Skip to main content

25Jan2018


❇ హేరోదు రాజు తన తోబుట్టువైన ఫిలిప్పు భార్య హేరోదియ తెచ్చుకున్నాడు. బాప్తిసమిచ్చే యోహాను రాజుతో౼“నీ సోదరుని భార్యను ఉంచుకోవడం అన్యాయం”అంటూ వచ్చాడు. గనుక యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు బాగా తెల్సు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహానుకు భయపడేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.తన పుట్టిన రోజునాడు హేరోదు తన రాజ్యంలోని అధికారులను,గలిలయలోని గొప్పవారిని పిలిచి విందు చేశాడు.ఆ సమయంలో హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధుల్ని మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో౼“నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు.

ఆమె తన తల్లిచేత ప్రేరేపించబడినదై౼“బాప్తిసమిచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి” అని అడిగింది.రాజు చాలా దుఃఖం పడ్డాడు కాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేకపోయి, ఆ ప్రకారమే జరిగించాడు. ❇


■ 'ప్రవక్త'౼దేవుని వాక్కును (కల్తీ లేకుండా)యధాతథంగా మోసుకొచ్చేవాడని అర్ధం!ఆ వాక్కు భవిష్యత్తు/హెచ్చరిక/ఆదరణ/వెల్లవల్సిన మార్గం కావొచ్చు!(క్రొత్తనిభంధనలో సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు ప్రవక్తలను వాడుకుంటాడు). సరిగ్గా ఎవరితో(/సంఘంతో), ఏమని దేవుడు పలుకమన్నాడో భయపడక, మెప్పుకోరక ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు అవసరమైన దేవుని వాక్కును అందించే వాడే నిజ ప్రవక్త! బాప్తిసమిచ్చు యోహాను దేవుని ప్రవక్త! హేరోదును, హేరోదియను గద్దింపు వెనుక యోహాను ఉద్దేశ్యం విమర్శ కాదు గాని వారి ఆత్మల పట్ల దేవుని ప్రేమే! ధర్మశాస్తం ప్రకారం అది పాపం!అంతమాత్రమే కాక అనేకుల ముందు రాజుగా నిలబడివున్న హేరోదు ఒక తప్పుడు మాదిరిని ఇస్తూ అనేకులు పాపం చెయ్యడానికి కారణంగా ఉన్నాడు. కానీ వారు దేవుని సేవకుని(దేవుని) మీద తిరుగుబాటు చేశారు.ఉత్తరాన్ని బట్టి postman మీద కోప్పడి,హానిచేస్తే ఏమి ప్రయోజనం, దాన్ని పంపినవానితోనే కదా అసలు చిక్కు!

■ దేవుని వాక్కు వెలుగులాంటిది. అది మన చీకటి బ్రతుకు మీద ప్రకాశించినప్పుడు ఆ వెలుగులో సరిచేసుకోవాలే గాని తిరుగుబాటు చెయ్యకూడదు!దావీదు కూడా ఇదే పాపం చేశాడు కానీ దేవుడు గద్దించగా పశ్చాత్తాపడ్డాడు గాని తిరుగుబాటు చెయ్యలేదు.గద్దింపును తెచ్చిన వ్యక్తిని ఘనంగా ఎంచాడు.సత్యాన్ని వినాలన్నా, కళ్లముందు దానిని నిలిచివుంచాలన్నా ధైర్యం కావాలి!!! దేవుని మాటే సత్యం! (TRUTH is not just as an information to our heads). ప్రవచన వాక్యం నేడు మన జీవితానికి సరిగ్గా సరిపొయ్యే మాటగా ఉంటుంది. హేరోదు-హేరోదియ చర్యలను దేవుడు వ్యభిచారంతో సమానంగా చూస్తున్నాడు.వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని విమర్శకుల నుండి క్రీస్తు కాపాడాడు.కాబట్టి క్రీస్తు ఉన్నట్లయితే యోహానును గద్దించి వీరిని కాపాడేవాడా? ఖచ్చితంగా కాదు!వారి చర్యల పట్ల వారి వైఖరి ఏంటి?పశ్చాత్తాపం ఉందా?లేక (అనుకున్నది దొరికింది కాబట్టి)దేవుణ్ని ఇప్పుడు క్షమాపణ అడిగాననే దొంగ నాటకాలు ఆడే జిత్తుల మారి నక్కలా?పరీక్షించాలి! అలాంటి వారు తమను గద్దించు వారి మీదకి దాడికి దిగుతారు.హేరోదు-హేరోదియలు అలాంటి వారే! క్రీస్తు కాపాడిన వ్యభిచారిణి, తన తప్పును యదార్ధంగా అంగికరించింది. ఎవ్వరి మీద ప్రతివిమర్శ చెయ్యలేదు.క్రీస్తు పరిసయ్యుల విషయంలో యోహాను వలె ఖండిచాడు.కృపను తప్పుడు స్థానంలో ఉంచి పాపంలో నిలిచి ఉండే వారికి ఆసరాగా నిలవకూడదు.వారి తప్పును బట్టి దేవుడు మనల్ని తీర్పులోకి తెస్తాడు.

◆ నిజంగా ప్రవచన వరం కలిగిన వ్యక్తులు(popular) ఖ్యాతి గడించరు గాని ఎక్కువ తిరస్కారానికి లోనౌతారు(క్రీస్తు,బాప్తిసమిచ్చు యోహాను ఇద్దరూ అందుకే చంపబడ్డారు).రెండు నిబంధనల్లో జరిగిన సంగతి ఇదే!ఈ పరిచర్యకు కావాల్సిన అర్హత-ఎవరి మధ్యలో ఈ సేవ చేస్తున్నవో వారిపట్ల మిక్కిలి ప్రేమ కలిగి ఉండటం.

పౌలు౼"ప్రవచన వరాన్ని ఆపేక్షించండి"(1కోరింది 14:1)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...