❇ యేసు తాను పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడసాగిందని గ్రహించి ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి మనసులో నిశ్చయం చేసుకున్నాడు. ఆయన తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్ళి ఆయనకు అంతా సిద్ధం చేయడానికి ఒక సమరయ గ్రామంలో ప్రవేశించారు. ఆ గ్రామం వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం వలన ఆయణ్ని స్వీకరించలేదు.
శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి౼“ప్రభూ! ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేము వీరిని శపించడం నీకిష్టమేనా?” అని అడిగారు. ఆయన వారి వైపు తిరిగి వారిని గద్దించాడు౼"మీరు ఎలాంటి ఆత్మ గల వారో మీకు తెలియదు. ఎందుకంటే మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మలను రక్షించడానికే వచ్చాడు కానీ నాశనం చేయడానికి రాలేదు" అన్నాడు. అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్ళారు. ❇
■ పాత నిబంధనల కాలంలో ఏలీయా 'దేవుని మనిషి' అని రుజువుగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మనుష్యులను దహించి వేశాయి(2 రాజు 1:10), మోషే మీద తిరుగుబాటు చేసిన కోరాహును-వానితో ఉన్న వారిని భూమి చీల్చబడి, వారిని మ్రింగివేసింది (సంఖ్యా 16:32). అందుకే కాబోలు యాకోబు, యోహానులు క్రీస్తును తిరస్కరించిన వారిపై అగ్నిని కురిపించి ఆయనే క్రీస్తు అని రుజువు పర్చాలనుకున్నారు. కానీ ప్రభువు అందుకు అంగీకరించలేదు, పైగా అట్టి ఆత్మ గల వారిని గద్దిస్తున్నాడు. నూతన నిబంధన అత్యంత శ్రేష్ఠమైనది..క్రీస్తు రక్తంతో, పరిశుద్ధాత్మచే ముద్రవేయబడినది. క్రీస్తు మనల్ని రక్షించడానికే(కృపకే) గాని న్యాయవిధుల బట్టి తీర్పుతీర్చడానికి రాలేదు.తీర్పు తీర్చడానికి ఆజ్ఞాపన చేసి, త్వరపడేది ధర్మశాస్తం. అది వస్తూనే శిక్షను తన వెంట తీసుకొచ్చింది(రోమా 7:7-12, గలతీ 5:4). ఏ నరుడు దానిని సంపూర్ణంగా నెరవేర్చలేడు, కనుకనే రక్షకుడు భూమిపై అవతరించాడు. ఆయన మనల్ని కాపాడాటానికే(సహాయం చేయడానికే) వచ్చాడు. నూతన నిబంధన క్రైస్తవుడు నీతిన్యాయాలను బట్టి ఖశ్చిత కొలమానంతో తీర్పు తీర్చే నిపుణుడైన తీర్పరిగా మారకూడదు.కానీ క్రీస్తు వలె కృపతో నింపబడిన సహాయకునిగా అవ్వాలి.క్రీస్తులో మనం పొందుకుంది (ఇప్పటికీ పొందుకుంటుంది) అదే కదా!
■ ధర్మశాస్తం దేవునిచే ఇవ్వబడింది! అది నిర్మలమైనది. పాపానికి ఖశ్చితమైన తీర్పుతీర్చుతుంది. కానీ పాపం నుండి మనల్ని బయటికి తేవడంలో మనిషికి ఏ మాత్రం సహాయం చెయ్యలేదు. అది రక్షకుని అవసరతను మనకు తెలియజేస్తూ, రక్షకుని దగ్గరకు నడిపిస్తుంది. క్రీస్తు పాపం యొక్క శిక్షను మన పక్షాన భరించడానికి, దాని బలం నుండి విడిపించడానికి, మనల్ని ఆయనలో దాచి, మనల్ని పరమ తండ్రి బిడ్డలుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఇది కృప!౼అంటే కన్న తండ్రి, తన బిడ్డల పట్ల చూపే ప్రేమ! ధర్మశాస్తం న్యాయాధిపతి వంటిది!ఎవరైతే (కృపను నిర్లక్ష్యం చేస్తూ) ఎదుటి వారిని తీర్పుతీర్చడంలో నిపుణులమని భావిస్తారో వారు ధర్మశాస్తానికి లోబడుతున్న వారే కానీ క్రీస్తు కృపలో నిలిచిన వారు కారు.అంటే తప్పిపోయిన కుమారుని కధలో తండ్రి స్వభావానికి, పెద్దకుమారుని స్వభావానికి ఉన్న తేడా! ఏ కొలతతో ఇతరులకు కొలుస్తారో వారు అదే కొలతతో మనం కొలవబడతాము. (Be a Father to weak, rather than a gud judge. Bcz God has been doing same with us). నాకు(Christopher) ఈ విషయంలో ప్రత్యక్షత లేని దినాల్లో ఈ తప్పును చేశాను, ఎప్పుడైతే దేవుడు నన్ను వెలిగించాడో, అప్పట్నుంచి నేను క్రొత్తనిభంధన క్రైస్తవునిగా, ప్రేమ కలిగిన సహాయకునిగా ఉండటానికి తీర్మానం చేసుకున్నాను.
◆ ప్రేమ ముసుగులో మన సహవాసంలో అవిధేయులు తమ పాపంలో సౌకర్యం వెతుక్కోనివ్వకూడదు. అలాగే కృపలేకుండా వాక్యం పేరిట తీర్పరి కొరడాను జల్లింపకూడదు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అది బలహీనతా(పోరాటమా)? లేక బుద్ధిపూర్వకమైన అవిధేయతా(తిరుగుబాటా)? మొదట వివేచించాలి. మేలు కోరి సహాయం చేసే వారిగా, ప్రేమ కలిగి గద్దించి సత్యం చెప్పే వారిగా మనం ఉండాలి. క్రీస్తు కృపను నిర్లక్ష్యం చేసిన వారికి అంత్యదినాన క్రీస్తు న్యాయపీఠం వద్ద తీర్పు ఉంటుందని మర్చిపోవద్దు!
_____________________________
For more posts visit below links
https://www.facebook.com/kristop4
https://kristop4.blogspot.com
_____________________________
For more posts visit below links
https://www.facebook.com/kristop4
https://kristop4.blogspot.com
Comments
Post a Comment