Skip to main content

Posts

Showing posts with the label July-2017

28 July 2017

యేసు ఒక కథ చెప్పాడు. ❇  ఒక ధనవంతుడి భూమి విస్తారంగా పండింది. అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు. "నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను. నా కొట్లు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ దాచి నిల్వ చేస్తాను. అప్పుడు నా ప్రాణంతో "ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపోయే విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు అని చెప్తాను" అనుకున్నాడు. అయితే దేవుడు అతడితో "మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?" అని అతడితో అన్నాడు. దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు" ❇ ✔  ధనవంతుడు అక్రమంగా సంపాదించాడని చెప్పబడలేదు. సంవత్సర సంవత్సరానికి అతను ఎంతో కష్టపడి సంపాదించివుంటాడు. మెరుగైన పంట పండటానికి రాత్రింబవళ్లు శ్రమించివుంటాడు. అతని మూలంగా అనేకులకు (పంటవేసేవారికి, కోసే వారికి, కూలీలకు, కొట్లు కట్టేవారికి) పని దొరికుతావుంది. అలాంటప్పుడు అతని కష్టార్జీతం అతను తినటానికి యోగ్యుడే కదా? మరి దేవుడేందుకు అ...

27 July 2017

దేవుడు ఇశ్రాయేలీయులతో౼"ఇదిగో వినండి! నేను కానాను దేశాన్ని మీకు అప్పగించాను. మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధినం చేనుకోండి. మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ వారి తరువాత వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి!" (ద్వితియో  1:8) --కనాను దేశాన్ని అబ్రాహాముకు, అతని సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు(ఆది 13:12-17).ఇక కనాను వారి సొత్తు. ఇప్పుడు సుమారు 400 సం|| తర్వాత ఐగుప్తు భానిసత్వ సంకెళ్ళను తెంచుకుని ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమైన కనానుక ు ప్రయణమయ్యారు. పైన చెప్పిన మాటలు అప్పుడు దేవుడు వారితో పలికిన మాటలు.ఐతే కనానులో నివసిస్తున్న ప్రజలు బలవంతులు, గొప్ప దేహదారుడ్యం గల వారు(సంఖ్యా 13:28,31). --దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకొనే నిమిత్తం భానిసత్వపు సంకెళ్ళు తెంచబడ్డాయి. ఆ ప్రదేశాన్ని బలమైన శత్రువుచే ఆక్రమించబడివుంది.ఆయన వాగ్దానం నిలచి ఉంది. ఇక ఇప్పుడు మిగిలివుంది విశ్వాసంతో స్వాధీన పర్చుకోవటమే! ఇశ్రాయేలు ముందు ఉంచబడిన సవాలు౼'విశ్వాసం'. కానీ వారిలో చాలా మంది దేవుణ్ని నమ్మలేకపోయ్యారు. వారిలో నమ్మిన వారు మ...

26 July 2017

  దేవుని మాట ప్రకారం ఎలీషా నయమాను యొక్క కుష్ఠురోగాన్ని బాగుచేశాడు. కృతజ్ఞతతో నయమాను కానుకలను ఇవ్వగా, దైవజనుడైన ఎలీషా వాటిని తిరస్కరించాడు. ఎలీషా దగ్గర గేహజీ అనే శిష్యుడొకడు ఉన్నాడు. గేహజీ౼“గురువు గారు నయమాను తెచ్చిన వాటిని తీసుకోకుండా అతణ్ణి ఊరికే వెళ్ళనిచ్చాడు. యెహోవా జీవము తోడు, నేను అతడివెంట పరుగెత్తి అతడి నుంచి ఏదైనా తీసుకుంటాను" అనుకొని వెళ్ళి, నయమానుకు ఎలీషా తీసుకురమ్మానాడని అబద్ధమాడి, రెండు జతల విలువైన దుస్తులనూ, డెబ్భై కిలోగ్రాముల వెండి రెండు సంచుల నిండా తీసుకొని వచ్చి  దాచి, ఏమీ తెలియనట్లు ఎలీషా ముందుకు తిరిగి వచ్చాడు. ఎలీషా౼“గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?" గేహజీ౼“నీ దాసుడైన నేను ఎక్కడికీ వెళ్ళలేదు" ఎలీషా౼"నయమాను నిన్ను కలుసుకోవడానికి రథం దిగినప్పుడు, నా హృదయం నీతో వున్నది. వెండి, దుస్తులు, ఒలీవచెట్ల తోటలు, ద్రాక్షతోటలు, గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇప్పుడు నయమానుకు ఉన్న కుష్ఠు నీకూ, నీ సంతానానికీ సోకుతుంది" అన్నాడు. మంచులాగా తెల్లటి కుష్ఠు పుట్టి గేహజీ ఎలీషా ముందు నుంచి బయటికి వెళ్ళాడు .  ❇ -- నిజానికి దేవుడు గేహజీ ...

