Skip to main content

12Apr2018

✴️ ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషాను చూచి ఇలా మొర పెట్టింది.
౼“మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. ఆయనకు యెహోవా అంటే భయభక్తులని  మీకు తెలుసు గదా. మాకు అప్పిచ్చిన వాడు వచ్చి నా ఇద్దరు కొడుకులను బానిసలుగా తీసుకుపోవాలని ఉన్నాడు.”
 ఎలీషా౼“నేను నీకు ఎలా సహాయం చేయాలి? నీ ఇంట్లో ఏం ఉన్నదో నాకు చెప్పు” అన్నాడు. అందుకామె౼“మీ దాసురాలైన నా ఇంట్లో ఒక కుండ నిండా నూనె తప్ప ఇంకేమీ లేదు” అంది. ఎలీషా ౼“నీవు బయటికి వెళ్ళి నీ పొరుగువాళ్ళందరి దగ్గర దొరకగలగినన్ని ఖాళీ పాత్రలు ఎరవుగా తెచ్చుకో. అప్పుడు నీవు నీ కొడుకులను ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసివేసి, ఆ పాత్రలన్నిట్లో నూనె పోయండి. నిండిన వాటిని ప్రక్కన పెట్టు”....
ఆమె ఆ విధంగా చేసి, ఆ పాత్రలు నిండిపోయినప్పుడు ఆమె “ఇంకో పాత్ర తీసుకురా” అని కొడుకుతో చెప్తే అతడు “ఇంకొకటి లేదు” అన్నాడు. వెంటనే కుండలో నుండి నూనె సరఫరా నిలిచింది. ఆమె వచ్చి ఎలీషాకు ఆ విషయం తెలియజేసింది. ఎలీషా౼“నీవు వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పు తీర్చు. మిగిలిన దానితో నీవూ, నీ కొడుకులూ బ్రతకండి” అన్నాడు. ✴️

■ ఒకని జీవితం ఎంత చెడిపోయి, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నపాటున దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంగీకరించి బాగుచేస్తాడు. ఏదెను నుండి ఇప్పటికి వరకు ఆయన స్వభావం ఇదే! లేఖనాలు ఇలాంటి ఉదాహరణలతో నిండి ఉన్నాయి. ప్రభువు పాడైపోయిన వాటిని మరళా కట్టే దేవుడు. మన సొంత నిర్ణయాలు('నేను' అనే యెలుబడి) పాపానికి, అనేక ఇబ్బందులకు కారణం. మానవుని జీవితం(ప్రాణాత్మ దేహాలు) దేవునితో ముడిపడిన్నట్లుగా దేవుడు అతణ్ణి నిర్మించాడు. ఎప్పుడైతే నిర్మించబడిన ఆ ఉద్దేశ్యంలో నుండి మనం  వైదొలుగుతామో, అనగా నా జీవితంపై నా యెలుబడి చేయడం ద్వారా 'నా జీవితం నేను కొనసాగింపగల సమర్థున్ని, నేను దేవుని కంటే శ్రేష్ఠుణ్ని' అనే అహాన్ని తెలియజేస్తుంది. ఏదెనులో మొదటి పాపానికి కారణం కూడా ఇదే. ప్రతి విషయం దేవునితో మాట్లాడటం, దేవునిపై ఆధారపడటం చిన్న బిడ్డల్ని పోలిన మనస్సు. పిల్లల జీవితంలో ప్రతి శ్రేష్టమైన విషయాలు తల్లిదండ్రులు వివేచించినట్లు పరమ తండ్రి మన గురించి జాగ్రత్త తీసుకుంటాడు. ఆయన నడిపే ప్రతి స్థలం మన మేలు కొరకే! విశ్వాసి ఆత్మీయ-భౌతిక ప్రతి అవసరాలు ప్రభువు సన్నిధిలో ఉంచడం శ్రేష్ఠమైన సంగతి. ఎలీషా ద్వారా దేవుడు జరిగించిన ఈ అద్భుత కార్యం, శిష్యుడైన ప్రవక్త అవసరంలో ఉన్నప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చినట్లైతే దేవుడు చేయలేడా? చేయగలడు. మనం దేవుణ్ని ఆశ్రయించక పోవడమే మన జీవితంలో అనేక సమస్యలకు కారణం.

