Skip to main content

Posts

Showing posts from November 7, 2017

07Nov2017

❇ దెలీలా తన తొడ మీద సమ్సోణ్ని నిద్రపోయేలా చేసి, ఒక మనిషిని పిలిపించి, సమ్సోను తలమీద ఉన్న ఏడు జడలు గొరిగించింది. సమ్సోను బలహీనుడయ్యాడు. అప్పుడామె అతణ్ణి బాధించడం మొదలు పెట్టింది. మరియు ఆమె౼“సమ్సోను! ఫిలిష్తీయులు మీ మీదికి వచ్చేస్తున్నారు” అని ఆమె అరచింది. అతడు నిద్ర మేల్కొని “మునుపులాగే బయటికి వెళ్ళి విజృంభిస్తాను” అనుకొన్నాడు. యెహోవా తనను విడిచిపెట్టాడని అతనికి తెలియదు. వెంటనే ఫిలిష్తీయులు అతణ్ణి పట్టుకొన్నారు. అతని కళ్ళు ఊడబెరికారు. అతణ్ణి గాజాకు తీసుకుపొయ్యారు. అక్కడ అతణ్ణి కంచు గొలుసులతో కట్టివేసి, ఖైదులో తిరగలి విసిరేవాడుగా చేశారు. అయితే గొరిగిన అతని తలవెండ్రుకలు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి.❇ ■ సమ్సోను పుట్టుక చాలా ప్రత్యేకమైనది. బైబిల్ లో అతి కొద్దిమంది గూర్చి మాత్రమే, ఒకడు పుట్టక మునుపే వాని జననం గూర్చి, వాని పట్ల దేవుని ప్రణాళికల గూర్చి దేవుడు ముందుగానే తెలియజేశాడు. సమ్సోను వారిలో ఒకడు. దేవుడు తన దూతను పంపి తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెప్పి, హెచ్చరించి దేవునికి ప్రతిష్ఠితుడైన వాడని తెలియజేశాడు. ఒక్క సమ్సోనే దేవుని సైన్యంలా వాడబడ్డ గొప్ప బలశాలి. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబ...