❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు.
యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను.
యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు.
అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు.
అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇
■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అనుమతి లేదు. మేము అనుమతి ఇవ్వందే నువ్వు ఇక్కడ మాట్లాడకూడదు. నువ్వు మాకు(పెద్దల అధికారానికి) లోబడాలి. మేం చెప్పినట్లే వినాలి. మాలో ఎవ్వరి అధికారం క్రింద నీవు ఉన్నావ్?"
యేసు తిరిగి ప్రశ్నిస్తూ బాప్తిస్మమిచ్చే యోహాను అందరికి బాప్తిస్మము ఇచ్చాడు..అతనికి అధికారం/అనుమతి మీలో ఎవరి దగ్గరైనా దొరికిందా! లేక దేవుడే ఇచ్చాడా?
"మనుష్యుల" దగ్గర నుండి అధికారం౼"దేవుని" దగ్గర నుండి అధికారం అనే రెండు విషయాలు కనిపిస్తున్నాయి.
■ అత్యున్నత సింహాసనంపై ఆశీనుడయున్న దేవుని దగ్గర ఒక అధికారం ఉంది,అది అన్ని భూఅధికారాలన్నిటి కంటే ఉన్నతమైనది, శాశ్వితమైనది.ఈ రోజు కనిపించి, రేపు కనిపించ కుండా పోయే అశాశ్వితమైన, రక్తమాంసాలు కలిగిన మనుషులు ఇచ్చే అధికారం కోసం, వారి మన్నన కోసం మనుషులు పడే ఆత్రం అంత ఇంత కాదు. మరి సర్వోన్నతుడు నియమించిన నియామకం మరి ఇంకెంత గొప్పది.దీనిని అందరూ గుర్తించలేరు గానీ దేవుణ్ని ఆత్మలో చూచేవారు మాత్రమే గుర్తుపట్టగలరు. పై ఉదాహరణల ఆధారంగా ఈ లోక అధికారానికి(మాత్రమే) వంగి, వంగి లోబడేవారికి, దేవుని చేత నేరుగా అధికారం పొందిన వారిని అంగీకరించక, ఎదురాడతారనేది సుస్పష్టం.
■ బాప్తిస్మమిచ్చే యోహానుకు కలిగిన అధికారం అతని పుట్టుకకు ముందే దేవుని దగ్గర నుండి కలిగింది(లూకా 1:14-17).అతన్ని కూడా ఈ గుంపు ఇలానే ప్రశ్నించింది(యోహా 1:25).యేసు వడ్రంగిగా తన శాలలో పని చేస్తున్నప్పుడు దేవుని పిలుపు ఆయన సేవకై పిలుచుకుని నియమించాడు. క్రీస్తు తండ్రియైన దేవుని అధికారం క్రింద ఎల్లప్పుడూ లోబడి
ఉన్నవాడు(యోహా 19:11). అపొస్తలుడైన పౌలు తన నియామకం మనుషుల వలన కలిగింది కాదు సాక్ష్యాత్తు దేవుని నుండే కలిగిందని తెలియపర్చుకున్నాడు(గలతి 1:1). అలాగే దేవుని అధికారం క్రింద ఉన్న దైవనాయకులు దేవుని ఆత్మ చిత్తానుసారంగా నియామకాలను కొనసాగించారు (అ.కా13:1-3). ఇది దేవుని నుండి కలిగే అధికారం.సహజంగా లోకరీత్యా ఆలోచించే వాడు గుర్తుపట్టలేని వారికే దేవుడు ఇస్తాడు(1 కోరింధి 1:26-29).
■ మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా నియమించిన వ్యక్తిని ఎదురురాడితే వారి పక్షాన వత్తాసు పలుకుతారు కదా!అలాగే దేవుని చేత నియమించబడిన అధికారానికి మనుష్యులు ఎదురాడితే కూడా దేవుడు కలుగజేసుకుంటాడు(అ.కా 5:39). కానీ ఆయన, ఆయన సమయంలోనే పని చేస్తాడు.
౼"మాపై అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్ను నియమించిన వాడు ఎవడ"ని ఇశ్రాయేలీయులు నిరాకరించిన ఈ మోషేను, అతనికి పొదలో కనబడిన దూత ద్వారా దేవుడు అధికారిగా విమోచకునిగా నియమించి పంపాడు(అ.కా 7:35).
(దయచేసి పైన వ్రాసిన రిఫరెన్స్ చదవండి)
Comments
Post a Comment