Skip to main content

Posts

Showing posts from July 16, 2017

16 July 2017

❇ "ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లి, ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చనిపోవాలని కోరుకొని దేవునికి ఇలా ప్రార్థించాడు-'ప్రభువా, నాకిది చాలు. ఇక నన్ను చనిపోనియ్యండి. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను' అన్నాడు" ❇ ✔ ఏలీయా ప్రార్థనను బట్టి దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. వర్షాన్ని కురిపించాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. సూచక క్రియలను చేశాడు. ఈ ప్రార్థనలన్నీ దేవుని చిత్తానుసారం చేశాడు(1రాజు 18:1,36) ఏలీయా చేసిన అన్ని ప్రార్ధనలను దేవుడు ఆలకించి అంగీకరించాడు. దేవుడు పంపిన ప్రతిచోటికి విశ్వాసంతో ప్రయాణం చేశాడు.  ✔ కానీ పైన చెప్పిన ఒక్క సందర్భంలో అతని ప్రయాణం, ప్రార్థన విశ్వాసం లేని సొంత ఆలోచన. కనుకనే అతని ప్రార్థనను దేవుడు త్రోసిపుచ్చాడు(ప్రార్థనలో దేవునికి సలహాలవ్వకూడదు. నిర్గమ 4:13,14). నిజానికి అనాధికాల దేవుని సంకల్పంలో ఏలీయా మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్లడం దేవుని చిత్తం. కానీ అల్పవిశ్వాసం, భయం, నిరుస్సాహలు దేవుని చిత్తానికి పూర్తి విరుద్ధమైన ప్రార్థనలోనికి, మార్గంలోకి మనల్ని నడిపిస్తాయి (యోహాను 21:3). ❇ "అప్పుడు ఏలీయా నిద్ర...