Skip to main content

Posts

Showing posts from January 10, 2018

10Jan2018

❇ యేసు తాను పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడసాగిందని గ్రహించి ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి మనసులో నిశ్చయం చేసుకున్నాడు. ఆయన తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్ళి ఆయనకు అంతా సిద్ధం చేయడానికి ఒక సమరయ గ్రామంలో ప్రవేశించారు.  ఆ గ్రామం వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం వలన ఆయణ్ని స్వీకరించలేదు. శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి౼“ప్రభూ! ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేము వీరిని శపించడం నీకిష్టమేనా?” అని అడిగారు. ఆయన వారి వైపు తిరిగి వారిని గద్దించాడు౼"మీరు ఎలాంటి ఆత్మ గల వారో మీకు తెలియదు. ఎందుకంటే మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మలను రక్షించడానికే వచ్చాడు కానీ నాశనం చేయడానికి రాలేదు" అన్నాడు. అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్ళారు. ❇ ■ పాత నిబంధనల కాలంలో ఏలీయా 'దేవుని మనిషి' అని రుజువుగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మనుష్యులను దహించి వేశాయి(2 రాజు 1:10),  మోషే మీద తిరుగుబాటు చేసిన కోరాహును-వానితో ఉన్న వారిని భూమి చీల్చబడి, వారిని మ్రింగివేసింది (సంఖ్యా 16:32). అందుకే కాబోలు యాకోబు, యోహానులు క్రీస్తును తిరస్కరించిన వారిపై అగ్నిని కురిపించి ఆయనే క్రీస్తు...