25 July 2017

  యేసు, ఆయన శిష్యులు గలలీకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు. ఆయన ఒడ్డున దిగగానే దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా, సమాధుల్లో తిరుగాడే ఆ ఊరి వాడొకడు ఆయన్ని ఎదురుగా వచ్చాడు.. ఆయన "ఈ వ్యక్తిని వదిలి బయటకు రా" అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు..."పాతాళంలోకి వెళ్ళమని తమకు ఆజ్ఞ ఇవ్వవద్దని" దెయ్యాలు ఆయనను ఎంతో బతిమాలాయి.పందుల మందలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు. వెంటనే ఆ మంద ఎత్తైన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి  సరస్సులో పడి ఊపిరి ఆడక చచ్చాయి. ఆ పందుల్ని మేపుతున్న వారు వెళ్ళి, పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు.ఆ ఊరి ప్రజలు యేసు దగ్గరకు వచ్చి, అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండటం చూసి భయపడి, తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు. ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్లబోతుంటే దయ్యాలు విడిచిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు. కానీ ఆయన "నువ్వు నీ ఇంటికి వెళ్లి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు" అన...

22 July 2017

పరిశుద్ధాత్మ-"ఆనాడు ఎడారిలో మూర్ఖులైన మీ పూర్వీకులు నాకు కోపం రేపి ఎదురు తిరిగారు. నా సహనాన్ని పరీక్షించారు. కాని నేడు మీరాయన మాటలు వినబడుతున్నప్పుడు మీ హృదయాలు కఠిన చేసుకోకండి. నేను 40 సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా మీ పూర్వీకులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు. కనుక నేను ఆ తరంవారిమీద కోపపడి, ౼ 'వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాల్లో సత్యానికి దూరంగా ఉంటున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు. వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు' అని ప్రమాణం చేశాను" ✔  "సోదరులారా(విశ్వాసులారా), జీవం గల దేవుని నుండి తొలగిపోయే, విశ్వాసంలేని చెడ్డ హృదయం హృదయం మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. ఆ ‘నేడు’ అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. 'మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం! (పాలివారమైఉంటాము)' ✔  దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేసిందెవరు? ఐగుప్తులో నుండి మోషే బయటకు నడిపించిన వారందరే కదా! దేవుడు 40 ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి...

