❇ ప్రభువు ఎఫెసులోని సంఘంతో౼ "నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు...ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం ప్రయాస పడుతూ అలసి పోలేదనీ నాకు తెలుసు.
అయినా నీకు వ్యతిరేకంగా ఒక నేరం మోపాల్సివుంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావ్! కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తుచేసుకో(నీవు ఎంత దిగజారిపోయావో జ్ఞాపకం తెచ్చుకో). పశ్చాత్తాప పడి ప్రారంభంలో చేసిన పనులు మళ్ళీ చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీప స్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను"(ప్రకటన 2:1-5) ❇
✔ ఎఫెస్సు సంఘంలో దుర్భోధ లేదు. ఆత్మలను వివేచించి కపట భోదకులను గుర్తుపట్టి అలాంటి వారిని సంఘంలోకి రానివ్వలేదు. దేవుని నిమిత్తం ఎన్నో శ్రమలను సహించారు, భరించారు. పౌలు, తిమోతి ఉన్న రోజుల్లో ఎఫెస్సు పట్ల ఎంతో శ్రద్ధ చూపించారు(అపో 20:31, 1తిమో 1:3). తర్వాత రోజుల్లో సేవ జరుగుతుంది కానీ దేవునిపై ఉన్న తొలిప్రేమ తొలగిపోయింది. పైన చెప్పిన ఎన్నో మంచి పనులు ఉన్నప్పటికిని..(ఈ స్థితిని) వీరిని దేవుడు పడిపోయిన వారిగా (back slidders) పిలుస్తున్నాడు. ఎఫెస్సు సంఘాన్ని మనం చూసినట్లైతే, దేవుడు ఈ సంఘం గురించి ఇలా అనుకుంటున్నాడని ఉహించగలమా? ఒకని సేవ జీవితం వాని భక్తి జీవితాన్ని సూచించదు. పెద్ద సమూహం ఉన్న సంఘంలో దేవుని ఆత్మ ఉన్నాడని చెప్పలేము. దేవుని చూపు ఎంత భిన్నమైనది!
✔ 'సేవ కంటే వ్యక్తిగత దేవుని సహవాసానికి' ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తించగలం. దేవునితో గల సన్నిహిత సంబంధం దైవ సారూప్యంలోకి మార్చుతుంది. ఒకప్పుడు దానితో ప్రారంభించబడి, నేడు దైవ లక్షణాలను నిర్లక్ష్యం చేసి, 'సేవ..సేవ..' అని తనమునకలయ్యే అవకాశం లేకపోలేదు.
ఎఫెస్సు సంఘం నేడు మనకు హెచ్చరికగావుంది.
✔ దేవుడు ఎఫెస్సు సంఘంతో మారుమస్సు గూర్చి ఇతరులకు ప్రకటించమని చెప్పట్లేదు.. 'నీవు మారుమస్సు పొందు!' అని చెప్తున్నాడు. అలా పొందనప్పుడు ఆయన ఆత్మ మన (మధ్య) నుండి వెడలిపొయ్యే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నాడు. సంఘంలో విస్తారమైన జనులు ఉన్నప్పటికి(లేకపోయినప్పటికి) చక్కటి స్వరాలతో వాయిద్యాలతో పాటలు పాడితే ఏమి ఉపయోగం? దేవుడు లేని౼మార్పులేని, సంఘంగా/సేవగా అది ఉన్నప్పుడు. అలాంటి సంఘాల్లోకి/సేవల్లోకి లోకం ప్రవేశిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది వ్యక్తిగత జీవితాలకు కూడా అన్వయించబడుతుంది. ఇది మంచి సమయం తిరిగి మారుమనస్సు పొందడానికి.
🔹పౌలు-"ఆసక్తి విషయంలో వెనకబడి పోవద్దు, ఆత్మలో తీవ్రతగలవారై ప్రభువును సేవించండి" (రోమా 12:11)

Comments
Post a Comment