Skip to main content

Posts

Showing posts from April 11, 2018

11Apr2018

✴️ దేవుడు౼"నాకు విరోధంగా మీరు చాలా గర్వంగా మాట్లాడారు" "నిన్ను గూర్చి ఏమని మాట్లాడాం?"అని మీరు అడుగుతారు. "'దేవుణ్ని సేవించడం (సేవ చేయడం) వ్యర్ధం. ఆయన ఆజ్ఞలు పాటించి దేవుని సన్నిధిలో మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుతూ ఉండడంవల్ల ఏమి ఉపయోగం? గర్విష్ఠులే దీవెనలు పొందుతున్నారు, దేవుణ్ణి పరీక్షించే దుర్మార్గులు భద్రంగా ఉంటూ వర్ధిల్లుతున్నారు" అని మీరు చెప్పుకుంటున్నారు. అప్పుడు యెహోవా పట్ల భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా ఆ మాటలు విన్నాడు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన నామాన్ని గౌరవించే వారి గురించి జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధానంలో ఒక పుస్తకం రాశారు. "నేను నియమించే రోజు సమీపించినప్పుడు వారు నావారుగా, నా ప్రత్యేక సొత్తుగా ఉంటారు. తండ్రి తనను సేవించే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను" అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు. (మలాకి 3:13-17) ✴️ ■ దేవుడు సర్వజ్ఞాని. ఆయన ప్రతి పని వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశ్యం ఉంటుంది. దేవుడు ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని పరిక్షిస్తాడు. (దీవెన/మేలుకు ముందు కాని లేదా...