21 July 2017

 ఎలీషా ప్రవక్త మరణించగా, ప్రజలు అతనిని సమాధిలో ఉంచారు. ఒక సంవత్సరమైన తరువాత మోయాబీయుల సైన్యము ఇశ్రాయేలు దేశము మీదికి వచ్చినప్పుడు..కొంతమంది ఒక శవాన్ని పాతిపెడుతూ సైన్యమునికి భయపడి, ఆ శవాన్ని ఎలీషా యొక్క సమాధిలో ఉంచారు. ఎలీషా ఎముకలను ఆ చనిపోయిన వ్యక్తి తాకగానే, ఆ వ్యక్తి సజీవుడయ్యాడు(2రాజులు 13: 20,21)   ❇ దేవుడు ఎలీషా ద్వారా చాలా అద్భుతాలు జరిగించాడు.కాని ఎలీషా రోగగ్రస్తుడై చనిపోయ్యాడు. ఎలీషా రోగం వల్ల చనిపోయ్యేట్లు దేవుడే అనుమతించాడు. దేవుడు ఆయనకు నమ్మకమైన వారి జీవితంలో పంపే  భాధలన్ని "శిక్షలు" కావు. చాలా సార్లు నమ్మకత్వానికి పరీక్షలుగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎలీషా గ్రహించాడు, కనుకనే దేవుని పట్ల విముఖత చూపలేదు. పైగా ఆయన చిత్తాన్ని గౌరవించాడు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం కోసం దేవుడు ఎలీషా ఎముకల్ని సైతం వాడుకోనడం ద్వారా, ఎలీషా తనకు నమ్మకమైన సేవకుడని దేవుడు ఆమోదించాడు. ౼ సంతానంలేని అబ్రాహాము, రాజైన అబీమెలేకు ఇంటివారి కొరకు ప్రార్ధించగా, దేవుడు తిరిగి గర్భ ఫలాన్ని ఇచ్చాడు.(ఆది 20:17,18) ౼ అనేక శ్రమల పాలైన యోబు ప్రార్ధించగా, దేవుడు అతని స్నేహితులను శిక్షిం...

19 July 2017

  ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చి, అక్కడ సమాధి పైన ఉంచిన రాయి తీసి ఉండటం చూసింది..మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది. ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వాళ్ళు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు. దేవదూతలు-"అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" మరియ-"ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు" ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండటం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్ట లేదు. యేసు-"అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవర్ని వెదకుతూ ఉన్నావు?". ఆమె ఆయన్ను తోటమాలి అనుకుని- "అయ్యా! ఒకవేళ నువ్వు ఆయన్ను తీసుకు వెళ్తే, ఆయన్ను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ను మోసుకొని వెళ్తాను" అప్పుడు యేసు- "మరియా" అని పిలిచాడు.   ❇ ✔  పునరుద్దాన దినం రోజు ఆయన తల్లియైన మరియ గూర్చిన ప్రస్తావన లేదు, కాని 4 సువార్తల్లో మగ్దలేనే మరియ(7దయ్యాలు పట్టి, యేసుచేత బాగుచేయ్యబడ్డ స్త్రీ) గూర్చి వ్రా...

17 July 2017

❇   "ఒకరోజు ఈజిప్టు వాడొకడు హీబ్రూవాడ్ని కొట్టడం మోషే చూసాడు.ఎవరైనా గమనిస్తున్నారేమోనని మోషే అటు ఇటు చూసాడు. తర్వాత మోషే ఆ ఈజిప్టువాడ్ని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు"(నిర్గమ 2:11)   ❇ ✔  దేవుడు ఎన్నుకొన్న మోషేలో ఆవేశం, కోపం అనే బలహీనతలు కనిపిస్తున్నాయి. అతను దేవుని స్వరూప్యంలోకి మారటం అంటే వీటి స్థానంలోకి దీర్ఘశాంతం, సాత్వికం ధరించుకోవడం. మోషే దైర్యంగా దేవుని కోసం నిలబడటం ఇప్పటికే నేర్చుకున్నాడు (దైర్యం అతని స్వభావం సిద్ధంగానే ఉన్న లక్షణం). ఇప్పుడతడు దేవునిపై ఆధారపడుతూ నిమ్మళంగా ఉం డే క్రీస్తు రూపంలోకి మారాల్సివుంది. ✔  కొందరు తమ దైర్యంబట్టి అతిశయిస్తూ, అలా లేని వారిపట్ల చిన్న చూపు చూస్తారు.ఇప్పుడు అవసరమైనది విరువబడిన అనుభవం. బలవంతుడను అనుకున్నవాడు బలహీనుడుగా ఎంచుకోవాల్సివుంది. అప్పటి వరకు దేవుడు మోషేని వాడుకోలేకపొయ్యాడు. ❇  దేవుడు-“యిర్మీయా, నీవు మాత్రం సిద్ధంగా ఉండు. ధైర్యంగా నిలబడి ప్రజలతో మాట్లాడు. నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా వారికి తెలియజేయి. ప్రజలకు నీవు భయపడవద్దు. నీవు ప్రజలకు భయపడితే, వారి ఎదుట నేను నిన్ను ఎక్కువ భయానికి గురి చేస్తాను"(...

