❇ "ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లి, ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చనిపోవాలని కోరుకొని దేవునికి ఇలా ప్రార్థించాడు-'ప్రభువా, నాకిది చాలు. ఇక నన్ను చనిపోనియ్యండి. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను' అన్నాడు" ❇
✔ ఏలీయా ప్రార్థనను బట్టి దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. వర్షాన్ని కురిపించాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. సూచక క్రియలను చేశాడు. ఈ ప్రార్థనలన్నీ దేవుని చిత్తానుసారం చేశాడు(1రాజు 18:1,36)
ఏలీయా చేసిన అన్ని ప్రార్ధనలను దేవుడు ఆలకించి అంగీకరించాడు. దేవుడు పంపిన ప్రతిచోటికి విశ్వాసంతో ప్రయాణం చేశాడు.
✔ కానీ పైన చెప్పిన ఒక్క సందర్భంలో అతని ప్రయాణం, ప్రార్థన విశ్వాసం లేని సొంత ఆలోచన. కనుకనే అతని ప్రార్థనను దేవుడు త్రోసిపుచ్చాడు(ప్రార్థనలో దేవునికి సలహాలవ్వకూడదు. నిర్గమ 4:13,14). నిజానికి అనాధికాల దేవుని సంకల్పంలో ఏలీయా మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్లడం దేవుని చిత్తం. కానీ అల్పవిశ్వాసం, భయం, నిరుస్సాహలు దేవుని చిత్తానికి పూర్తి విరుద్ధమైన ప్రార్థనలోనికి, మార్గంలోకి మనల్ని నడిపిస్తాయి (యోహాను 21:3).
❇ "అప్పుడు ఏలీయా నిద్రపోగా..ఒక దేవదూత అతణ్ణి తట్టి 'నీవు లేచి భోం చెయ్యి!' అన్నాడు. అతడు కండ్లు తెరిచి చూస్తే అతడి తల దగ్గర సీసాలో నీళ్ళు, వేడి రాళ్ళ మీద కాల్చిన రొట్టె కనిపించాయి. అతడు తిని నీళ్ళు త్రాగి మళ్ళీ పడుకొన్నాడు.
తరువాత యెహోవా దూత రెండో సారి వచ్చి అతణ్ణి తట్టి 'లేచి భోం చెయ్యి. లేకపోతే నీవు చేసే ప్రయాణం నీ బలానికి మించిపోతుంది' అన్నాడు" ❇
✔ దేవుని చిత్తానుసారం నడవడానికి ఇష్టపడేవారిని, ఆయనే తన చిత్తంలోకి ప్రవేశపెడతాడు. సమస్తం సిద్ధపరుస్తాడు. కొన్ని అల్ప విశ్వాస, బుద్ధిహీన ప్రార్థనలను దేవుడు అంగీకరించకపోవడమే మనకు మేలు. లేదంటే కొన్ని విలువైన ఆయన ఆలోచనలను (ఏలీయా మరణం చూడకుండా పరలోకానికి వెళ్లడం లాంటివి) కోల్పోతాము.
☑ మన ప్రార్థన విశ్వాసంతో, దేవుని మీద ఆధారపడుతూ, ఆయన ఆలోచనలను గుర్తుపట్టెట్లుగా ఉండవల్సివుంది.
Comments
Post a Comment