Skip to main content

Posts

Showing posts from January 28, 2018

28Jan2018

❇ కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి. మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత కొర్నేలీ దగ్గరికి వచ్చి౼“కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు. అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి౼“ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు. అందుకు దూత౼“నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో. అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది” అని చెప్పాడు.❇ ■కొర్నేలి౼మంచిమనస్సున్న భక్తిపరుడుగా ఉన్నప్పటికీని, అతను రక్షింపబడిన వాడు కాదని బైబిల్ చెప్తుంది(అపో 11:14). అనగా కొర్నేలి జీవితకాలమంతా ప్రార్ధనలు క్రమంగా చేసుకుంటూ..ఇతరులకు మేలు చేసేవానిగా ఉంటూ..ఆ మంచి పనులు పరలోకంలో దేవునికి జ్ఞాపకార్ధంగా చేరినప్పటికీ..అవేవి అతన్ని రక్షింపలేకపోయ్యాయి.ఏ వ్యక్తి తన మంచి పనులను బట్టి దేవుని రాజ్యం చేరుకోలేడని బైబిల్ ఖండితంగా చెప్తుంది. 'ఆదాము' అనే ఒక్కడే మనిషి నుండి వచ్చిన మనల్నింతా దేవుడు మార్గం తప్పి నశించుపొయ్...