16 July 2017

❇ "ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లి, ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చనిపోవాలని కోరుకొని దేవునికి ఇలా ప్రార్థించాడు-'ప్రభువా, నాకిది చాలు. ఇక నన్ను చనిపోనియ్యండి. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను' అన్నాడు" ❇ ✔ ఏలీయా ప్రార్థనను బట్టి దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. వర్షాన్ని కురిపించాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. సూచక క్రియలను చేశాడు. ఈ ప్రార్థనలన్నీ దేవుని చిత్తానుసారం చేశాడు(1రాజు 18:1,36) ఏలీయా చేసిన అన్ని ప్రార్ధనలను దేవుడు ఆలకించి అంగీకరించాడు. దేవుడు పంపిన ప్రతిచోటికి విశ్వాసంతో ప్రయాణం చేశాడు.  ✔ కానీ పైన చెప్పిన ఒక్క సందర్భంలో అతని ప్రయాణం, ప్రార్థన విశ్వాసం లేని సొంత ఆలోచన. కనుకనే అతని ప్రార్థనను దేవుడు త్రోసిపుచ్చాడు(ప్రార్థనలో దేవునికి సలహాలవ్వకూడదు. నిర్గమ 4:13,14). నిజానికి అనాధికాల దేవుని సంకల్పంలో ఏలీయా మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్లడం దేవుని చిత్తం. కానీ అల్పవిశ్వాసం, భయం, నిరుస్సాహలు దేవుని చిత్తానికి పూర్తి విరుద్ధమైన ప్రార్థనలోనికి, మార్గంలోకి మనల్ని నడిపిస్తాయి (యోహాను 21:3). ❇ "అప్పుడు ఏలీయా నిద్ర...

1 July 2017

"అప్పుడు యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనును నింపగా, అతని చేతులకు ఉన్న త్రాళ్ళు కాలిపోయిన నారలాగా అయి పొయ్యాయి. అతని చేతుల మీదనుంచి కట్లు ఊడిపొయ్యాయి. అక్కడ సమ్సోనుకు పచ్చి గాడిద దవడ ఎముక ఒకటి దొరికింది. అతడు దానిని చేతపట్టుకొని దానితో వెయ్యిమంది ఫిలిష్తీయుల్ని హతమార్చాడు"(న్యాయాధి 15:14,15) యెహోవా ఆత్మ సమ్సోను మీదికి బలముగా వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడే బంధకాలను తెంపాడు(2 కోరింధీ 3:17). అసాధారణ రీతిలో మార్గాలను తెరుచువాడు/మూయువాడు, అసాధారణ కార్యాలు చేయువాడు ఆయనే! (అపో 16:6,7) ఎవరినైతే ఆయన చిత్తప్రకారం ఏర్పాటు చేసుకొన్నాడో, ఆ వ్యక్తిని ఆ ప్రదేశానికి (ఆ పరిస్థితుల్లోకి) నడుపుతాడు. (మన బుద్ధిపూర్వక అవిధేయతలను ఈ జాబితాలోకి చేర్చకూడదు, ఉదా||ఏదేను తోటలో ఆదాము, హవ్వల బుద్ధిపూర్వక అవిధేయత. బుద్ధిహీన పాపపు పనులను దేవుని చిత్తం అనకూడదు. దేవుడు చెడిపోయిన జీవితాలను సైతం బాగుచెయ్యగల సమర్ధుడు. దేవుడు కృప చూపి, బాగుచేసి కలుగజేసుకున్నాడు కాబట్టి మునుపు చూపిన అవిధేయత దేవుని చిత్తమా?కాదు! అలా చెప్పకూడదు! ఆదాము అవిధేయత శాపం నేటికి అనుభవిస్తున్నాము). ఇక్కడ ఫిలిష్తీయులను హతం...

