Skip to main content

Posts

Showing posts from January 19, 2018

19Jan2018

❇ దేవుడు దావీదుతో౼"నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు, నీకు పుట్టిన నీ సంతానాన్ని నీ స్థానంలో ఉంచి అతడి రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అతడే నాకు మందిరం కట్టిస్తాడు! నేను అతడి రాజ్య సింహాసనాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను. నేను అతడికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. నా మందిరం మీదా నా రాజ్యం మీదా శాశ్వతంగా అతణ్ణి స్థిరపరుస్తాను. అతని సింహాసనం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది" అని అన్నాడు. దేవదూత మరియతో౼"నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు 'యేసు' అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు❇ ■ దేవుడు దావీదుతో అతని కుమారుడైన సొలొమోను గూర్చి పలుకుతున్న మాటలు..అవి మర్మగర్భితంగా రాబోయే క్రీస్తును గూర్చి, ఆయన పరిపాలన గురించిన ప్రవచన వాక్యాలు. సొలొమోను భూసంభంధమైన జ్ఞానంతో, సమాధానంతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మనుష్యులతో సహవాస సంభంధం మీద చూపిన శ్రద్ధ దేవుని సహ...