Skip to main content

Posts

Showing posts from January 23, 2018

23Jan2018

❇ భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్టు దేవుడు చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్టు ఆయన చూశాడు. ఈ భూమి మీద మనుష్యులను చేసినందుకు దేవుడు విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది (ఆది 6:5,6).❇ ■ నోవహు రోజులకు భూమిపై నరులు చెడుతనం బహుగా విస్తరించింది. దేవుని మీద తిరుగుబాటు చేసి, ఆయన్ను దుఃఖపెట్టే భక్తిహీనులైన తరం ఒకటి విస్తృతంగా ప్రబలింది. ప్రజలు భక్తిహీనులై భూమిమీద వారి జీవితాలను చెడుతనంతో చెరిపి వేసుకొన్నారు(యూదా 1:14,15). కయీను దేవుని సన్నిధి వెళ్ళగొట్టబడిన తర్వాత ఇక దేవుని గూర్చి ఆలోచనలు అతనిలో గానీ, అతని సంతానంలో గాని ఉన్న దాఖలు కనిపించవు. కయీను మొదటి నుండి ఏ మాత్రం దైవభయం లేని వాడిగా ఉంటూ, ఇహలోక విషయాల్లో ఆసక్తి పరునిగా కనిపిస్తాడు. అతని సంతతివాడైన లెమెకు దైవభయం లేకుండా (కయీను వలె) ఒకడ్ని హత్య చేసి, తన భార్యలకు గొప్పగా చెప్పుకున్నాడు. బహు భార్యత్వం మొదట ఆరంభమైనది ఈ వంశంలోనే! అంతేకాకుండా క్రొత్త విషయాలను కనుగొని, జీవిన విధానాన్ని సరళీకృతం చేసుకొనే (రాగి, ఇనుమును ఉపయోగించడం, సంగీత వాయిద్యలను వాడటం, గుడారాల్లో నివసించడం) స...