4 July 2017

ఒకరోజు చిన్నవాడైన యాకోబు వంట వండుతున్నాడు. పెద్దవాడైన ఏశావు అప్పుడే వేటకు వెళ్ళి చాలా అలసిపోయి వచ్చాడు. ఏశావు యాకోబుతో- “నేను చాలా అలసిపొయ్యాను. ఆ ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు" అన్నాడు .   యాకోబు- "నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని నాకు అమ్మివేయి, అప్పుడు ఇస్తాను" ఏశావు- “ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాను. జన్మహక్కు నాకెందుకూ?” యాకోబు- “ఐతే! మొదట నాకు ప్రమాణం చెయ్యి”.   ఏశావు యాకోబుకు ప్రమాణం చేసి తన జన్మహక్కు అతనికి అమ్మివేశాడు. అప్పుడు యాకోబు రొట్టె, భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని, త్రాగి లేచి తన దారిన వెళ్ళాడు" (ఆది 25:29-34) ఈ సంఘటనను ఏశావు చాలా చులకనగా తీసుకున్నాడు. కాని దేవుడు అలా తీసుకోలేదు. దైవ గ్రంథంలో ఆత్మీయ భ్రష్టత్వానికి సూచనగా వ్రాయించాడు. జ్యేష్ఠత్వం(మొదటి వానిగా పుట్టడం) మనం కోరుకుంటే కలిగేది కాదు, అది దేవుడు నియమించేది. ఆ కాలమందు జ్యేష్ఠత్వానికి ఎంతో విలువ ఉండేది. దేవుని కృపకు గుర్తుగా క్రొత్త నిబంధనలో పోల్చబడింది. " దేవుని కృప నుండి, మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్తపడండి...లైంగిక అవినీతిని సాగించేవారు కానీ, ఒక్క పూట భోజనం కోసం తన జన్మహ...

5 July 2017

ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్లారు. కాని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించి ఇశ్రాయేలు సైన్యంలో సుమారు 4000 మంది సైనికులను చంపివేశారు. అప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు-"షిలోహులో ఉన్న యెహోవా మందసాన్ని ఇక్కడికి తెప్పిద్దాం. అది మన మధ్య ఉంటే అది మనల్ని శత్రువుల బారినుంచి కాపాడుతుంది” యెహోవా మందసం యుద్ధ శిబిరంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులంతా సంతోషంతో పెద్దగా కేకలు వేశారు. ఆ సంగతి త ెలుసుకొని ఫిలిష్తీయులకు భయం వేసింది. ఐనా ధైర్యం తెచ్చుకొని యుద్ధం చేయగా, ఇశ్రాయేలీయులు ఓడిపోయి ఒక్కొక్కరుగా తమ డేరాలకు పారిపోయారు. యుద్ధంలో పెద్ద వధ జరిగింది. 30,000 మంది ఇశ్రాయేలు సైనికులు చనిపోయారు. దేవుని మందసం చెర పట్టబడింది.(1సమూ 4:1-11) ఇదే దేవుని మందసంతో వారి పితరులు అనేక యుద్ధాలు చేసి వీరోచితంగా గెలిచారు. దేవుని సన్నిధి వారితో రాగా, ఆయనే వారి పక్షాన పోరాడాడు. అసాధారణ కార్యాలు జరిగించాడు. కాని విశ్వాసంతో ఉన్న వీరు ఇప్పుడెందుకు ఇలా ఓడిపోయ్యారు? వీరి పితరులు దేవుని దగ్గర విచారణ చేసి, దేవుడు పంపగా యుద్ధానికి వెళ్లేవారు. ఇక్కడ పెద్దల పెత్తనం, వారి మాట దేవుని స్థానాన్ని ఆక్రమించింది. ...