Skip to main content

Posts

Showing posts from January 25, 2018

25Jan2018

❇ హేరోదు రాజు తన తోబుట్టువైన ఫిలిప్పు భార్య హేరోదియ తెచ్చుకున్నాడు. బాప్తిసమిచ్చే యోహాను రాజుతో౼“నీ సోదరుని భార్యను ఉంచుకోవడం అన్యాయం”అంటూ వచ్చాడు. గనుక యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు బాగా తెల్సు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహానుకు భయపడేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.తన పుట్టిన రోజునాడు హేరోదు తన రాజ్యంలోని అధికారులను,గలిలయలోని గొప్పవారిని పిలిచి విందు చేశాడు.ఆ సమయంలో హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధుల్ని మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో౼“నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు. ఆమె తన తల్లిచేత ప్రేరేపించబడినదై౼“బాప్తిసమిచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి” అని అడిగింది.రాజు చాలా దుఃఖం పడ్డాడు కాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేకపోయి, ఆ ప్రకారమే జరిగించాడు. ❇ ■ 'ప్రవక్త'౼దేవుని వాక్కును ...