Skip to main content

19Jan2018

❇ దేవుడు దావీదుతో౼"నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు, నీకు పుట్టిన నీ సంతానాన్ని నీ స్థానంలో ఉంచి అతడి రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అతడే నాకు మందిరం కట్టిస్తాడు! నేను అతడి రాజ్య సింహాసనాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను. నేను అతడికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. నా మందిరం మీదా నా రాజ్యం మీదా శాశ్వతంగా అతణ్ణి స్థిరపరుస్తాను. అతని సింహాసనం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది" అని అన్నాడు.

దేవదూత మరియతో౼"నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు 'యేసు' అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు❇


■ దేవుడు దావీదుతో అతని కుమారుడైన సొలొమోను గూర్చి పలుకుతున్న మాటలు..అవి మర్మగర్భితంగా రాబోయే క్రీస్తును గూర్చి, ఆయన పరిపాలన గురించిన ప్రవచన వాక్యాలు. సొలొమోను భూసంభంధమైన జ్ఞానంతో, సమాధానంతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మనుష్యులతో సహవాస సంభంధం మీద చూపిన శ్రద్ధ దేవుని సహవాసంపై చూపలేకపోయ్యాడు. మనుష్యులందరితో సమాధానం ఉంది కానీ తన దేవునితో సమాధానం లేదు! లోకరిత్యా అత్యంత జ్ఞానవంతుడు చివరికి భక్తి నుండి తొలగిపొయ్యాడు. మానవరీత్యా చెప్పుకుంటే క్రీస్తుకు బట్టి భూసంభందమైన సమాధానం (మనుష్యుల వైపు నుండి) మనుష్యులతో లేదు. ఆయన్ను ద్వేషించువారు అనేకులు! చివరికి ప్రాణాన్ని సైతం తీసివేయ్యాలని వెంటాడే శత్రువులు ఆయనకు ఉన్నారు. కానీ ప్రవచనానుసారం ఆయనకు "సమాధానాధిపతి" అని పేరు!(యెషయా 9:6).

■ "ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పబడినట్లుగా, క్రీస్తు రాజ్యం భూసంభందమైనది కాదని మనకు తెల్సు! (యోహాను 18:36).అలాగే ఆయన సమాధానం భూసంభంధమైనది కాదు.

౼ ప్రభువు మత్తయి 10:22 లో చెప్పిన ప్రకారం మనం(క్రీస్తు శిష్యులు) అనేక మందిచేత ద్వేషించబడతాము. మనల్ని శ్రమ పెట్టే శత్రువులు తయారవుతారు(2 తిమో 3:12).లోకంలో మనకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది, అనేక శ్రమలు అనుభవించాకే దేవుని రాజ్యంలో చేరాలని వాక్యం చెప్తుంది. మరి మనుష్యులతో సమాధానం ఎలా దొరుకుతుంది?

సిలువపై క్రీస్తు ఉన్నప్పుడు అందరూ కోపంతో, పగతో ఆయనపై రగిలిపోతున్నప్పటికీ, ఆయన వారి పట్ల క్షమాపణతో, దేవుని ప్రేమతో నింపబడినట్లుగా సమాధానాన్ని వెంటాడాడు. దానికి కారణం ఆయనకు దేవునితో సమాధానం ఉన్నది గనుక! దేవునితో సమాధానం- ఒకనికి మనుషులను భరించడం, సహించడం, క్షమించడం నేర్పుతుంది.ఎందుకంటే దేవుడు మన (నా) విస్తార దోషాలను క్షమించాడు అనేదే ఆ క్షమాపణకు మూలాధారం.కనుక ఇలాంటి దైవమానవ సమాధానాన్ని- సమాధానాధిపతియైన క్రీస్తు మూలంగానే మానవాళి పొందుకుంటుంది.(నేడు ఆ సమాధాన పర్చే క్రీస్తు-పరిచర్యను దేవుడు మనకు ఇచ్చాడు. 2 కొరింథి 5:18-20).

మనుష్యులంతా ఒక వ్యక్తిని 'మంచి వాడ'ని పొగిడినా దేవుడు అలా చెప్పకపోతే ఆ సాక్ష్యం ఎందుకూ పనికి రాదు. దేవుని సమాధానాన్ని విడిచి పెట్టి ఇహలోక సమాధానం కోసం ఆత్ర పడొద్దు(సొలొమోను వలె)! ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు, అపొస్తలులు లోకసంబంధులైన మనుషుల చేత రకరకాల చెడ్డ పేర్లతో పిలువబడ్డారు. కానీ అవన్నీ దేవుని ముందు కొట్టివేయబడ్డాయి. నీవు ఎవరి ముందు బ్రతుకుతున్నావో వారి ఆ సాక్ష్యన్ని ఘనంగా ఎంచుతావు(1రాజు 17:1).

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...