Skip to main content

18Jan2018

❇ రెండు సంవత్సరాల తరువాత ఫరో రాజుకు ఒక కల వచ్చింది. ఉదయమైనప్పుడు అతని మనసు కలతగా ఉంది.కనుక అతడు ఐగుప్తుదేశంలో ఉన్న మాంత్రికులనూ పండితులనూ అందరినీ పిలిపించి తన కలలను వాళ్ళతో చెప్పాడు. కానీ ఫరోకు ఆ కల భావం తెలపడం ఎవరి వల్ల కాలేదు.అప్పుడు రాజుకు పానపాత్ర అందించేవాడు యోసేపును గూర్చి రాజుతో చెప్పాడు. అప్పుడు చక్రవర్తి యోసేపును పిలిపించాడు. అతణ్ణి చెరసాలలో నుంచి త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకొని బట్టలు మార్చుకొని ఫరో దగ్గరకు వచ్చాడు. ఫరో యోసేపుతో౼“నేను ఒక కల కన్నాను. దాని భావం చెప్పడానికి ఎవరిచేతా కాకపోయింది. నీవు కలలు వింటే వాటి భావాలు తెలుపగలవని నీ గురించి విన్నాను” అన్నాడు. యోసేపు౼“అది నా చేత అయ్యేది కాదు. దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని జవాబిచ్చాడు ❇ ■ చెరసాలలో ఉన్న యోసేపు దేవుడు ఇచ్చే విడుదల కోసం చాలా సంవత్సరాల నుండి కనిపెట్టసాగాడు. దేవుడు చేసిన వాగ్ధానంకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నా, వాగ్ధానంకు ఆధారమైన వాణ్ణే యేసేపు దృష్టించాడు. దేవుడు తన కోసం ఏం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడో అతను గుర్తెరుగలేదు. ఆ చివరి రోజు చెరసాలలో అతని ప్రార్ధన(Revelation) నిజంగా గొప్పదిగా ఉండిఉండొచ్చు (యోనా 2:9,10). చెరసాలలో దేవుడు తనకు అప్పగించిన పని శ్రద్ధగా ముగించి ఆ రాత్రి కూడా నిద్రపోయి ఉంటాడు(కీర్తన 127:2). అదే రాత్రి యేసేపు- రాజు ముందు కనబడటానికి కావాల్సిన పరిస్థితులను దేవుడే కలుగజేస్తున్నాడు (కలవరపర్చే కలలను దేవుడే ఫరోకు ఇచ్చాడు). దేవుని మీద విశ్వాసం పెట్టుకున్న తన దాసుణ్ణి దేవుడే తనదైన సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. చెరసాల నుండి అంతఃపుర (prison to palace) ప్రయాణానికి తీసుకెళ్లడానికి దేవునికి ఒక గడియ చాలు. దేవుని బలాన్ని గుర్తించి, ఆనుకోవడమే విశ్వాసం! ■ దాదాపు 13 సం౹౹ నిరీక్షణలో(pit to palace)ఎన్నో ఒడిదుడుకులు మధ్య నుండి దేవుడు యోసేపును తీసుకెళ్ళాడు. దేవుని యెదుట, ఆయన ఉంచిన చోట తన నమ్మకత్వాన్ని కనపరచాడు. ఐగుప్తును గొప్ప కరువు నుండి రక్షించగల జ్ఞానం కలిగిన యేసేపును చెరసాలలో ఒక ఖైదీగా, ఖైదీల మధ్య ఉండటానికి దేవుడు అనుమతిచ్చాడు. దేవుని(Sovereignty) సర్వభౌమాధికారాన్ని గుర్తించి,దాన్ని గౌరవిస్తూ, లోబడం తెల్సిన వానిగా రూపుదిద్దబడ్డాడు. ఆ రోజు తెల్లవారినప్పుడు ఫరో సేవకులు తనను ఫరో ముందుకు సిద్ధపరుస్తున్నప్పుడు, దేవుడు కదుపుతున్న పావులను యేసేపు గుర్తుపట్టి ఉండి ఉండొచ్చు.ఐతే ఎందుకు తనను దేవుడు ఐగుప్తుకు నడిపాడో గ్రహించడానికి దేవుని చేతిలోని పరిస్థితులనే గ్రంథాన్ని(Scroll) విప్పేదాక గుర్తించలేదు(ఆది 50:20). మన జీవితాల్లో కూడా అలాగే జరుగుతుంది. నేడు దేవుడుంచిన ప్రదేశంలో దేవునికి లోబడు- తున్నప్పుడు ఆయన చిరకాల ఉద్దేశ్యలనే (Scrollను) గ్రంథాన్ని విప్పుతూ వెళ్తాడు. ఆ సమయంలో దేవుడు తన శ్రేష్ఠమైన ఆధ్యాత్మిక పాఠాలను నేర్పుతాడు. ఆ పాఠాలు తరువాతి ఆయన చిత్తం నెరవేర్పుకు ఎంతగానో దోహతపడతాయి. ౼ పరలోకం వైపు(దేవుని మీదకి) మన దృష్టి మరలినప్పుడు పరిస్థితులు, వ్యక్తులు కనుమరుగవుతారు. ఆయన్ను మనం ప్రేమిస్తున్నట్లైతే, మేలు కొరకు నడిపించేది ఆయనే అని మరువోద్దు(రోమా 8:28)! అప్పుడు ప్రతి చెడు మనల్ని మేలు వైపుకే నడిపిస్తాయి. దేవునిపై ఒకని నిరీక్షణ అతణ్ని ఎన్నడూ సిగ్గుపరచదు. 'దేవుడు లేకుండా నేను ఒట్టివాణ్ని-నరుణ్ణి(మానవ బలాన్ని)నమ్ముకోవటం వ్యర్థం-దేవుని ద్వారానే సమస్తం సాధ్యం' అనేది నిరంతరం పాఠంగా ఆయన నేర్పుతూనే ఉంటాడు. ఎందుకంటే అదే సత్యం గనుక! ______________________________ For more posts visit below links https://www.facebook.com/kristop4 https://kristop4.blogspot.com

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...