■ అలా విశ్వాసంతో ఉన్నపాటున దేవుని సన్నిధికి వస్తున్ననప్పుడు మనం దేవుని శక్తిని నమ్మాలి. ఇప్పుడు నీలో వేటినైతే చూసి 'నేను అసమర్థుడను' అని భయపడుతూ నిరీక్షణ కోల్పోయావో అదే విషయాలను దేవుడు బాగు చెయ్యగలడని, ఆయనకు సమస్తమూ సాధ్యములేనని (అసాధ్యమైనది ఏదీ లేదని) నమ్ముతున్నావా? (About specific Will of God for individual lives) ఆ స్త్రీ తనకు నచ్చిన విధానంలో ఆ సమస్య నుండి బయటికి రావడానికి ప్రయత్నాలు చేసి నేను విశ్వాసం ఉంచుతున్నాను, దేవుడు నన్ను బాగు చెయ్యగల సమర్థుడు అనకూడదు. అప్పుడు మరోసారి ఆ కుటుంబం విఫలమైవుండేది. విశ్వాసం అంటే అది కాదు. దేవుడు నీతో చెయ్యమని చెప్పిన మాట౼అది నమ్మడానికి ఎంత కష్టమైన ఆయన చెప్పాడు గనుక చేయగల సమర్థుడని నమ్మడం. ఆమెతో దేవుడు చెప్పాడు, నూనెను పాత్రలలో నింపి ఆ సమస్య నుండి బయటపడమన్నాడు. విశ్వాసంతో ఆమె అలా చేసి దేవుని పనిని తన జీవితంలో చూసింది. దేవుడు అబ్రాహాముతో పిల్లలను ఇస్తానని చెప్పిన మాట, కష్టతరమైనప్పటికీ అతను విశ్వాసముంచి పొందుకున్నాడు. ఒకవేళ దేవుడు అబ్రాహాముతో ఆ మాట చెప్పకపోయినట్లైతే అతడు విశ్వాసముంచినా, అది జరిగేది కాదు. ఆయన చెయ్యగలడని నేను నమ్ముతున్నాను, అని దేవుడు 'నీతో చెప్పని' మాటను నమ్మడం విశ్వాసం కాదు, అప్పుడు ఇంకను నీ సొంత మార్గాల్లో దేవుణ్ని వేతకడమే అవుతుంది. దేవుని చిత్తానుసారంగానే మనం ప్రార్ధించాలి, విశ్వాసముంచాలి. అంటే ఉన్నపాటున దేవుని వద్దకు వచ్చి, పసిబిడ్డలా తండ్రి చేతిలో ఓదగటం. ఆయన ఏం చెప్తే ఆ ప్రకారం నడుచుకోవాల నుకోవడం. మన జీవితం అంతటిపై ఆయన అధికారాన్ని సంపూర్ణంగా ఒప్పుకోవడం.

౼(About revealed Will of God for all) మనం జయించలేక, ఓడిపోతున్న ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో పెడుతూ, దేవుడు విడిపించగల సమర్థుడని మరళా మరళా చెప్పటమే విశ్వాసం (రోమా 6:14). విశ్వాసంలోనే విజయం ఉంది. నీవు నీవైపు చూడక శక్తిమంతుడైన దేవుని వైపు చూస్తూ, మన శక్తిని శూన్యం చేసుకుని దైవ శక్తినే మన బలంగా మార్చుకునే జీవితం. పాపం చేసినప్పుడు దేవుడు విశ్వాసి మనస్సును గమనిస్తాడు. అందులోనే బయటకు రావాలనుకుంటున్నాడా? లేక కారణాలు చూపిస్తూ ఆనందించాలను కుంటున్నాడా? ఈ మాటలన్నీ పాపం నుండి బయటకు వచ్చి, క్రీస్తును పోలి నడచుకోవాలనుకునే వారి కోసం మాత్రమే!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...