మాటలు జీవానికి (ప్రభువుకు దగ్గరగా) నడిపించేవో కావొ వివేచించండి. కొందరు భోధకులు వాక్యపు విలువలతో కాక, తమ పాత స్వభావాలను విడిచిపెట్టక, వాటితోనే ప్రభువు సేవించే వారిగా ఉన్నారు. విమర్శలకు, వాదనలకు, స్వంత జ్ఞానంతో పరిష్కరాలకు, వింత పోకడలకు, ధనార్జనకు, తమ సామ్రాజాలను స్థాపించు కొనుటకు ఆసక్తిపరులగా ఉంటారు. అలాంటి వారి నుండి దూరంగా వెళ్లిపోండి. అలాంటి వారిలో దేవుని జీవం ఎంతమాత్రం నివసించదు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...