Skip to main content

Posts

Showing posts from January 18, 2018

18Jan2018

❇ రెండు సంవత్సరాల తరువాత ఫరో రాజుకు ఒక కల వచ్చింది. ఉదయమైనప్పుడు అతని మనసు కలతగా ఉంది.కనుక అతడు ఐగుప్తుదేశంలో ఉన్న మాంత్రికులనూ పండితులనూ అందరినీ పిలిపించి తన కలలను వాళ్ళతో చెప్పాడు. కానీ ఫరోకు ఆ కల భావం తెలపడం ఎవరి వల్ల కాలేదు.అప్పుడు రాజుకు పానపాత్ర అందించేవాడు యోసేపును గూర్చి రాజుతో చెప్పాడు. అప్పుడు చక్రవర్తి యోసేపును పిలిపించాడు. అతణ్ణి చెరసాలలో నుంచి త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకొని బట్టలు మార్చుకొని ఫరో దగ్గరకు వచ్చాడు. ఫరో యోసేపుతో౼“నేను ఒక కల కన్నాను. దాని భావం చెప్పడానికి ఎవరిచేతా కాకపోయింది. నీవు కలలు వింటే వాటి భావాలు తెలుపగలవని నీ గురించి విన్నాను” అన్నాడు. యోసేపు౼“అది నా చేత అయ్యేది కాదు. దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని జవాబిచ్చాడు ❇ ■ చెరసాలలో ఉన్న యోసేపు దేవుడు ఇచ్చే విడుదల కోసం చాలా సంవత్సరాల నుండి కనిపెట్టసాగాడు. దేవుడు చేసిన వాగ్ధానంకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నా, వాగ్ధానంకు ఆధారమైన వాణ్ణే యేసేపు దృష్టించాడు. దేవుడు తన కోసం ఏం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడో అతను గుర్తెరుగలేదు. ఆ చివరి రోజు చెరసాలలో అతని ప్రార్ధన(Revelation) నిజంగా గొప్పద...