Skip to main content

Posts

Showing posts from January 30, 2018

30Jan2018

యేసు౼"నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తల్ని కూడా మనుషులు ఇలాగే హింసించారు" (మత్త 5:11,12). పరిమిత జ్ఞానం కలిగిన మనిషి, అనంతుడైన దేవుని ఆలోచనలను సంపూర్ణంగా ఎన్నడూ అర్ధం చేసుకోలేడు. దేవుడు విశ్వాసి జీవితంలో శ్రమలను, అవమానాలను తప్పించకుండా ఎందుకు అనుమాతిస్తున్నట్లు? శ్రమ వెనుక దేవుని ప్రణాళిక:-- ◆ శ్రమ విశ్వాసిని పరీక్షిస్తుంది: పేతురు శ్రమ రానంత వరకూ 'నీ కోసం ప్రాణం పెడతా' నని అన్నాడు. శ్రమ ద్వారా పరీక్ష కలిగినప్పుడు తన స్థితి తాను గ్రహించగలిగాడు.(లూకా 22:33, 62) ◆శ్రమ విధేయతను నేర్పిస్తుంది: క్రీస్తు దేవుని కుమారుడైనప్పటికీ శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు.(హెబ్రీ 5:8) ◆శ్రమ ఓర్పును, దేవుని పై విశ్వాసాన్ని పుట్టిస్తుంది: శ్రమల గుండా వెళ్తున్న థేస్సలోక సంఘానికి పౌలు లేఖ వ్రాస్తూ ఈ విషయాలను ప్రస్తావించాడు.(2థేస్స 1:4) ◆శ్రమ దేవుణ్ని అనుకోవడం నేర్పుతుంది: అరణ్యంలో సౌలు నుండి ద...