❇ ప్రభువు ఎఫెసులోని సంఘంతో౼ "నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు...ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం ప్రయాస పడుతూ అలసి పోలేదనీ నాకు తెలుసు. అయినా నీకు వ్యతిరేకంగా ఒక నేరం మోపాల్సివుంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావ్! కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తుచేసుకో(నీవు ఎంత దిగజారిపోయావో జ్ఞాపకం తెచ్చుకో). పశ్చాత్తాప పడి ప్రారంభంలో చేసిన పనులు మళ్ళీ చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీప స్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను"(ప్రకటన 2:1-5) ❇ ✔ ఎఫెస్సు సంఘంలో దుర్భోధ లేదు. ఆత్మలను వివేచించి కపట భోదకులను గుర్తుపట్టి అలాంటి వారిని సంఘంలోకి రానివ్వలేదు. దేవుని నిమిత్తం ఎన్నో శ్రమలను సహించారు, భరించారు. పౌలు, తిమోతి ఉన్న రోజుల్లో ఎఫెస్సు పట్ల ఎంతో శ్రద్ధ చూపించారు(అపో 20:31, 1తిమో 1:3). తర్వాత రోజుల్లో సేవ జరుగుతుంది కానీ దేవునిపై ఉన్న తొలిప్రేమ తొలగిపోయింది. పైన చెప్పిన ఎన్నో మంచి పనులు ఉన్నప్పటికిని..(ఈ స్థితిని) వీరిని దేవుడు పడిపోయిన వారిగా (back slidders) పిలుస్తున్నాడు. ఎఫెస్సు సంఘాన్ని మనం...
This ministry started for the encouragment of readers to mould them into God's shape. Daily devotion written by Bro.Christopher.