✴️ ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషాను చూచి ఇలా మొర పెట్టింది. ౼“మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. ఆయనకు యెహోవా అంటే భయభక్తులని మీకు తెలుసు గదా. మాకు అప్పిచ్చిన వాడు వచ్చి నా ఇద్దరు కొడుకులను బానిసలుగా తీసుకుపోవాలని ఉన్నాడు.” ఎలీషా౼“నేను నీకు ఎలా సహాయం చేయాలి? నీ ఇంట్లో ఏం ఉన్నదో నాకు చెప్పు” అన్నాడు. అందుకామె౼“మీ దాసురాలైన నా ఇంట్లో ఒక కుండ నిండా నూనె తప్ప ఇంకేమీ లేదు” అంది. ఎలీషా ౼“నీవు బయటికి వెళ్ళి నీ పొరుగువాళ్ళందరి దగ్గర దొరకగలగినన్ని ఖాళీ పాత్రలు ఎరవుగా తెచ్చుకో. అప్పుడు నీవు నీ కొడుకులను ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసివేసి, ఆ పాత్రలన్నిట్లో నూనె పోయండి. నిండిన వాటిని ప్రక్కన పెట్టు”.... ఆమె ఆ విధంగా చేసి, ఆ పాత్రలు నిండిపోయినప్పుడు ఆమె “ఇంకో పాత్ర తీసుకురా” అని కొడుకుతో చెప్తే అతడు “ఇంకొకటి లేదు” అన్నాడు. వెంటనే కుండలో నుండి నూనె సరఫరా నిలిచింది. ఆమె వచ్చి ఎలీషాకు ఆ విషయం తెలియజేసింది. ఎలీషా౼“నీవు వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పు తీర్చు. మిగిలిన దానితో నీవూ, నీ కొడుకులూ బ్రతకండి” అన్నాడు. ✴️ ■ ఒకని జీవితం ఎంత చెడిపోయి, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నపాటున దేవుని దగ్...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.